అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మ‌హిళ‌ల‌కు ప‌ట్టు చీరలు : బిర్యానీతో విందు : నగదు పారితోషికాలు..ఎందుకో తెలుసా..!

|
Google Oneindia TeluguNews

ఏపిలో అప్పుడే ఎన్నిక‌ల పందేరాలు మొద‌ల‌య్యాయి. అనంత‌పురం పార్ల‌మెంట్ ప‌ర‌ధిలో ఓట‌ర్ల‌కు ఓట్ల పండుగ రాక ముందే న‌జ‌రానాలు ఇస్తున్నారు. ప్ర‌ధానంగా మ‌హిళా ఓటర్ల మ‌ద్ద‌తు పొందేందుకు అక్క‌డి నేత‌లు పోటీ ప‌డుతున్నా రు. ఇందు కోసం ఆ జిల్లా అధికార పార్టీ నేత‌లు పోటీ ప‌డుతున్నారు...

మ‌హిళా ఓట్ల పైనే గురి..

అనంత జిల్లాలో అధికార పార్టీ నేత‌లు మ‌హిళా ఓట‌ర్ల మ‌ద్ద‌తు పొందేందుకు అక్క‌డి అధికార పార్టీ నేత‌లు వినూత్నం గా కార్య‌క్రమాలు అమ‌లు చేస్తున్నారు. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే సూరి ఇప్పటికే మహిళలకు చీరల పంపిణీ మొదలుపెట్టారు. ఇక తాడిపత్రిలో జేసీ సోదరులు మండలస్థాయిలో మహిళలందరికీ పట్టుచీరలు పంచే పనికి శ్రీకారం చుట్టారు. తాడిప‌త్రిలో జేసి కుటుంబం ఆధ్వ‌ర్యంలో ప‌దివేల మంది మ‌హిళ‌ల‌కు ప‌సుపు - కుంకుమ కింద చీర‌లు పంపిణీ చేసారు. వ‌చ్చిన వారంద‌రికీ బిర్యానీ ఏర్పాటు చేసారు. త‌మ ప‌ని తీరు మెచ్చుకుంటూ మాట్లాడిన మ‌హిళ‌ల‌కు న‌గ‌దు పారితోష‌కాలు ఇచ్చారు. ఇక‌, తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గ పరిధిలోని 88 వేల మ‌హిళ‌ల‌కు చీరల పంపినీ కార్య‌క్ర‌మాన్ని ఎమ్మెల్యే ప్ర‌ప్రభాకర్‌రెడ్డి, జేసీ అస్మిత్‌రెడ్డి, జేసీ పవన్‌కుమార్‌రెడ్డి లు నిర్వ‌హించారు.

Pre elecion gifts for ladies : new trend in Anatapur

సెంటిమెంట్ తో ఓట్ల‌కు గాలం..

మ‌హిళ‌లు ఇష్ట‌ప‌డే ప‌ట్టు చీర‌లు ఇవ్వ‌టం ద్వారా వారి వ‌ద్ద మార్కులు కొట్టేయాల‌నేది వీరి ప్లాన్ గా క‌నిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ వార‌సులు అస్మిత్, పవన్‌లను ఆశీర్వదించాలని ఎమ్మెల్యే జేసీ కోరుతున్నారు. జేసీ పవన్ ఆధ్వర్యం లో వాటర్ ప్లాంట్లను విరివిగా ఏర్పాటు చేస్తున్నారు. తమకు పట్టున్న తాడిపత్రితో పాటు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పలు మండలాలు, గ్రామాల్లోనూ సేవా కార్యక్రమాలు ఉధృతంచేశారు. ఇదే స‌మ‌యంలో విప‌క్షాలు ఆరోప‌ణ లు చేస్తున్నాయి. ప్రజల ఆస్తులను దోచుకుని ఇప్పుడు వారికే నూకలు విదిలిస్తున్నారని స్థానిక వైసీపీ నేతలు ఆరోపి స్తున్నారు. జేసీ బ్రదర్స్ అరాచకాలకు ఆ ప్రజలే చెక్ పెడతారని జోస్యం చెబుతున్నారు. మ‌రి..జేసి కుంటుంబం ఎత్తు గ‌డ‌లు ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తాయో చూడాలి.

English summary
Anantapur TDP leaders distributing sarees to ladies. mainly JC family in Tadipatri concentrated on ladies votes. They arranged pasupu-kumkuma programme and asked supprt thier sons in coming elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X