అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జాతీయ పతాకాన్ని చెరిపేసి..వైసీపీ జెండా రంగులా? హౌ డేర్ యు: చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

అనంతపురం: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన గ్రామ సచివాలయాలకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రంగులను పూయడం పట్ల వ్యతిరేకత ఎదురవుతోంది. మొన్నటికి మొన్నే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నాయకులు ఈ వ్యవహారంపై విమర్శలు గుప్పించారు.రంగులేసుకోవడానికి, ఆర్భాటం చేయడానికి తప్ప రాష్ట్రాన్ని పరిపాలించడానికి పనికిరాని పార్టీగా బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. తాజాగా- తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవే తరహా ఆరోపణలు చేశారు.

అనంతపురం జిల్లా అమరాపురం మండలంలోని తమ్మడేపల్లి గ్రామ సచివాలయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రంగులు పూశారు. అంతకుముందు పంచాయతీ రాజ్ కార్యాలయంగా ఉండేది. అప్పట్లో ఆ కార్యాలయంపై త్రివర్ణ పతాక రంగులు ఉండేవి. దాన్ని గ్రామ సచివాలయంగా మార్చిన అనంతరం వైసీపీ జెండా రంగులను పూశారు. జాతీయ పతాకాన్ని చెరిపేసి, వైసీపీ రంగులను పూస్తున్న వీడియో, కొన్ని ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఫొటోల ఆధారంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

shocking, abominable act of replacing tricolour with YSRCP party colours, says Chandrababu

అధికారంలో ఉన్న పార్టీ జాతీయ జెండాను ఇంత దారుణంగా అవమానించిన సందర్భాన్ని తాను ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. ఏ ఉద్దేశంతో జాతీయ పతాకాన్ని అవమానించారని ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ నాయకులు చేస్తోన్న ఇలాంటి చర్యలు రాష్ట్రానికి తలవంపులను తీసుకొస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులను పూసే నియంతల సంస్కృతిని ప్రభుత్వం అనుసరిస్తోందని విమర్శించారు. వెంటనే- గ్రామ సచివాలయాలన్నింటికీ పార్టీ జెండా రంగులను తొలగించాలని డిమాండ్ చేశారు.

దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం కార్యకర్తలు చంద్రబాబు నాయుడికి గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. గ్రామ సచివాలయం పైగా నీ, పంచాయతీ రాజ్ కార్యాలయంపై గానీ జాతీయ పతాక రంగులు ఉండకూడదని రాజ్యాంగమే చెబుతోందని అన్నారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడికి ఈ విషయం తెలియదా? అని మండి పడుతున్నారు. ప్రతి విషయాన్నీ చంద్రబాబు రాజకీయ కోణంతో చూడటాన్ని మానుకోవాలని చెబుతున్నారు. హైకోర్టులు, రాష్ట్రస్థాయి సచివాలయాలు, కమిషనర్ స్థాయి అధికారులు, కలెక్టర్ కార్యాలయాలు, జైళ్లు, జిల్లాస్థాయి కార్యాలయాలు, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్ భవనాలపై మాత్రమే జాతీయ పతకాన్ని ఎగుర వేయడం గానీ, రంగులు పూయడం గానీ చేయొచ్చని స్పష్టం చేస్తున్నారు.

English summary
Telugu Desam Party President and Former Chief Minister of Andhra Pradesh Chandrababu Naidu has criticized the act of ruling YSR Congress Party that tricolour replaced by YSRCP flag colour in Anantapur district village secretariat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X