అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆస్తుల ధ్వంసం..చెట్ల‌కు చెప్పులు: అనంత‌లో రాజ‌కీయ వేధింపులు: టీడీపీ శ్రేణులే ల‌క్ష్యంగా...!

|
Google Oneindia TeluguNews

ఎన్నిక‌లు పూర్త‌యినా..కొత్త ప్ర‌భుత్వ ఏర్ప‌డినా ఇంకా రాజ‌కీయ దాడులు కొన‌సాగుతూనే ఉన్నాయి. అనంత‌పురం జిల్లాలోని అనేక నియోజ‌క‌వ‌ర్గా ప‌రిధిలో టీడీపీ..వైసీపీ శ్రేణుల మ‌ధ్య ఇంకా యుద్ద వాతావ‌ర‌ణం కొన‌సాగుతోంది. జిల్లా లో ఇప్ప‌టికే ఇద్ద‌రు టీడీపీ కార్య‌క‌ర్త‌లు మృతి చెందారు. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు సైతం మ‌ర‌ణించిన కార్య‌క‌ర్త‌ల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ విగ్ర‌హాల ధ్వంసం..చెట్ల‌కు చెప్పులు క‌ట్ట‌టం..చెప్పులు విప్పి న‌డ‌వాల‌ని హుకుం జారీ చేయ‌టం వంటివి శృతి మించాయి. ఎన్నిక‌ల స‌మ‌యం నాటి ఇవి కొన‌సాగుతూనే ఉన్నాయి.

Recommended Video

మరో టీడీపీ ఎమ్మెల్యే ఎన్నికపై హై కోర్టులో పిటీషన్
చెప్పులు వేసుకొని న‌డ‌వ‌కూడ‌దంటూ..

చెప్పులు వేసుకొని న‌డ‌వ‌కూడ‌దంటూ..

అనంత‌పురి జిల్లాలో రాజ‌కీయ క‌క్ష్య‌లు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. జిల్లాలోని డీ హీరేహాళ్ మండ‌లంలోని క‌ల్యం గ్రామం లో వైసీపీ నేత‌లు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. వైసీపీకి చెందిన స్థానిక వైసీపీ నేత గిడ్డ ఈర‌న్న టీడీపీ నేత‌ల‌ను అవ మానించ‌టం కోస‌మే ఇలా చెట్ల‌కు చెప్పులు క‌ట్టారు. ఈ వీధిలో ఎక్కువ మంది టీడీపీకి చెందిన వారు ఉండడంతో వా రు తిరిగేటప్పుడు చెప్పుల కింద నడవాలని ఇలా చేశాడు. దీంతో టీడీపీ నాయకులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి చెప్పులు తొలగించారు. ఇదే విధంగా..జిల్లాలోని ప‌లు ప్రాంతాల్లో విగ్ర‌హాల‌ను ధ్వంసం చేసారు. ఎన్నిక‌ల స‌మ‌యం నుండి ఈ ఆగ‌డాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. రెండు పార్టీల నేత‌లు క‌క్ష్య‌తో వ్య‌వ‌హ‌రిస్తూ ఎదుటి పార్టీ నేత‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నారు. ప‌లు చోట్ల పార్టీల నేత‌ల ఆస్తులు సైతం ధ్వంసం అయ్యాయి. వాట‌ర్ ప్లాంట్ల‌ను మూసివేసారు. ధౌర్జ‌న్యాల‌తో ఎప్పుడు ఏం జ‌రుగుతుందా అనే ఉత్కంఠ క‌నిపిస్తోంది.

తాడిప‌త్రి కేంద్రంగా ఎన్నో దౌర్జ‌న్యాలు..

తాడిప‌త్రి కేంద్రంగా ఎన్నో దౌర్జ‌న్యాలు..

జిల్లాలోని తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో రాజ‌కీయ దౌర్జ‌న్యాలు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి. తాడిపత్రి పట్టణ సమీ పంలోని చుక్కలూరు క్రాస్‌లోని గ్రానైట్‌ ఫ్యాక్టరీ యజమాని, టీడీపీ మాజీ కౌన్సిలర్‌ దబ్బర లక్ష్మిదేవి భర్త అయిన దబ్బర బాబుకు చెందిన గ్రానైట్‌ ఫ్యాక్టరీని పగులకొట్టి వైసీపీ మద్దతుదారులు బలవంతంగా జీపులో కిడ్నాప్‌ చేసి కొట్టి వదిలిపెట్టారు. పట్టణంలోని సంజీవనగర్‌లో నివసిస్తున్న టీడీపీ మద్ద తుదారుడైన దివ్యాంగుడు దాసరి కిరణ్‌ను మోటార్‌సైకిల్‌పై ఎత్తుకెళ్లి చితకబాది వదిలిపెట్టారు. తాడిపత్రి మండలం ఆలూరు గ్రామంలో టీడీపీ మద్దతుదారుడు తిరుపాల్‌రెడ్డి ఇంటిపై దాడి చేసి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు.తాడిపత్రి పట్టణంలో పట్టణ తెలుగుయువత అధ్యక్షుడు ఖాదర్‌కు చెందిన వాహనానికి నిప్పుపెట్టారు. ఒక కేసులో వైసీపీ నాయకుల ప్రోద్బలంతో మాజీ సర్పంచు అని కూడా చూడకుండా రూరల్‌ పోలీసులు బట్టలు విప్పి అర్ధనగ్నంగా కూర్చోబెట్టారు.

మిగిలిన నియోక‌వ‌ర్గాల్లోనూ ఇదే పరిస్థితి..

మిగిలిన నియోక‌వ‌ర్గాల్లోనూ ఇదే పరిస్థితి..

జిల్లాలోని మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీ నేత‌ల ఆగ‌డాలు ఎక్కువ‌గా ఉన్నాయంటూ తెలుగు దేశం నేత‌లు అధినేత ముందు మొర పెట్టుకుంటున్నారు. క‌ళ్యాణ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నేత‌లు బెదిరిస్తున్నారంటూ వెలుగు యానిమేట‌ర్ ఉరి వేసుకున్నాడ‌ని టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. అదే విధంగా రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గంలో రామ‌గిరి మండలంలో పరిటాల రవీంద్ర ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్‌ప్లాంటును ఆ గ్రామానికి చెందిన వైసీపీ శ్రేణులు పాక్షికంగా ధ్వంసం చేశారనే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ధ‌ర్మ‌వ‌రం..పుట్ట‌ప‌ర్తి..శింగ‌న‌మ‌ల‌..హిదూపూర్ నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ రాజ‌కీయంగా ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నాయ‌ని చెబుతున్నారు. మ‌రి..ఈ జిల్లాలో నెల‌కొన్న ప‌రిస్థితుల పైన ప్ర‌భుత్వం ఏ ర‌కంగా స్పందిస్తుందో చూడాలి.

English summary
Political riots continue in Ananatapur dist. In many assembly constituencies TDP and YCP adre attacking each other. since elections two persons died in these disputes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X