అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జేసీకి ఆర్టీఏ షాక్, టిప్పర్లు సీజ్, అక్రమ రిజిస్ట్రేషన్, బీఎస్-3 వాహనాలు అని చర్యలు

|
Google Oneindia TeluguNews

మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డికి చెందిన జేసీ ట్రావెల్స్‌కు ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ అధికారులు మరోసారి షాక్ ఇచ్చారు. జేసీ వాహనాలను సీజ్ చేశారు. అక్రమ రిజిస్ట్రేషన్, బీస్-4 ప్రమాణాలు పాటించడం లేదు అని చెబుతున్నారు. ఇప్పుడే కాదు గతంలో కూడా 57 జేసీకి చెందిన వాహనాలను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. మరో 154 వాహనాలను కూడా అక్రమ రిజిస్ట్రేషన్ల పేరుతో నడిపిస్తున్నామని గుర్తించామని.. త్వరలో వాటిని కూడా సీజ్ చేస్తామని డీటీసీ శివరామప్రసాద్ తెలిపారు.

ఏపీ సీఎం జగన్ ఒక్కరికే భయపడుతారు.. ఆయన తప్ప ఎవరినీ లెక్కజేయడు, జేసీ సంచలనం...ఏపీ సీఎం జగన్ ఒక్కరికే భయపడుతారు.. ఆయన తప్ప ఎవరినీ లెక్కజేయడు, జేసీ సంచలనం...

జేసీ ట్రావెల్స్‌కు చెందిన నాలుగు వాహనాలను మంగళవారం రవాణాశాఖ అధికారులు సీజ్ చేశారు. బీసీ-3 వాహనాలను మార్చారని అభియోగం మోపారు. బీసీ-4 వాహనాలను మార్చి నడిపిస్తున్నారని.. ఈ విషయం నిర్ధారణ కూడా అయ్యిందని కూడా శివరామప్రసాద్ తెలిపారు. ఇదే గాక నాగాలాండ్, వివిధ రాష్ట్రాల్లో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్టు గుర్తించామని తెలిపారు. గతంలో కూడా ఈ విధంగా చేస్తే 57 వాహనాల వరకు సీజ్ చేశామని గుర్తుచేశారు. ఇవాళ 4 టిప్పర్లను సీజ్ చేయాల్సి వచ్చిందని వివరించారు.

jc travels tipper seized by ap rta officials

ఇదేవిధంగా మరో 154 వాహనాలు కూడా తిరుగుతున్నాయని శివరామప్రసాద్ తెలిపారు. వాటిని కూడా త్వరలో సీజ్ చేస్తామని చెప్పారు. అక్రమ రిజిస్ట్రేషన్, బీసీ-4 ప్రమాణాలు మార్చడం నేరమే అవుతోందని తెలిపారు. ఏపీ సీఎం జగన్‌పై నిన్న జేసీ దివాకర్ రెడ్డి కామెంట్స్ చేశారు. ఆయన ఒక్క ప్రధాని మోడీకి తప్ప మరెవరికి భయపడరని తెలిపారు. ఆ మరునాడే జేసీ ట్రావెల్స్ కు చెందిన వాహనాలను సీజ్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

English summary
ex mp jc diwakar reddys jc travels four tipper seized by ap rta officials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X