అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అడవిబిడ్డ సాహస యాత్ర.. అనంతపురం చిన్నికృష్ణుడి అపూర్వ విజయాలు

|
Google Oneindia TeluguNews

అనంతపురం : గిరిపుత్రుడు అపూర్వ విజయాలు సాధిస్తున్నాడు. కలలు కంటూ వాటిని సాకారం చేసుకునే దిశగా అడుగులేస్తున్నాడు. పర్వతారోహణ అంటే మక్కువ ఉన్న అడవి బిడ్డగా తన ప్రతిభకు పదును పెట్టుకుంటున్నాడు. అదొక్కటే కాదు ఇంకా చాలా రంగాల్లో రాణిస్తూ ఔరా అనిపిస్తున్నాడు. ఒక గిరిపుత్రుడిగా అవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయంటే.. అతడి పట్టుదలే సమాధానంగా కనిపిస్తోంది. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు తనకు నచ్చిన రంగాల్లో దూసుకెళుతున్నాడు.

పేరుకే ప్రభుత్వ ఉద్యోగం.. ట్రైనింగ్ మరిచారు, జీతాల్లేవు.. ఆ పోస్టుతో తిప్పలెన్నో..! పేరుకే ప్రభుత్వ ఉద్యోగం.. ట్రైనింగ్ మరిచారు, జీతాల్లేవు.. ఆ పోస్టుతో తిప్పలెన్నో..!

 గిరిపుత్రుడి అపూర్వ విజయాలు

గిరిపుత్రుడి అపూర్వ విజయాలు

అనంతపురం జిల్లా పామిడి మండలం పాలెంతండా గ్రామానికి చెందిన లక్ష్మమ్మ, రమావత్‌ నారాయణస్వామి దంపతుల కుమారుడు రమావత్‌ చిన్నికృష్ణ నాయక్‌ (26సం.) తనకు నచ్చిన రంగాల్లో అపూర్వ విజయాలు సాధిస్తున్నాడు. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు తన ప్రతిభకు పదును పెట్టుకుంటున్నాడు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో బీపీఎడ్‌ శిక్షణ పూర్తి చేసుకున్న చిన్నిక‌ృష్ణ.. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని లంబాడి బస్తీలో ఉంటూ తన కలల సాకారానికి కృషి చేస్తున్నాడు.

గిరిజన తండాలో జన్మించిన చిన్నికృష్ణది సాధారణ రైతు కుటుంబం. కుటుంబ పోషణ కూడా భారంగా ఉండే ఫ్యామిలీ నుంచి వచ్చిన చిన్నికృష్ణ ఏనాడు కూడా కష్టాలకు భయపడలేదు. పర్వాతారోహణ అంటే అమితాసక్తి కనబరిచే అతడు అపూర్వ విజయాలు సాధిస్తూ ఔరా అనిపించుకుంటున్నాడు.

చిన్ననాటి నుంచే పర్వతారోహణంపై మక్కువ

చిన్ననాటి నుంచే పర్వతారోహణంపై మక్కువ

మూడవ తరగతి నుంచే గుట్టలు ఎక్కడం అలవాటుగా మార్చుకున్న చిన్నిక‌ృష్ణ పెద్దపెరిగేకొద్దీ పర్వాతారోహణపై దృష్టి సారించాడు. చిననాటి నుంచే అలవోకగా గుట్టలెక్కుతున్న అతడు.. ఆత్మవిశ్వాసం మెండుగా వెనుదిరిగి చూడలేదు. ఆ క్రమంలో గతేడాది నవంబర్ 13వ తేదీన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి రికార్డు నెలకొల్పాడు. హిమాలయాల్లో 17 వేల అడుగుల ఎత్తులో ఉన్న రెనక్‌ పర్వతాన్ని అధిరోహించాడు.

జమ్ము కశ్మీర్‌లోని తులియన్సిక్‌ పర్వతాన్ని కూడా అధిరోహించాడు చిన్నికృష్ణ. అదే ప్రాంతంలోని మరో ఎత్తైన పర్వతం బైసరన్‌ కూడా అధిరోహించాడు. ఆ లక్ష్యాలన్నీ అధిగమించిన తర్వాతే.. కిలిమంజారో పర్వతం అధిరోహించే అద్భుత అవకాశం దక్కింది. ప్రత్యేక శిక్షణ ద్వారా 40 మందిని ఎంపిక చేయగా అందులో ఈ చిన్నికృష్ణుడు 8వ స్థానంలో నిలవడం విశేషం.

 చదువులో ది బెస్ట్.. ఇంకా ఎన్నో రంగాల్లో అద్భుత ప్రతిభ

చదువులో ది బెస్ట్.. ఇంకా ఎన్నో రంగాల్లో అద్భుత ప్రతిభ

చదువుకుంటూనే వివిధ రంగాల్లో రాణిస్తున్నాడు చిన్నికృష్ణ. పర్వతారోహణం ఒకటే కాదు కబడ్డీ, వాలీబాల్, ఖోఖో లాంటి క్రీడల్లోనూ అద్భుత ప్రతిభ కనబరుస్తున్నాడు. అంతేకాదు జానపద గేయ రచయితగా, గాయకుడిగా ప్రశంసలు పొందుతున్నాడు. ఇక కరాటే, స్టిక్ ఫైటర్, డ్యాన్సర్, నటుడిగా ఔరా అనిపించుకుంటున్నాడు. వివిధ పోటీల్లో పాల్గొంటూ ఛాంపియన్‌గా నిలిచాడు.

హమ్మ కిలాడీ.. నటీనటులుగా ఛాన్స్ ఇస్తానంటూ..!హమ్మ కిలాడీ.. నటీనటులుగా ఛాన్స్ ఇస్తానంటూ..!

 అరుదైన అవకాశం.. దాతల కోసం ఎదురుచూపు

అరుదైన అవకాశం.. దాతల కోసం ఎదురుచూపు

రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబంలో జన్మించిన ఈ గిరిపుత్రుడి విజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. పర్వతారోహణలో అతడి ప్రతిభకు అరుదైన అవకాశం దక్కింది. జులై 20వ తేదీన రష్యాలోని ఎల్‌బ్రోస్ పర్వతం అధిరోహించే ఛాన్స్ దక్కింది. మన దేశంలో ఈ అవకాశం దక్కిన అతికొద్ది మందిలో చిన్నికృష్ణ ఒకరు.

అయితే ఆ పర్వతాన్ని అధిరోహించడానికోసం అక్కడకు వెళ్లాలంటే దాదాపు 5 లక్షల రూపాయలు ఖర్చవుతుందని చెబుతున్నాడు చిన్నికృష్ణ. తమ కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే కావడంతో దాతలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. ఎవరైనా తనకు మద్దతుగా సాయం చేయాలనుకునేవారు 83744 34274 ఫోన్ నెంబర్‌లో సంప్రదించాలని కోరుతున్నాడు. రష్యాలోని ఎల్‌బ్రోస్ పర్వతాన్ని అధిరోహించి దేశ కీర్తిని దశదిశలా చాటుతానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

English summary
Tribal Youngster chinni krishna nayak who belongs to anantapur district succed in mount climbing. He got chance to climbing russia's elbrows mountain on july 20th. He requesting that need financial assistance for his trip.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X