అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జ‌గ‌న్ పాల‌న‌..జేసీ..ప‌రిటాల : ఆ మాట‌ల వెనుక ప‌ర‌మార్ధం: అనంత‌లో కొత్త స‌మీక‌ర‌ణాలు..!

|
Google Oneindia TeluguNews

ఏపీ ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టి మూడు వారాలు అయింది. జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే లా అండ్ ఆర్డ‌ర్ నియంత్ర‌ణ‌లో ఉండ‌దు...పులివెందుల రౌడీయిజం పెట్రోగిపోతుదంటూ టీడీపీ నేత‌లు ఎన్నిక‌ల వేళ ప్ర‌చారం చేసారు. తాజా ఎన్నిక‌ల్లోనే కాదు.. 2014 ఎన్నిక‌ల్లో విజ‌య‌మ్మ విశాఖ ఎంపీగా పోటీ చేసారు. ఆ స‌మ‌యంలో క‌డ‌ప రౌడీ లు విశాఖ‌కు వ‌చ్చి ఆక్ర‌మ‌ణ‌లు చేస్తారంటూ ప్ర‌చారం సాగించారు. అయితే, ఇప్పుడు జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చి 20 రోజులు పూర్త‌యింది. ఈ స‌మ‌యంలో జ‌గ‌న్ పాల‌న పైన ప్ర‌ధానంగా అనంత‌పురం టీడీపీ నేత‌లు రియాక్ట్ అవుతున్న తీరు పైన ఇప్పుడు చ‌ర్చ మొద‌లైంది. ఇంత‌కీ వారేమంటున్నారు..ఏం జ‌రిగిందీ,,,

జ‌గ‌న్ డోన్ట్‌కేర్‌: సీఎంగా మీ బాధ్య‌త‌..టీడీపీ న్యాయ పోరాటం: చ‌ంద్రబాబు ఆందోళ‌న ఏంటంటే..! జ‌గ‌న్ డోన్ట్‌కేర్‌: సీఎంగా మీ బాధ్య‌త‌..టీడీపీ న్యాయ పోరాటం: చ‌ంద్రబాబు ఆందోళ‌న ఏంటంటే..!

జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే..

జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే..

తాజా ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఒక్క ఛాన్స్ అనే నినాదంతో ప్ర‌జ‌ల్లోకి వెళ్లారు. దీని పైన టీడీపీ నేత‌లు విమ‌ర్శ‌లు చేసారు. ఒక్క సారి ఉరి వేసుకుంటారా..ఒక్క సారి మ‌ర‌ణ శాస‌నం రాసుకుంటారా అంటూ టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆరోపించారు. అదే స‌మ‌యంలో రౌడీయిజం పెరిగిపోతుంద‌ని..త‌న హ‌యాంలో రౌడీ అనే వాడిని లేకుండా చేసాన‌ని చెప్పుకొచ్చారు. కానీ, ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తుగా నిలిచారు. 50 శాతం ఓట్ల‌తో 151 సీట్ల‌తో అధికారం క‌ట్ట‌బెట్టారు. గ‌త నెల 30న ఏపీ ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేసారు. అదే స‌మ‌యానికి డీజీపీగా .. సీఎస్‌గా ఎవ‌రు ఉండాలో నిర్ణ‌యం తీసుకున్నారు. డీజీపీగా గౌతం స‌వాంగ్ బాధ్య‌త‌లు తీసుకొనే స‌మ‌యంలోనే త‌న విధానం ఏంటో స్ప‌ష్టం చేసారు. త‌న పాల‌న‌లో శాంతి భ‌ద్ర‌త‌ల‌కు ప్రాధాన్య‌త ఉంటుంద‌ని..దీనికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల‌ని సూచించారు.

అనంత‌పురం పైన ప్ర‌త్యేక దృష్టి..

అనంత‌పురం పైన ప్ర‌త్యేక దృష్టి..

ఎన్నిక‌ల పోలింగ్ నాడు అనంత‌పురం జిల్లాలో హింస చోటు చేసుకుంది. ఇక‌, ఫ‌లితాల్లో అనంత‌పురం జిల్లాలో వైసీపీ మొత్తం 14 సీట్ల‌లో 12 చోట్ల విజ‌యం సాధించింది. జిల్లాలో గ‌తంలో చోటుచేసుకున్న ప‌రిణామాల మీద అవ‌గాహ‌న ఉంది. దీంతో ఎస్పీల బ‌దిలీల స‌మ‌యంలో రాయ‌ల‌సీమ‌..ప్ర‌త్యేకించి అనంత‌పురం జిల్లాలో యండ్ అండ్ డైన‌మిక్ అధికారి కావాల‌ని ఆదేశించారు. దీంతో..అప్ప‌టి వ‌ర‌కు అనంత ఎస్పీగా ఉన్న కిషోర్ కుమార్‌ను బ‌దిలీ చేసి యువ అధికారిని నియ‌మించారు. అంతే, ఆయ‌న‌కు అస‌లు లక్ష్యం స్ప‌ష్టం చేసారు. దీంతో..జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత ఇప్ప‌టి వ‌ర‌కు ఆ జిల్లాలో శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రంగా ఒక్క ఘ‌ట‌న చోటు చేసుకోలేదు. గ‌త ప్ర‌బుత్వ హ‌యాంలో రాయ‌ల‌సీమ‌లో ముఠా పోరు.. వ‌ర్గా పోరాటాలు సాగేవి. వీటి పైన క‌ఠినంగా ఉండాల‌ని జ‌గ‌న ఆదేశించారు.

ప‌రిటాల‌కు భ‌ద్ర‌త‌..జేసీ సంతృప్తి..

ప‌రిటాల‌కు భ‌ద్ర‌త‌..జేసీ సంతృప్తి..

వైసీపీఅధికారంలోకి వ‌స్తే అనంత‌పురం జిల్లాలో జేసీ..పరిటాల వ‌ర్గాలు ఇబ్బందులు ప‌డ‌తాయ‌ని టీడీపీ నేత‌లు సైతం అంచ‌నా వేసారు. కానీ, వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన గ‌తం కంటే పోలీసులు స‌మ‌ర్ధ‌వంతంగా ప‌ని చేస్తున్నారంటూ జేసీ ప్ర‌భాక‌ర రెడ్డి ప్ర‌శంసించారు. అదే విధంగా భ‌ద్ర‌తా ప‌రంగా ప‌రిటాల కుటుంబం ఆందోళ‌న వ్యక్తం చేయ‌గా..వారికి అవ స‌ర‌మైన మేర భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని ఆదేశించారు. దీంతో..ప‌రిటాల మ‌ద్ద‌తు దారులు సైతం సంతృప్తి వ్య‌క్తం చేసారు. టీడీపీలో అంత‌ర్గ‌త స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందులు ప‌డుతున్న ప‌రిటాల వ‌ర్గం..పార్టీ వీడే ఆలోచ‌న చేస్తోంది. వారు వైసీపీ వైపు వెళ్లారా అనే చ‌ర్చ సాగుతున్నా..అది సాధ్యం కాద‌ని చెబుతున్నారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌న ప‌ధ‌కాల అమ‌లు.. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల విష‌యంలో పార్టీలు..రాజ‌కీయాల‌కు అవ‌కాశం లేద‌ని తేల్చి చెప్పారు. దీంతో..రానున్న రోజుల్లో అనంతపురం జిల్లాలో కొత్త రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు చోటు చేసుకొనే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

English summary
TDP key leaders in Anantapur dist feeling satisfaction on jagan Law and Order Maintenance in district. Jagan ordered Police officials that Should be firm on law and order.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X