అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నందమూరి బాలకృష్ణకు ఇంత అవమానమా?: ఒంటరిగానే బెంగళూరుకు!

|
Google Oneindia TeluguNews

అనంతపురం: హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. తెలుగు రాష్ట్రాల్లో బాలకృష్ణకు భారీ ఫ్యాన్ ఫోలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఆయన ఎక్కడికెళ్లినా ఆయనను చూసేందుకు భారీగా అభిమానులు వస్తుంటారు. పలుమార్లు అభిమానుల తోపులాటలు కూడా చేసుకున్నాయి.

ఇదేనా రైతు ప్రభుత్వం..? ప్రభుత్వాన్ని నిలదీసిన హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ..!!ఇదేనా రైతు ప్రభుత్వం..? ప్రభుత్వాన్ని నిలదీసిన హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ..!!

స్పందించని పోలీసులు..

స్పందించని పోలీసులు..

కాగా, బెంగళూరు వెళ్లేందుకు తనకు భద్రత కల్పించాలంటూ మూడు పోలీస్ స్టేషన్లలో సమాచారం ఇచ్చారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. అయితే, ఆయనకు ఎస్కార్ట్ ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో బాలకృష్ణ ఒక్కరే తన వాహనంలో బెంగళూరుకు వెళ్లాల్సి వచ్చింది.

బాలయ్యను అడ్డుకున్నారు..

బాలయ్యను అడ్డుకున్నారు..

గురువారం హిందూపురం నియోజకవర్గంలో బాలకృష్ణను కొందరు స్థానికులు అడ్డుకున్నారు. టీడీపీ అధికార ప్రతినిధి రమేష్ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు వెళ్లుండగా ఎమ్మెల్యే బాలకృష్ణను స్థానికులు అడ్డుకున్నారు. తమ ఊరిని పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఏడాదైనా ఏది పని..

ఏడాదైనా ఏది పని..

లేపాక్షి మండలంలోని గలిబిపల్లి గ్రామస్తులు నందమూరి బాలకృష్ణను నిలదీశారు. లేపాక్షి-హిందూపురం మెయిన్ రోడ్డు నుంచి గలిబిపల్లికి రోడ్డు వేసేందుకు భూమి పూజ చేసి దాదాపుగా సంవత్సరం అయ్యిందని, ఇప్పటికీ పనులు మాత్రం పూర్తి కాలేదని వాపోయారు. బాలయ్య అటువైపు వెళ్లున్న విషయం గమనించి ఆయనను అడ్డుకుని విషయం చెప్పారు.

కావాలనే చేస్తున్నారు..

కావాలనే చేస్తున్నారు..

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బాలకృష్ణ బెంగళూరు పర్యటనకు వెళ్లే ముందు తనకు ఎస్కార్ట్ వాహనం కావాలంటూ మూడు పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. అయితే, ఏ ఒక్క పోలీస్ స్టేషన్ నుంచి కూడా స్పందన రాకపోవడంతో బాలయ్య తన వాహనంలోనే బెంగళూరుకు బయల్దేరారు. ఈ విషయం తెలిసిన తెలుగుదేశం పార్టీ నేతలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారుపై విమర్శలు గుప్పించారు. ఉద్దేశపూర్వకంగానే బాలకృష్ణకు భద్రత కల్పించలేదని మండిపడ్డారు.

English summary
Police didn't responded to MLA Nandamuri Balakrishna's request for escort vehicle arrangement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X