కేతిరెడ్డి పెద్దారెడ్డి తండ్రి ఏం చేశాడు, విగ్రహాం ఏర్పాటుపై జేసీ ఫైర్.. ఫ్రీడమ్ ఫైటరా..?
అనంతపురంలో జేసీ ప్రభాకర్ రెడ్డి శైలే వేరు.. ఎవరైనా సరే విమర్శలు చేయడం ఆయన నైజం వేరు.. ఇక ప్రత్యర్థి దొరికాడు అనుకో.. అంతే సంగతులు. అవును తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై మండిపడ్డారు. ఇందుకు కారణం ఎమ్మెల్యే తండ్రి విగ్రహావిష్కరణ చేయడమేనని తెలిసింది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి తండ్రి కేతిరెడ్డి రామిరెడ్డి విగ్రహం ఏర్పాటుపై జేసీ ప్రభాకర్ రెడ్డి కస్సు బుస్సుమన్నారు.

అడ్డంకులు సృష్టించినా..?
తాడిపత్రి అబివృద్దికి ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అబివృద్ది చేసి తీరుతానని జేసి ప్రభాకర్ రెడ్డి అన్నారు. తాడిపత్రిలో మున్సిపాలిటీ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి స్పందన లేదన్నారు. స్థలాల కబ్జాపై ఏడాది క్రితం ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవని జేసీ ప్రభాకర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి వేసే ప్లాట్లను ఎవరైనా కొంటే.. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే జేసీబీలతో దున్నిస్తానని ప్రభాకర్ రెడ్డి అన్నారు.

నేషనల్ హైవేపై ఎందుకు...
ఎమ్మెల్యే పెద్దారెడ్డి నేషనల్ హైవేలో తన తండ్రి విగ్రహాన్ని పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. అసలు నేషనల్ హైవేలో విగ్రహాలు ఎలా పెడతారని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. విగ్రహం ఏర్పాటులో తనకు అభ్యంతరం లేదన్నారు. జాతీయ రోడ్డ రవాణాశాఖ అధికారులు ఓ పక్క విగ్రహాలు తొలగిస్తుంటే ఇక్కడ నేషనల్ హైవేలో విగ్రహం ఏర్పాటు ఏంటని మండిపడ్డారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీరుపై ప్రభాకర్ రెడ్డి విరుచుకుపడ్డారు.

ఏం చేశాడో
ఎమ్మెల్యే పెద్దారెడ్డి తండ్రి స్వతంత్ర సమర యోదుడా? దేశం కోసం పోరాటం చేశాడా? ఈ విషయాలు ప్రజలకు చెప్పాలని ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. విగ్రహం ఏర్పాటు చేసినా తరువాత అతనే బాధపడాల్సి వస్తుందని.. ఎందుకంటే ఎమ్మెల్యే పెద్దారెడ్డి మహా అంటే ఇక రెండేళ్లు పదవీలో ఉంటాడు.. పదవి పోయిన తరువాత గిట్టనివారెవరైనా ఆ విగ్రహానికి పాత చెప్పుల దండ వేశారనుకో లేక విగ్రహంపై కాకిరెట్ట వేసిందనుకో బాధపడాల్సిందన్నారు.

ఫ్రీడమ్ ఫైటర్
తన తండ్రి జేసి నాగిరెడ్డి స్వతంత్ర సమరయోధుడు అని పేర్కొన్నారు. దేశం కోసం పోరాటం చేసి జైలుకు కూడా వెళ్లాడని చెప్పారు. మాజీ ఎంపీ అయినా మేము ఎక్కడా విగ్రాలు పెట్టలేదని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అలాంటి ఏ మంచి పని చేయని.. ఎమ్మెల్యే తండ్రి విగ్రహాం ఎలా పెడతారని ప్రశ్నించారు.