అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అనంతపురం యువతకు అవకాశం .. కియా అనుబంధ సంస్థల్లో రేపు ఎంట్రీ లెవల్ పరీక్ష

|
Google Oneindia TeluguNews

అనంతపురం జిల్లాలో యువతకు ఉపాధి కల్పించడం కోసం నెలకొల్పబడిన కియా, దాని అనుబంధ సంస్థల్లో ఎంట్రీ లెవల్ పొజిషన్ కోసం యువతకు పరీక్ష నిర్వహించనుంది రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ . ఇప్పటికే నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్న అనంతపురం జిల్లా యువతకు కియా దాని అనుబంధ సంస్థల్లో 75% ఉద్యోగాలను కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం అందులో పనిచేసే యువతీ యువకుల సెలక్షన్ స్టార్ట్ చేసింది.

చంద్రబాబు ఓ హై టెన్షన్ వైర్ .. ముట్టుకుంటే బూడిదే అంటున్న టీడీపీ ఎమ్మెల్సీచంద్రబాబు ఓ హై టెన్షన్ వైర్ .. ముట్టుకుంటే బూడిదే అంటున్న టీడీపీ ఎమ్మెల్సీ

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కియా , దాని అనుబంధ సంస్థల్లో ఎంట్రీ లెవెల్‌ పొజిషన్‌కు ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తున్నట్లు సంస్థ మేనేజర్‌ శ్రీకాంత్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇక ఈ పరీక్ష రాసేందుకు స్థానికత కలిగిన అనంతపురం జిల్లాలోని డిప్లొమా, పాలిటెక్నిక్‌ చేసిన యువతీయువకులు అర్హులన్నారు. వీరి వయస్సు 18 నుంచి 25సంవత్సరాల మధ్య ఉండాలని పేర్కొన్నారు. ఈ పరీక్ష రాయాలనుకునే అభ్యర్థులకు జేఎన్‌టీయూలోని సీమెన్స్‌ సెంటర్‌ బ్లాక్‌లో పరీక్ష ఉంటుందని తెలిపారు సంస్థ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి .

Opportunity for youth in Anantapur .. Entry level examination tomorrow at Kia subsidiaries

అర్హత కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు కియా దాని అనుబంధ సంస్థలు ఎంట్రీ లెవల్ పొజిషన్ ఆన్లైన్ పరీక్ష రాయాలనుకుంటే 9398643930, 7658 902296 నెంబర్లలో సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక కరువు కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న అనంతపురం జిల్లా యువతీ యువకులకు ఇది సువర్ణవకాశం అనే చెప్పాలి. జులై 19 న అంటే రేపు నిర్వహించే ఈ పరీక్షలో తమ ప్రతిభ చూపి ఎంట్రీ లెవల్ పొజిషన్ సొంతం చేసుకోవాలని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ పేర్కొంటుంది.

English summary
The government has said that Kia will provide jobs to 75% of its subsidiaries to the youth of Anantapur district. In a statement, state's talent development agency manager Srikanth Reddy said Kia and its subsidiaries are conducting an online test for entry level positions under the state's talent development agency. Diploma and Polytechnic youth from the local Anantapur district are eligible to take this examination.Their age is between 18 to 25 years. Candidates who want to take the test will have a test in the Siemens Center block in JNTU, said Srikanth Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X