అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భర్తను చంపుతామని బెదిరించి ఏడాదిగా మహిళపై అత్యాచారం..

|
Google Oneindia TeluguNews

రాయదుర్గం : భర్తను చంపుతామని మహిళను బెదిరించిన నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఏడాదిగా వారి వేధింపులు భరించిన ఆమెకు ఈ మధ్య మరింత నరకం చూపించడం మొదలుపెట్టారు. భర్తను చంపేస్తామని, యాసిడ్ పోస్తామని బెదిరించడంతో చివరకు ధైర్యం కూడగట్టుకుంది. జరిగిన విషయాన్ని భర్తకు చెప్పి అతని సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పరిచయం పెంచుకుని

పరిచయం పెంచుకుని

అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన వ్యక్తి భార్యతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. సదరు మహిళ రోజు ఉదయం పాల ప్యాకెట్ కోసం దగ్గరిలోని దుకాణానికి వెళ్లేది. అలా ఆ షాప్ యజమాని ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. సదరు మహిళ ఫేస్‌బుక్ వాడుతోందన్న సమాచారం తెలుసుకుని ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి మరింత దగ్గరయ్యాడు. ఆ తర్వాత నెంబర్ తెలుసుకుని తరుచూ మాట్లాడేవాడు. ఆ సంభాషణను రికార్డు చేసి దాన్ని భర్తకు పంపుతానని బెదిరించి తన కామ వాంఛ తీర్చుకున్నాడు. అప్పటి నుంచి ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.

మహిళను బెదిరించి అత్యాచారం

మహిళను బెదిరించి అత్యాచారం

సదరు మహిళతో సంబంధం పెట్టుకున్న దుకాణదారుడు ఈ విషయాన్ని తన ముగ్గురు స్నేహితులకు చెప్పాడు. వారు కూడా ఇదే రీతిలో వేధించడం మొదలుపెట్టారు. చివరకు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఏడాదిగా ఈ తతంగం సాగుతుండగా.. ఈ మధ్య కాలంలో వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. చివరకు తమ కోరిక తీర్చకపోతే భర్తను చంపేస్తామని, ఆమెపై యాసిడ్ పోస్తామని బెదిరించారు.

భర్త సాయంతో పోలీసులకు ఫిర్యాదు

భర్త సాయంతో పోలీసులకు ఫిర్యాదు

నలుగురు కామాంధుల వేధింపులు తారాస్థాయికి చేరడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో మహిళ విషయాన్ని భర్తకు చెప్పింది. అతని సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కంప్లైంట్ ఆధారంగా పోలీసులు రెడ్ విత్ 34, 376, 370, 354, 506 సెక్షన్ల కింద రాయదుర్గం పోలీసులు కేసు నమోదుచేశారు. నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

English summary
A case has been registered against four persons in rayaduram police station. four accused harrassed a women and raped several time. in recent time they thretened the women that they will kill his husband if she wont cooperate with them
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X