అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి మళ్లీ అరెస్ట్: అలా చేస్తే వైసీపీలో చేరతానంటూ సంచలనం

|
Google Oneindia TeluguNews

అనంతపురం: తెలుగుదేశం పార్టీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి మళ్లీ అరెస్టయ్యారు. అట్రాసిటీ కేసులో వారిని తాడిపత్రి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. తాడిపత్రి పోలీస్ స్టేషన్‌లో సీఐ దేవేంద్ర కుమార్‌పై అనుచితంగా వ్యవహరించారనే ఆరోపణలపై వారిపై కేసు నమోదు చేశారు.

విడుదలైన మరుసటి రోజే మళ్లీ అరెస్ట్..

విడుదలైన మరుసటి రోజే మళ్లీ అరెస్ట్..

డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్టి కింద కూడా కేసు నమోదు చేసినట్లు తాడిపత్రి డీఎస్పీ తెలిపారు. వాహనాల రిజిస్ట్రేషన్‌లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు అరెస్టైన విషయం తెలిసిందే. గురువారమే జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యారు. అయితే, మరుసటి రోజే అట్రాసిటీ కేసులో వీరిద్దరిని అరెస్ట్ చేయడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు కుట్రపూరితంగా టీడీపీ నేతలను వేధింపులకు గురిచేస్తోందని మండిపడుతున్నారు.

అక్రమ కేసులంటూ జేసీ ప్రభాకర్..

అక్రమ కేసులంటూ జేసీ ప్రభాకర్..

ఇది ఇలావుండగా, అంతకుముందు జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయ వేధింపుల్లో భాగంగానే తమపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. తమ ట్రావెల్స్ వాహనాలకు సంబంధించి అన్ని నిబంధనలు పాటించామని తెలిపారు. తాము జైల్లో ఉన్నా అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు తమపై నిఘా పెట్టి.. కుట్రలు చేశారని ఆరోపించారు.కరోనా సమయంలో జైల్లో ఉంచడం తప్పని, ఇబ్బందులు పెట్టాలని చూసిన ఆ ప్రయత్నాలు ఫలించలేదని చెప్పారు. జైలు అధికారులు ఎటువంటి ఇబ్బందులకు గురిచేయలేదని తెలిపారు.

Recommended Video

AP Colleges To Reopen From October 15 | Assistant Professors Recruitment : AP CM YS Jagan
అలా చేస్తే వైసీపీలో చేరుతానంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి

అలా చేస్తే వైసీపీలో చేరుతానంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి


మూడు రాజధానుల అంశంపై స్పందిస్తూ.. జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే.. తాను వైయస్సార్సీపీలో చేరడానికి సిద్ధమని అన్నారు. అయితే, పార్టీ మారతారనే ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు.
తాము టీడీపీలోనే కొనసాగుతామని, అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకోవడానికి కూడా సిద్ధమని స్పష్టం చేశారు. తాము జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత తాడిపత్రి ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేశారని, మహిళలు హారతులు పట్టారని జేసీ చెప్పారు.

English summary
sc, st atrocity case: tdp leaders jc prabhakar reddy and asmith reddy again arrest under.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X