• search
  • Live TV
అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వైఎస్ జగన్‌ పాలనపై జేసీ వ్యంగ్యాస్త్రాలు.. మా వాటినే భూతద్దంలో చూస్తారా?

|

అనంతపురం రాజకీయాల్లో తిరుగులేని నేతలుగా ఉన్న జేసీ బ్రదర్స్ కు వైసీపీ ప్రభుత్వం దివాకర్ ట్రావెల్స్ కు సంబంధించి బస్సులు సీజ్ చేసి, పర్మిట్లు రద్దు చేసి షాక్ ఇచ్చింది. ఇక దీంతో అనంతపురంలో జేసీ ఆర్ధిక మూలాలపై వైసీపీ ప్రభుత్వం దెబ్బ కొడుతుందని పెద్ద చర్చే జరుగుతుంది. ఇక జేసీ బ్రదర్స్ కు సంబంధించిన దివాకర్ ట్రావెల్స్ బస్సులు సీజ్ చెయ్యటంపై జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు.

జేసీ బ్రదర్స్ టార్గెట్ అంటున్న వైసీపీ..అందుకే ఆర్ధిక మూలాలపై దెబ్బ: అనంతలో చర్చ

 దివాకర్ ట్రావెల్స్ బస్సులు సీజ్ పై మాట్లాడిన జేసీ దివాకర్ రెడ్డి

దివాకర్ ట్రావెల్స్ బస్సులు సీజ్ పై మాట్లాడిన జేసీ దివాకర్ రెడ్డి

ఎన్నో ట్రావెల్స్ బస్సులుండగా జగన్ కు తమ బస్సులే కనిపిస్తున్నాయని తమ ట్రావెల్స్ కు సంబంధించిన 31 బస్సులను అధికారులు సీజ్ చేశారని పేర్కొన్నారు జేసీ దివాకర్ రెడ్డి. చిన్న చిన్న లోటుపాట్లు ఏ ట్రావెల్స్ లో అయినా సహజం అని అయినా సరే తమ ట్రావెల్స్ బస్సులనే భూతద్దంలో చూశారని ఆయన ఆరోపించారు. ఇక తమ బస్సులను సీజ్ చెయ్యటంపై న్యాయపోరాటం చేస్తామని టీడీపీ నేత,మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. జరిమానాలతో పోయే చిన్న చిన్న తప్పులకు సీజ్ చెయ్యటం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కావాలనే ఇలా చేశారని ఆయన వేదన వ్యక్తం చేశారు.

జగన్ పాలనకు 100కి 150మార్కులు వేస్తున్నానని సెటైర్ వేసిన జేసీ

జగన్ పాలనకు 100కి 150మార్కులు వేస్తున్నానని సెటైర్ వేసిన జేసీ

70 ఏళ్ళ నుండి తాను ట్రావెల్స్ రంగంలో ఉన్నానని ఎప్పుడూ ఇలా జరగలేదని ఆయన పేర్కొన్నారు. ఇక ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి జగన్ అప్పుడు, ఇప్పుడు మా అబ్బాయే అని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ పాలన చాలా జనరంజకంగా సాగుతుందని, అందుకే 100 మార్కులకు 150మార్కులు వేస్తున్నానని ఆయన వ్యంగ్యంగా మాట్లాడారు. కాకుంటే పరిపాలనలో కిందా మీద పడుతున్నాడని వ్యాఖ్యానించారు.

 చిన్న చిన్న లోటుపాట్లు భూతద్దంలో చూసి సీజ్ చేశారన్న జేసీ

చిన్న చిన్న లోటుపాట్లు భూతద్దంలో చూసి సీజ్ చేశారన్న జేసీ

ఆర్టీసీ బస్సులతో సహా అన్ని బస్సుల్లోనూ ఓవర్ లోడ్ జరుగుతుందని , కానీ కావాలనే తన బస్సులనే టార్గెట్ చేసి సీజ్ చేశారని, మూడు నెలల వరకు బస్సులు నడపకుండా సస్పెన్షన్ విధించారని ఆయన పేర్కొన్నారు. తెల్ల చొక్కా మీద భూతద్దం పెట్టి వెతికి నల్ల మారక ఉందని మొత్తం చొక్కానే నల్లది అనటం సబబు కాదని, తన బస్సుల విషయంలో అదే జరిగింది అని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. బస్సులు సీజ్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టటం వెనుక ఉన్నవి చాలా చిన్న కారణాలని ఆయన అన్నారు. లీగల్ గా పోరాటం చేస్తానని చెప్పారు.

 న్యాయ పోరాటం చేస్తామన్న జేసీ దివాకర్ రెడ్డి

న్యాయ పోరాటం చేస్తామన్న జేసీ దివాకర్ రెడ్డి

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి టీడీపీలో కీలక నాయకులను టార్గెట్ చేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో వారు చేసిన అక్రమాలను బయటకు తెస్తుంది. అంతే కాదు కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తుంది అన్నది టీడీపీ వాదన. ఈ నేపధ్యంలోనే అనంతపురం జిల్లా టీడీపీ కీలక నేతలు టార్గెట్ గా జేసీ బ్రదర్స్ కు సంబంధించిన దివాకర్ ట్రావెల్స్ బస్సులు సీజ్ చేసి జేసీ బ్రదర్స్ కి తలనొప్పి తెచ్చి పెట్టారు. ఇక న్యాయ పోరాటానికి దిగుతా అన్న ఆయన జగన్ పాలన చాలా చక్కగా చేస్తున్నారని , 100కి 150 మార్కులేస్తానని చెప్పి సెటైర్లు వేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
There are so many travel buses but ycp government targeted only diwakar travels buses JC Diwakar reddy said. He alleged that small bugs are common in any travels and that they have seen their travel buses under the microscope . Former TDP leader and former MP JC Diwakar Reddy said that they will fight according to law He expressed his anguish that this was done deliberately.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more