• search
  • Live TV
అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

యనమల వర్సెస్ జేసీ దివాకర్ రెడ్డి ..టీడీపీ ఓటమిపై పరస్పర ఆరోపణలు

|

ఏపీ అసెంబ్లీ లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శత్రువులు మిత్రుల్లా పలకరించుకుంటూ ఉంటే, ఒకే పార్టీ లో ఉన్న వారు విరోధుల్లా దెప్పి పొడుచు కుంటున్నారు. నిన్నటికి నిన్న బాలకృష్ణ , రోజా అసెంబ్లీ ఆవరణలో మాట్లాడుకుంటే, నేడు నారా లోకేష్, ఆళ్ల రామకృష్ణా రెడ్డి లు పలకరించుకున్నారు. ఇక తాజాగా టీడీపీ పై వ్యాఖ్యలు చేస్తూ, తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటన చేసిన జెసి దివాకర్ రెడ్డి, యనమల రామకృష్ణుడు ఒకరి కొకరు తారస పడ్డారు. ఇక వీరిద్దరి మధ్య ఆసక్తికరమైన సంభాషణ చోటు చేసుకుంది.

మంత్రి జయరాం కే కాదు ఆ ఎమ్మెల్యేకు 100 కోట్లకు గాలం వేశారట .. వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ సంచలనం

 రాయలసీమపై కోపం తగ్గిందా అన్న జేసీ ... చేసిందంతా మీరే అన్న యనమల

రాయలసీమపై కోపం తగ్గిందా అన్న జేసీ ... చేసిందంతా మీరే అన్న యనమల

ఒకే పార్టీలో ఉన్నప్పటికీ రెండు వేర్వేరు దారుల్లో ప్రయాణం చేసే నాయకులు జేసీ దివాకర్ రెడ్డి , యనమల రామకృష్ణుడు . ఇక ఈ నేపథ్యంలోనే టి.డి.పి ఓటమి గురించి జేసీ దివాకర్ రెడ్డి, యనమల రామకృష్ణుడు ఒకరిపై ఒకరు పరస్పర నిందలు వేసుకున్నారు. రాయలసీమ పై కోపం తగ్గిందా అంటూ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుని ఉద్దేశించి మాజీ ఎంపీ, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఇక దీని పై యనమల రామకృష్ణుడు స్పందిస్తూ మొత్తం మీరే చేసారు. మీ వల్లనే నష్టం జరిగింది అంటూ కాస్త ఘాటుగానే సమాధానమిచ్చారు.

టీడీపీకి కొత్త తలనొప్పి ..స్వపక్షంలోనే విపక్షం

టీడీపీకి కొత్త తలనొప్పి ..స్వపక్షంలోనే విపక్షం

వీరిద్దరి సంభాషణ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరతీసింది.

ఏది ఏమైనప్పటికీ టి.డి.పి ఓటమి పాలైన టిడిపిలో ఉన్న నేతలందరూ కలిసి ఒక మాట మీద వ్యవహరించాల్సిన తరుణంలో ఎవరికివారు సంచలన వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ దుమారం రేపుతున్నారు. ఒకరిని ఒకరు దెప్పి పొడుచుకున్తున్నారు. ఒకరి మీద ఒకరు ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబుకు నేతల వ్యవహార శైలి ఇబ్బందికరంగా మారింది . టీడీపీకి కొత్త తలనొప్పిగా స్వపక్షంలోనే విపక్షం తయారైంది .

రోజుకో సంచలనంతో జేసీ దుమారం .. పార్టీ శ్రేణుల్లో కన్ఫ్యూజన్

రోజుకో సంచలనంతో జేసీ దుమారం .. పార్టీ శ్రేణుల్లో కన్ఫ్యూజన్

టి.డి.పి ఓటమి పాలైన నాటినుండి నేటి వరకు జెసి దివాకర్ రెడ్డి తెలుగు రోజుకో రకమైన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ పార్టీ మారతారనే భావన కలిగించారు. ఇక అంతే కాదు తాను చేసిన సూచనలు చంద్రబాబు పట్టించుకోలేదని, జగన్ కష్టపడ్డాడు కాబట్టే విజయం సాధించాడని జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం. అసలే పార్టీ ఓటమి తో అనంతపురం జిల్లాలో టీడీపీ శ్రేణులు నిరుత్సాహంతో ఉంటే, తాను రాజకీయాల నుండి వైదొలుగుతానని జేసి దివాకర్ రెడ్డి ప్రకటించడం టిడిపికి పెద్ద దెబ్బ.

ఇక ఇదే సమయంలో రోజుకో సంచలన ఆరోపణతో పార్టీ శ్రేణుల్లో ఆందోళనకు కారణం అవుతున్నారు జేసీ .

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Leaders who travel in two different ways despite being in the same party are JC Diwakar Reddy and Yanamala Ramakrishnudu. Against this backdrop, JC Diwakar Reddy and Yanamala Ramakrishnudu blamed each other on the TDP defeat. Former MP and former minister JC Diwakar Reddy questioned former minister Yanamala Ramakrishnudu on whether he was angry with Rayalaseema. On this, Yanamala Ramakrishnudu responded and did the whole thing yourself. The damage was caused by yours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more