అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆదర్శనీయం: రక్తదానం చేసిన అనంత జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు

|
Google Oneindia TeluguNews

అనంతపురం: జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు నగరంలోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో సోమవారం మధ్యాహ్నం రక్తదానం చేశారు. డిసెంబర్ 21న జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు జన్మదిన సందర్భంగా ఆస్పత్రిలోని రక్త సేకరణ గదిలో రక్తదానం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. నవీన్, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శివ శంకర్ నాయక్‌లు దగ్గరుండి పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌కు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా. నీరజ తదితరులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సీఎస్ఆర్ఎం డా. విశ్వనాథయ్య, డిప్యూటీ సీఎస్ఆర్ ఎం డా. వెంకటేశ్వరరావు, డా. విజయమ్మ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

anantapur district collector gandham chandrudu donates blood on his birthday

కలెక్టర్ గంధం సేవలు ప్రశంసనీయం
కాగా, కలెక్టర్ గంధం చంద్రుడు జిల్లాలో అనేక మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. కరోనా మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో ఆయన జిల్లా వ్యాప్తంగా కరోనా వ్యాప్తి కట్టడికి అనేక చర్యలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన చేసిన కృషిని గుర్తించి అభినందించింది.

గంధం చంద్రుడు జిల్లా కలెక్టర్ అయినా సేవ పరంగా మాత్రం అందరినీ సమన్వయం చేసుకుంటూ..కొన్ని సందర్భాల్లో తనకు తాను వినూత్నంగా ఆలోచనలు చేసి కోవిడ్ పరిస్థితుల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. కలెక్టర్ గంధం చంద్రుడు కలెక్టొరేట్‌లోని తన కార్యాలయానికే పరిమితం కాలేదు. తన కార్యాలయంలోనే కూర్చొని కేవలం కోవిడ్ రోగులు..పరీక్షల లెక్కల కోసం మాత్రమే పని చేయలేదు. ఆయన క్షేత్ర స్థాయిలో పర్యటించారు. బాధితులు ఏం కోరుకుంటున్నారో తెలుసుకున్నారు. వారికి తగినట్లుగా వాటిని ఏర్పాటు చేయటంతో వినూత్నంగా వ్యవహరించారు. ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకొనేందుకు ఎన్నో సేవా సంస్థలు ఉన్నాయి..వాటి సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నిర్ణయించారు. తగిన విధంగా ప్రణాళికలు సిద్దంచేశారు. మందుల షాపుల వారిని ఒప్పించారు. మందుల కొనుగోళ్లలో రాయితీలు ఇప్పించి బాధితులకు ఊరటనిచ్చారు. అదే విధంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న వారిని వ్యక్తిగతంగా ప్రోత్సహించారు. వారికి తన స్వదస్తూరితో సిద్దం చేసిన గ్రీటింగ్ కార్డులను ఆషా వర్కర్లు మొదలు వీఆర్వో..గ్రామ సచివాలయ ఉద్యోగులు..వాలంటీర్లకు పంపుతున్నారు. కలెక్టర్ స్వయంగా పంపటం వారిలో మరింత ప్రోత్సాహాన్నిచ్చింది. కార్డుతో పాటుగా ఒక మొక్కను కూడా బహుమతిగా ఇస్తున్నారు.

anantapur district collector gandham chandrudu donates blood on his birthday

ఇక కోవిడ్ కష్టకాలంలో ఆర్థికంగా నష్టపోకూడదని ఒక వినూత్న ఆలోచన చేశారు కలెక్టర్ గంధం చంద్రుడు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించకుండా వ్యాపారులే కస్టమర్లకు డిస్కౌంట్‌లు ప్రకటించేలాంటి వినూత్నమైన పద్ధతిని తీసుకొచ్చారు. తద్వారా ఇటు వ్యాపారస్తులు నష్టపోకుండా అటు కస్టమర్లకు కావాల్సిన నిత్యవసరాలు కూడా దొరికేందుకు దోహదం చేసేలా ఆ ఆలోచన ఉందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించే కస్టమర్లకు డిస్కౌంట్లు ఇస్తామంటూ దుకాణాల ముందు బ్యానర్లు వెలిశాయి. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం , శానిటైజర్లను వినియోగించడం వంటి జాగ్రత్త చర్యలు తీసుకున్నవారికి డిస్కౌంట్లు ఇస్తామంటూ బ్యానర్లు దుకాణాల ముందు కనిపిస్తున్నాయి.

కరోనావైరస్ సెంటర్లలో బాధితులు ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారని తెలుసుకున్న కలెక్టర్ గంధం చంద్రుడు వీరికోసం మంచి ఆలోచన చేశారు. మానసికంగా ఉల్లాసంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటే పేషెంట్లలో ఒంటరితనం అనేది దూరం అవుతుందని భావించిన కలెక్టర్ చంద్రుడు... ఒక మ్యూజిక్ సిస్టంను కోవిడ్ కేర్ సెంటర్లలో అమర్చారు. మంచి సంగీతం వింటూ పేషెంట్లు ఒంటరి తనాన్ని మర్చి పోతున్నారు. అంతేకాదు టెన్నిస్, షటల్, వాలీబాల్, క్యారమ్స్‌లాంటి ఇండోర్ గేమ్స్‌ను కూడా కోవిడ్ సెంటర్లలో పరిచయం చేశారు. ఇష్టమున్న వారు ఇష్టమొచ్చిన గేమ్స్ ఉదయం సాయంత్రం ఆడేలా వీలు కల్పించారు. అంతేకాదు కరోనావపేషెంట్లలో కాన్ఫిడెన్స్ నింపేలా కౌన్సిలర్లను సైతం ఏర్పాటు చేశారు. ఆయన చేసిన సేవల డాక్యెమెంటరీని చూసిన కేంద్ర ప్రభుత్వం కలెక్టర్ ను అభినందించింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం కలెక్టర్ చొరవను అభినందించింది.

అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఆయన ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లాలో కలెక్టర్ స్థాయి నుంచి మండల స్థాయి వరకు అన్ని అధికార బాధ్యతలను బాలికలకు అప్పగించారు. జిల్లా వ్యాప్తంగా ఒకే సారి ఈ తరహా కార్యక్రమాన్ని అమలు చేయడం దేశంలోనే మొదటిసారి కావడం గమనార్హం.

ఆడపిల్లల హక్కులను కాపాడేందుకు, స్వావలంబన దిశగా వాళ్లను నడిపించాలనే లక్ష్యంతో ప్రతి ఏటా అక్టోబర్‌ 11న ''అంతర్జాతీయ బాలికల దినోత్సవం'' జరపాలని ఐక్యరాజ్యసమితి తీర్మానించింది. ఈ మేరకు 2012 నుంచి ప్రతి ఏటా అక్టోబర్ 11న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాగా, ఈ ఏడాదికిగానూ ''మై వాయిస్, అవర్‌ ఈక్వల్‌ ఫ్యూచర్'' థీమ్ బాలికల దినోత్సవాన్ని జరుపుతున్నారు. దేశంలోని అన్ని జిల్లాలకంటే గొప్పగా అనంతపురంలో బాలికల దినోత్సవాన్ని ఘనంగా, వినూత్నంగా నిర్వహించిన కలెక్టర్ గంధం చంద్రుడిపై ప్రశంసలు వెల్లువెత్తాయి.

English summary
anantapur district collector gandham chandrudu donates blood on his birthday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X