• search
 • Live TV
అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

చంద్రబాబుకు జేసీ భారీ షాక్: తాడిపత్రిలో చేతులెత్తేశారు.. వైసీపీ ట్రాప్ లో చిక్కుకొని..ఇలా..!

|

తాడిపత్రి: వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్‌గా మారిన మాజీ మంత్రి జేసీ దివాకర్‌ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఏకంగా చంద్రబాబుకే షాకిచ్చే వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక కామెంట్స్ చేశారు. ఇంతకీ జేసీ చేసిన వ్యాఖ్యలేంటి..? చంద్రబాబుకు ఎందుకు మింగుడు పడటం లేదు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

జేసీ ట్రావెల్స్ అక్రమాలు : వెలుగులోకి కొత్త కోణం.. నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లు..

చంద్రబాబుకు జేసీ షాక్

చంద్రబాబుకు జేసీ షాక్

రాయలసీమలో టీడీపీకి షాక్. సీమ ప్రాంతంలో అనంతపురం జిల్లాలో టీడీపీ గత ఎన్నికల వరకు పట్టు కొనసాగిస్తూ వచ్చింది. 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలో జిల్లాలో కేవలం రెండు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఇక, తిరిగి స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా పట్టు పెంచుకోవాలని భావిస్తున్న పార్టీ అధినేత చంద్రబాబుకు మాజీ ఎంపీ జేసీ ఊహించని జలక్ ఇచ్చారు. తన సొంత నియోజకవర్గం అయిన తాడిపత్రిలో ఏ ఎన్నికలోనూ టీడీపీ అభ్యర్ధులు పోటీ చేయరంటూ సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే దివాకర్ ట్రావెల్స్ పైన రవాణా శాఖ చర్యల ద్వారా ఎదురు దెబ్బ తిన్న జేసీ దివాకర్ రెడ్డి ఈ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయటం లేదో అసలు విషయం బయట పెట్టేశారు.

ప్రధాన ప్రతిపక్ష నేతలను సీఎం టార్గెట్ చేశారా..?

ప్రధాన ప్రతిపక్ష నేతలను సీఎం టార్గెట్ చేశారా..?

స్థానిక సంస్థల ఎన్నికల్లో తాడిపత్రి మున్సిపాలిటీతోపాటు నియోజకవర్గంలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఎవరూ పోటీ చేయరని జేసీ ప్రకటించారు. పౌరుషానికి పోటీ చేసినా అనర్హత వేటుతోపాటు కొత్త చట్టాల పేరుతో జైలుపాలు కాక తప్పదని చెప్పారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికలను ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీతో సహా ఎవరైనా మద్యం..డబ్బులు పంచితే ఆ అభ్యర్ధి పైన అనర్హత వేటు పడేలా చట్టం తీసుకొచ్చారు. అదే సమయంలో మద్యం..డబ్బు పంపిణీ జరిగినట్లు సమాచారం వస్తే ఆ జిల్లా ఎస్పీ బదిలీ అవుతారని హెచ్చరించారు. ఇలా చేయడం ద్వారా ప్రధానంగా ప్రతిపక్ష పార్టీ నేతలను టార్గెట్ చేయటమే అని జేసీ చెబుతున్నారు. అయితే, అనంత జిల్లాలో టీడీపీ నుండి బలమైన కేడర్..ఆర్డిక ..అంగ బలం ఉన్న జేసీ చేసిన ప్రకటనతో జిల్లాలోని ఇతర టీడీపీ నేతలు సైతం ఇదే రకంగా జేసీ బాటలోనే పయణించే ఛాన్స్ ఉందనే ఆందోళన టీడీపీలో వ్యక్తం అవుతోంది.

  పరిటాల రవిపై దాడి చేస్తారని తెలుసు | Oneindia Telugu
  అయిదు దశాబ్దాల కంచుకోటలో..

  అయిదు దశాబ్దాల కంచుకోటలో..

  తాడిపత్రి నియోజకవర్గం దాదాపు అయిదు దశాబ్దాలుగా జేసీ కుటుంబం చేతిలోనే ఉంది. అక్కడ 2019 ఎన్నికల వరకు ఓటమి అనేది లేకుండా వారి ఆధిపత్యం కొనసాగుతోంది. అయితే, సార్వత్రిక ఎన్నికల్లో ఓడినా..తిరిగి స్థానిక సంస్థల ఎన్నికల ద్వారానే తమ పార్టీని..కేడర్ ను బలోపేతం చేసుకోవాలని తొలుత భావించారు. అయితే, ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయాలు.. అమలు చేస్తున్న కార్యాచరణ చూసిన తరువాత జేసీ తన నిర్ణయాన్ని విస్పష్టంగా ప్రకటించారు. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇది మింగుడు పడని వ్యవహారంగా మారనుంది. జిల్లాలోనే కాకుండా రాయలసీమ ప్రాంతంలోనూ జేసీ ప్రకటన ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎన్నికలను ఎదుర్కోవాల్సిన సమయంలో ముందుగానే భయం..ఆందోళన వ్యక్తం చేయటం ద్వారా.. ప్రభుత్వ ట్రాప్ లో టీడీపీ నేతలు చిక్కినట్లుగా వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. దీంతో..ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు ఏం చేస్తారనేది ఆసక్తి కరంగా మారింది.

  English summary
  Controversial former Minister JC Diwakar Reddy had said that his party will not be contesting in the local body elections in Anantapur District.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more