అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో ఆర్టీఏ లీలలు: ట్రావెల్స్ , వాహన డీలర్ల సొమ్ముతో అధికారులు జల్సాలు!

|
Google Oneindia TeluguNews

అనంత‌పురం: గెట్ టు గెద‌ర్ పేరుతో ర‌వాణాశాఖ అధికారులు వాహ‌న షోరూమ్ డీల‌ర్ల‌తో క‌లిసి విందు, వినోదాల్లో పాల్గొన్నారు. ఆట‌పాట‌ల‌తో చిందులేశారు. తాము అధికారుల‌మనే విషయాన్ని విస్మ‌రించి, మ‌రీ ప్రైవేటు వ్య‌క్తుల‌తో క‌లిసి చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగారు. ఈ ఘ‌ట‌న అనంత‌పురం జిల్లాలో చోటు చేసుకుంది. ఈ తతంగం ప‌ట్ల జిల్లాలో విమ‌ర్శ‌లు ఎదుర‌వుతున్నాయి. వాహ‌న డీల‌ర్ల‌తో క‌లిసి చిందులేయ‌డం వ‌ల్ల ఆర్టీఏ అధికారుల ప‌ట్ల భ‌యం ఉండ‌ద‌ని, త‌మ క‌నుస‌న్న‌ల్లో ప‌నిచేస్తార‌నే చుల‌క‌న భావం డీల‌ర్ల‌లో ఏర్ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని అంటున్నారు స్థానికులు.

విష‌య‌మేమిటంటే..

విష‌య‌మేమిటంటే..

ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి ముగిసిన 2017-18 ఆర్థిక సంవ‌త్స‌రంలో అనంత‌పురం జిల్లా ప్రాంతీయ ర‌వాణాశాఖ అధికారులు మంచి ప్ర‌తిభ క‌నప‌ర్చారు. ప్ర‌భుత్వం నిర్దేశించిన టార్గెట్ల‌ను అందుకున్నారు. రాష్ట్రంలోని మిగిలిన ఆర్టీఏ కార్యాలయాల‌తో పోల్చుకుంటే అనంత‌పురం జిల్లా అధికారులు అత్య‌ధిక రాబ‌డిని ప్ర‌భుత్వానికి తీసుకొచ్చారు. ఈ సంద‌ర్భంగాన్ని పుర‌స్క‌రించుకుని కొంద‌రు జిల్లా ఆర్టీఏ అధికారులు గెట్ టు గెద‌ర్ పేరుతో ఓ వేడుక‌ను ఏర్పాటు చేసుకున్నారు. దీనికి అవ‌స‌ర‌మైన ఖ‌ర్చును జిల్లా వాహ‌న డీల‌ర్ల అసోసియేష‌న్ నుంచి వ‌సూలు చేశారు. స్థానిక ఫంక్ష‌న్ హాలులో విందు, వినోదాల‌ను ఏర్పాటు చేశారు. దీనికి అసోసియేష‌న్ ప్ర‌తినిధుల‌ను కూడా ఆహ్వానించారు.

ప‌ర్మిట్ల‌ను జారీ చేసే అధికారులు కూడా..

ప‌ర్మిట్ల‌ను జారీ చేసే అధికారులు కూడా..

పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ఈ కార్య‌క్ర‌మానికి రాయ‌ల‌సీమ రీజియ‌న్‌లోని ఇత‌ర ప్రాంతాల‌కు చెందిన అధికారులు కూడా పాల్గొన్న‌ట్లు తెలుస్తోంది. వాహ‌నాల రిజిస్ట్రేష‌న్ నంబ‌ర్లు, ప‌ర్మిట్ల‌ను జారీ చేసే కీల‌క అధికారులు కూడా దీనికి హాజ‌ర‌య్యారు. స్వ‌యంగా ఉన్న‌త హోదాలో ఉన్న అధికారులు ఇలాంటి ప్రైవేటు ఫంక్ష‌న్ల‌కు హాజ‌రు కావ‌డం వ‌ల్ల మున్ముందు- ఇబ్బందికర ప‌రిస్థితులు త‌లెత్తే ప‌రిస్థితులు లేక‌పోలేద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మౌతున్నాయి. విందు, వినోదాల‌కు అల‌వాటు ప‌డిన అధికారుల‌కు లంచాన్ని ఎర‌గా చూపి, అక్ర‌మంగా ప‌ర్మిట్ల‌ను పొంద‌డానికి వీలు క‌ల్పించిన‌ట్ట‌యింద‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

క‌ష్టం ఒక‌రిది..

క‌ష్టం ఒక‌రిది..

త‌మ కోసం తాము ఏర్పాటు చేసుకున్న ఈ గెట్ టు గెద‌ర్ కార్య‌క్రమానికి ఉన్న‌తాధికారులు హాజ‌రు కావ‌డం ప‌ట్ల కిందిస్థాయి ఉద్యోగుల్లో అసంతృప్తి రాజుకోవ‌డం ఇందులో హైలెట్‌గా చెప్పుకోవ‌చ్చు. తాము క‌ష్ట‌ప‌డి టార్గెట్ల‌ను సాధించ‌గా.. అధికారులు త‌మ ప్ర‌తిభ‌గా చెప్పుకోవ‌డంలో అర్థ‌మే లేద‌ని కొంద‌రు కిందిస్థాయి ఉద్యోగులు బాహ‌టంగా విమ‌ర్శించ‌డం ఈ ఎపిసోడ్‌లో ఉన్న అస‌లు ట్విస్ట్. గెట్ టు గెద‌ర్ కార్య‌క్ర‌మం కోసం వాహ‌న షోరూం డీల‌ర్ల చుట్టూ తిరిగి చందాలు వ‌సూలు చేసుకుని మ‌రీ, దీన్ని ఏర్పాటు చేసుకున్నామ‌ని, ఉన్న‌తాధికారులు వ‌చ్చి దీన్ని హైజాక్ చేశార‌ని చెప్పుకోవ‌డం క‌నిపించింది.

