• search
  • Live TV
అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఆ ప్రశ్నకు చంద్రబాబు దగ్గర కూడా సమాధానం లేదట ..ఆ ప్రశ్న ఏంటో తెలుసా ?

|

ఏపీ మాజీ సీఎం అనంతపురం పర్యటన సందర్భంగా చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన దగ్గర ఒక ప్రశ్నకు సమాధానం లేదని ఆయన చెప్పారు. అసలు సమాధానమే లేని ప్రశ్న ఉంటుందా? ఇంతకీ చంద్రబాబుకే సమాధానం తెలియని ఆ ప్రశ్న ఏంటి ? రాజకీయాల్లో 40 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబుకు తెలీని ప్రశ్న ఏంటి ? ఏ విషయంలో చంద్రబాబు సమాధానం తెలీకుండా ఇబ్బంది పడుతున్నారు ? అన్న ప్రశ్న ఆయన మాటలు విన్నవారికి ఉత్పన్నం అవుతుంది. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటో తెలియాలంటే ఇది చదివెయ్యండి.

లోకేష్... ప్రెస్ మీట్ పెట్టి ఆ మూడు పదాలు సరిగ్గా పలుకు ముందు అంటున్న వైసీపీ ఎమ్మెల్యే

అనంతపురం పర్యటనలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్య

అనంతపురం పర్యటనలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్య

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులతో ఆందోళనలో ఉన్న కార్యకర్తలకు భరోసా ఇవ్వటానికి ఈ యాత్ర చేపట్టారు .వైసీపీ నేతలు, కార్యకర్తల దాడులకు గురైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో మనోధైర్యం నింపేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో నేడు తాడిపత్రిలో హత్యకు గురైన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి, పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ఎన్నికల్లో ఓటమి పాలవటం పై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అందరూ ఓట్లేశామని చెప్తే ఆ ఓట్లు ఏమైపోయాయో తెలీటం లేదన్న చంద్రబాబు

అందరూ ఓట్లేశామని చెప్తే ఆ ఓట్లు ఏమైపోయాయో తెలీటం లేదన్న చంద్రబాబు

కార్యకర్తలపై దాడులను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేసిన ఆయన కార్యకర్తలతో మాట్లాడుతూ "మీ గ్రామంలో మీరు ఏకాకి కాదు. తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది అని పేర్కొన్నారు. మనది ఒక్క గ్రామానికే పరిమితమైన పార్టీ కాదు, రాష్ట్రం అంతటా ఉంటుంది. మీరు ఆత్మస్థైర్యంతో ఉండాలని పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.ఎక్కడికి వెళ్లినా ఒక్కటే అడుగుతున్నారు, సార్ మేమంతా ఓట్లేశాం, ఆ ఓట్లు ఏమైపోయాయి అంటున్నారు. ఈ ప్రశ్నకు నా దగ్గర కూడా సమాధానం లేదు తమ్ముళ్లూ! అని చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

 ఆ ప్రశ్నకు టీడీపీ నేతలు బోలెడు సమాధానాలు చెప్తే చంద్రబాబు దగ్గర ఒక్క సమాధానం కూడా లేదట

ఆ ప్రశ్నకు టీడీపీ నేతలు బోలెడు సమాధానాలు చెప్తే చంద్రబాబు దగ్గర ఒక్క సమాధానం కూడా లేదట

దాడులు చేయడం తప్పు అన్న వాళ్లపైనా తప్పుడు కేసులు పెడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేమన్నా రౌడీరాజ్యం అనుకుంటున్నారా? ఇది ప్రజాస్వామ్యం కాదా? ఏమనుకుంటున్నారు మీరు? అంటూ నిప్పులు చెరిగారు . ప్రాణం పోయినా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాంమని చంద్రబాబు ఆవేశపూరితంగా ప్రసంగించారు. ఇప్పటికీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమికి అనేక కారణాలు ఉన్నయని చెప్తున్నా , సొంత పార్టీ నేతలే పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషించినా చంద్రబాబు మాత్రం అందరూ ఓట్లు వేశారని అయినా ఆ ఓట్లు ఏమయ్యాయి అన్న ప్రశ్నకు తన దగ్గర సమాధానం లేదని చెప్పటం గమనార్హం . చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది.

English summary
You are not alone in your village. The Telugu Desam Party will be your support. We are not a limited party in one village but across the state. You are trying to be brave in the ranks of the party," Chandrababu said. Wherever i go, people are asking only, Sir, we are all voted to TDP , what happened to those votes? I don't even have an answer to this question! Chandrababu made interesting comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X