వయ్యో.. ఏందిది.. గుంతపొంగనల్లో సిగరేట్ పీకలు, గజ్జుమన్న ఫుడ్ లవర్స్..
ఇంటి ఫుడ్.. ఇంటిదే.. రుచి కోసమే, మరేదైనా కారణంతో బయట ఫుడ్ తీసుకోవద్దు. అంటే ఇంట్లోనే శుచి, శుభ్రత ఉంటాయి. మరీ హోటల్, రెస్టారెంట్లలో నీట్‌గా ఉన్న కొన్ని సందర్భాల్లో తప్పిదాలు జరుగుతుంటాయి. అవును ఆ మిస్టెక్స్ వల్ల జనం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇలాంటి ఘటనలు.. రోజుకో చోట వెలుగుచూస్తోంది. అయినా అధికారులు మాత్రం తూతూ మంత్రంగా దాడులు చేసి వదిలేస్తున్నారు. దీంతో ప్రజల ఆరోగ్యానికి రక్షణ లేకుండా పోతుంది.

సిగరేట్ పీక
గుంత పొంగనాల్లో సిగరెట్ పీకలు కనిపించాయి. అవును మీరు చదివేది నిజమే. హోటల్ నిర్వాహకుడిని నిలదీస్తే సరైన సమాధానం రాక పోవడంతో బాధితుడు ఫుడ్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేశారు. అనంతపురానికి చెందిన శివ బుధవారం కమలానగర్‌లోని లక్ష్మీనరసింహా పొంగనాల హోటల్‌కు వెళ్లాడు. రూ.200 చెల్లించి పది ప్యాకెట్లు తీసుకెన్నాడు. తిరిగి వచ్చి కార్యాలయంలో స్నేహితులతో కలిసి పొంగనాలు తింటున్నాడు. ఇంతలో వారు విస్తుపోయే ఘటన జరిగింది.

తింటుండగా అనుమానం వచ్చి చూడగా..
అవును వారంతా.. అలా తింటుండగా రెండు తాగిపడేసిన సిగరెట్ పీకలు కనిపించాయి. దీంతో ఆశ్చర్యపోయారు. వెంటనే హోటల్ నిర్వాహకుడి దృష్టికి తీసుకెళ్లారు. అయినా అతని నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో చేసేదేమీ లేక ఫుడ్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు అధికారి స్పందించారు. కానీ ఫుడ్ తినేసిన వారు మాత్రం ఆందోళన చెందారు. ఏదో సాయం కాలం అలా టిఫిన్ చేద్దాం అనుకుంటే.. ఇలా జరిగిందని అంటున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

కఠిన చర్యలు తీసుకోవాల్సిందే..
ఘటనను నెటిజన్లు ఖండిస్తున్నారు. ఆ హోటల్ క్లోజ్ చేయాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడటం కరెక్టు కాదని వారు అంటున్నారు. లేదంటే గట్టిగా మందలించి వదిలేయాలని కోరుతున్నారు. ఊరికే ఉంటే.. ఏమీ పట్టనట్టు బీహేవ్ చేస్తారని చెబుతున్నారు. మరోసారి ఇలాంటి తప్పిదం జరుగుతుందని అంటున్నారు. ప్రజల ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్.. దీని కోసం ఫుడ్ ఇన్స్ పెక్టర్లు కఠిన చర్యలు తీసుకోవాలి.. ఏదో తనిఖీ చేశాం అనేలా మాత్రం ప్రవర్తించొద్దు. ఇదే విషయాన్ని యువత పదే పదే చెబుతోంది.