ముందు నుంచీ వివాదాస్ప‌ద‌మే..

ముందు నుంచీ వివాదాస్ప‌ద‌మే..

అనంత‌పురం జిల్లా ఆర్టీఏ శాఖ అంటే అన్ని జిల్లాల కంటే అధిక ప్రాధాన్య‌త ఉంది. వివాదాలూ అదే స్థాయిలో ఉన్నాయి. దీనికి ప్ర‌ధాన కార‌ణం. దివాక‌ర్ ట్రావెల్స్‌. సుమారు రెండువేల‌కు పైగా బ‌స్సులను క‌లిగి ఉన్న దివాక‌ర్ ట్రావెల్స్‌.. అనంత‌పురం జిల్లాలో ఏక‌చ్ఛ‌త్రాధిప‌త్యాన్ని కొన‌సాగిస్తోంది. జిల్లాలో వేరొక‌రు ప్రైవేటు బ‌స్సుల‌ను న‌డిపించుకోలేని స్థితికి నెట్టేశార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అందుకే- ఈ జిల్లా ఆర్టీఏ కార్యాల‌యం, అక్క‌డి అధికారులు ప‌నితీరు మొద‌టి నుంచీ వివాదాస్ప‌ద‌మేనని విమ‌ర్శిస్తున్నారు స్థానికులు. దివాక‌ర్ ట్రావెల్స్ గుత్తాధిప‌త్యాన్ని సాధించ‌డానికి కొంద‌రు ఆర్టీఏ అధికారులు ఆ సంస్థ యాజ‌మాన్యానికి అండ‌గా ఉంటున్నార‌నే ఆరోప‌ణ‌లు ఈనాటివి కావు. అదే స‌మ‌యంలో- ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాలు సాధించామనే కారణంతో వాహ‌న డీల‌ర్ల నుంచి డ‌బ్బుల‌ను వ‌సూలు చేసి, ఇష్టారాజ్యంగా జల్సాలు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది.

దోచుకునే వాడిదే రాజ్యం..

దోచుకునే వాడిదే రాజ్యం..


అనంత‌పురం జిల్లా ఆర్టీఏ కార్యాలయంలో సక్రమంగా విధులు నిర్వర్తించే అధికారుల‌కు స‌రైన గుర్తింపు లేద‌నే అభిప్రాయాలు ఎప్ప‌టి నుంచో ఉన్నాయి. వాటిని బ‌ల‌ప‌రిచేలా తాజా ఉదంతం చోటు చేసుకుంది. ప్రైవేటు ట్రావెల్స్ యజ‌మానుల‌కు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ప‌ర్మిట్ల‌ను జారీ చేసి, నెలా నెలా మామూళ్ల‌ను అందుకుంటున్నార‌ని ఆర్టీఏ ఉద్యోగులే విమ‌ర్శిస్తుండ‌టం గ‌మ‌నార్హం. అనంత ఆర్టీఏ కార్యాలయంలో పనిచేసే అధికారులు, సిబ్బందికి తగిన గుర్తింపు ఇవ్వడం లేదనే విమర్శలున్నాయి. ఎవరెంత పనిచేసినా అంతా తానే చేసినట్లుగా ఉన్న‌తాధికారులు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, చివ‌రికి ఫంక్ష‌న్‌లో కూడా త‌మ‌ను ఎంజాయ్ చేయ‌నివ్వకుండా హైజాక్ చేశార‌ని వాపోతున్నారు కిందిస్థాయి సిబ్బంది.

శ్ర‌మ దోపిడీ అధికమే..

శ్ర‌మ దోపిడీ అధికమే..

ఆర్టీఏ లక్ష్యాల సాధించ‌డంలో రాష్ట్రస్థాయిలో ముందజంలో ఉన్నప్ప‌టికీ త‌మ ప్ర‌తిభ‌ను ఉన్న‌తాధికారులు కొట్టేస్తున్నార‌ని, శ్ర‌మ దోపిడీకి పాల్ప‌డుతున్నార‌ని కిందిస్థాయి ఉద్యోగులు ఆక్రోశిస్తున్నారు. ఏసీ రూముల్లో కూర్చుని దర్జాగా వ్యవహరించే అధికారులు.. తమను ఎండల్లో తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టాన్ని గుర్తించట్లేదని, చిన్న పొరపాటు జరిగినా షోకాజ్ నోటీసులను జారీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉంటూ, ప్రతిభ చూపిన సిబ్బందికి గుర్తింపు ఇవ్వడం లేదనే బాహటంగా విమర్శిస్తున్నారు అక్కి కిందిస్థాయి ఉద్యోగులు.

English summary
Regional Transport Authority Officers and Showroom Dealers jointly organized a Private Function in Ananthapur is going strong critics from the Public. Both parties were participated in that Function for reaching out targets for the 2017-2018 Financial Year. Some Key Officers Participated in that function.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X