అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శవం దొరికితే రాజకీయం చెయ్యటానికి వస్తున్నావా చంద్రబాబు అని ఫైర్ అయిన వైసీపీ ఎమ్మెల్యే

|
Google Oneindia TeluguNews

అనంతపురం జిల్లాలో చంద్రబాబు హత్యగావించబడిన టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించటంతో పాటు టీడీపీ కార్యకర్తల్లో భరోసా నింపటానికి యాత్ర చేశారు . అయితే చంద్రబాబు యాత్రపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు తెలుగుదేశం పార్టీయే నాంది పలికిందని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. ఫ్యాక్షన్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన చంద్రబాబు నాయుడే యాత్రలు చెయ్యటం విడ్డూరం అని ఆయన విమర్శలు గుప్పించారు.

<strong>అమరావతి నిర్మాణానికి బ్రేకులు వేసిన ప్రపంచ బ్యాంకు .. జగన్ ముందుంది పెను సవాల్</strong>అమరావతి నిర్మాణానికి బ్రేకులు వేసిన ప్రపంచ బ్యాంకు .. జగన్ ముందుంది పెను సవాల్

అనంతపురం జిల్లాలో జరుగుతున్న దాడులకు కారణం తెలుగుదేశం పార్టీయే కారణమని ఆరోపించారు. గత ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా టీడీపీ నేతలకు బుద్ది రావడం లేదన్నారు. అనంతపురంలో శాంతిభద్రతలపై చంద్రబాబు మాట్లాడటం హేయం అని , చంద్రబాబు ఇప్పటికైనా సిగ్గుతో తలదించుకోవాలని హెచ్చరించారు. ఇక చంద్రబాబు శవం కనిపిస్తే చాలు రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శవ రాజకీయం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వంలోనే అనంతపురం జిల్లాలో ఎన్నో దాడులు జరిగాయని హత్యలు జరిగాయని ఆరోపించారు.

Chandrababu Come to politicize the corpse ..YCP MLA fire

ఇక రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పరామర్శించడానికి ఒక్కసారి కూడా చంద్రబాబు రాలేదని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు శవం దొరికితే రాజకీయం చేసేందుకు వస్తున్నాడని ధ్వజమెత్తారు. ఇదే దిన చర్యగా చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఇక చంద్రబాబు అవినీతి అక్రమాల గురించి మాట్లాడటం హేయమైన చర్య అంటూ తిట్టిపోశారు. అక్రమాల గురించి మాట్లాడే చంద్రబాబు ఉంటుంది ఒక అక్రమ కొంపలోనేనని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు . అక్రమ కొంప కోసం నానా యాగి చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.

English summary
YSRCP MLA Kethireddy Venkatramireddy blamed the Telugu Desam Party for the attacks in Anantapur district. Despite the rejection of the last election, the TDP leaders have not come to mind.Chandrababu's tour appears to be politicized. Chandrababu Naidu has been accused of trying to politicize the corpse. He claimed that hundreds of farmers had committed suicide in the Anantapur district during the Telugu Desam government. but chandrababu never console the families .Now, TDP chief Chandrababu has come to politicize the corpse.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X