• search
 • Live TV
అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జగన్ గెలుపుకు కారణం అదే .. చంద్రబాబు మారాల్సిందే .. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జేసీ

|
  జగన్ గెలుపుకు కారణం అదే.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జేసీ || Oneindia Telugu

  జేసీ దివాకర్ రెడ్డి ... అనంతపురం జిల్లాలో కీలక రాజకీయ నేతగా ఉన్న ఆయన ఎన్నికలకు ముందు జగన్ గురించి చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక ఎన్నికల అనతరం జగన్ మా వాడని చెప్పి సంచలనం సృష్టించారు. అంతే కాదు తానూ రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు సంచలన ప్రకటన చేశారు. ఇక తాజాగా ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన జగన్ విజయానికి గల కారణం చెప్పి చంద్రబాబు మారాల్సిందే అని ప్రకటన చేశారు. తానూ చంద్రబాబుకు చాలా సార్లు ఆ విషయం చెప్పానని కానీ పట్టించుకోలేదని చెప్పిన జేసీ దివాకర్ రెడ్డి ఇప్పటికైనా బాబు మారాలని సూచించారు.

  అసెంబ్లీ సాక్షిగా... మందలగిరి పప్పు అంటూ లోకేష్ పై ఆ మంత్రి వర్యుల సెటైర్లు

  జగన్ చాలా కష్టపడ్డాడు కనుకే రాటు దేలాడు అన్న జేసీ దివాకర్ రెడ్డి

  జగన్ చాలా కష్టపడ్డాడు కనుకే రాటు దేలాడు అన్న జేసీ దివాకర్ రెడ్డి

  ఎన్నికల సమయంలో జగన్ పై విరుచుకుపడిన జేసీ దివాకర్ రెడ్డి ప్రత్యేక హోదా విషయంలో వైయస్ జగన్ మెుదటి నుంచి నిజాయితీగా ఉన్నాడని తెలిపారు. జగన్ చాలా కష్టపడ్డాడని అందుకే రాటుదేలాడని పేర్కొన్నారు. వైఎస్ జగన్ పాలనపై ఇప్పుడే విమర్శలు చేయకూడదని తాను చంద్రబాబునాయుడుకు సూచించినట్టుగా చెప్పిన జేసీ ఇప్పుడు మనం కొంతకాలంపాటు మౌనంగా ఉండాలని నిర్ణయం తీసుకొన్నామన్నారు. కానీ అప్పుడే విమర్శలు చేయటం మంచిది కాదని చెప్పారు. ఇక చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేఖత లేదని కేవలం ప్రజలు మార్పు కోరుకున్నారని చెప్పారు. అంతే తప్ప చంద్రబాబు మీద ఎలాంటి వ్యతిరేఖత లేదన్నారు. ఇక టీడీపీ ఎమ్మెల్యేల మీద ఉన్న విముఖత టీడీపీకి మైనస్ అయ్యిందని ఆయన పేర్కొన్నారు.

  పార్టీ మారాలని ఆఫర్లు వచ్చాయి కానీ పార్టీ మార్పుపై అలోచంచలేదు అన్న జేసీ దివాకర్ రెడ్డి

  పార్టీ మారాలని ఆఫర్లు వచ్చాయి కానీ పార్టీ మార్పుపై అలోచంచలేదు అన్న జేసీ దివాకర్ రెడ్డి

  జేసీ దివాకర్ రెడ్డి తనకు వైసీపీ నుండి బీజేపీ నుండి ఆహ్వానం వచ్చిందని , కానీ తను పార్టీ మార్పుపై ఎలాంటి ఆలోచన చెయ్యలేదని పేర్కొన్నారు. ఇక తన కుమారుడు పవన్ కుమార్ పార్టీ మార్పు తన ఇష్టం అని తానేమీ చిన్న పిల్లాడు కాదని ఆయన పేర్కొన్నారు. 47 ఏళ్ల వయస్సు ఉన్న తన కుమారుడికి ఏది మంచో.. ఏది చెడో నిర్ణయం తీసుకొనే సామర్ధ్యం ఉందన్నారు. టీడీపీలో ఉండాలో వైసీపీలో చేరాలోనిర్ణయం తీసుకొనే శక్తి ఆయనకు ఉందన్నారు. తాను మాత్రం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆయన గుర్తు చేశారు. తానింకా టీడీపీలోనే ఉన్నానని చెప్పిన జేసీ చంద్రబాబు పాలనపై పెట్టిన శ్రద్ధ, పార్టీ పై పెట్టలేదని పార్టీ పై పెట్టి ఉంటె గెలిచే వారని అన్నారు . పార్టీలో చాలా మంది నేతలు చంద్రబాబు నిర్ణయాలతో ఇబ్బంది పడ్డారని, కేశినేని నానీ వంటి వారు అనేక బాధలు పడ్డారని చెప్పుకొచ్చారు.

  జగన్ కు లోకేష్ కు తేడా ఇదే .. చంద్రబాబు మారాలి .. జేసీ సూచన

  జగన్ కు లోకేష్ కు తేడా ఇదే .. చంద్రబాబు మారాలి .. జేసీ సూచన

  జగన్ రాజకీయాలలో అలుపెరుగని పోరాటం చేసి అనేక దెబ్బలు తిని రాటు దేలాడని పేర్కొన్నారు. ఇక లోకేష్ కు ఎలాంటి దెబ్బలు తగలలేదు కాబట్టే రాటుదేలలేదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా చంద్రబాబు మారాలని పేర్కొన్న జేసీ దివాకర్ రెడ్డి టీడీపీకి చంద్రబాబు పెద్ద దిక్కని వ్యాఖ్యానించారు . రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలనే కాంక్ష మెండుగా ఉన్న నాయకుడు అని కితాబిచ్చారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  TDP former MP JC Diwakar Reddy , said he had received an invitation from the YCP from the BJP, but that he had no idea of ​​party change. He added that his son Pawan Kumar is not a small child as he likes to change the party.His 47-year-old son has the ability to decide what's wrong. He had the power to join the YCP in the TDP. He recalled that he had decided to stay away from direct politics. JC said that the attention Chandrababu paid to the administrataion of the state not to rule of the party,
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more