వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్రమాస్తుల్లో నా పేరు తొలగించండి: జగన్, మోసం చేశాడు, పక్కా ఆధారాలు: సిబిఐ

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

అక్రమాస్తుల్లో నా పేరు తొలగించండి: పక్కా ఆధారాలు: సిబిఐ Jagan filed discharge petion|Oneindia Telugu

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు.

చదవండి: 'జగన్ జగతి కోసం బెదిరించారు, కుట్రలో సాయిరెడ్డి కీలకం, తిరిగివ్వమన్నా'

అక్రమాస్తుల కేసులో నా పేరు తొలగించండి

అక్రమాస్తుల కేసులో నా పేరు తొలగించండి

రాంకీ, వాన్‌పిక్, జగతి పబ్లికేషన్స్ పెట్టుబడుల వ్యవహారంలో ఛార్జీషీట్ నుంచి తనను తొలగించాలని వైయస్ జగన్ ఆ పిటిషన్‌లో కోరారు. అయితే జగతి పబ్లికేషన్స్ వ్యవహారంలో సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది.

జగన్ మోసంపై పక్కా ఆధారాలు

జగన్ మోసంపై పక్కా ఆధారాలు

పెట్టుబడిదారులను జగన్ మోసం చేశారని సిబిఐ కౌంటర్ పిటిషన్లో పేర్కొంది. జగన్‌ పాత్రపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయని సిబిఐ తెలిపింది.

విజయసాయి రెడ్డి కూడా ఇటీవలే పిటిషన్

విజయసాయి రెడ్డి కూడా ఇటీవలే పిటిషన్

జగన్‌ దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్‌పై శుక్రవారం సిబిఐ కోర్టులో విచారణ జరగనుంది. ఇదే కేసులో తన పేరును తొలగించాలని పేర్కొంటూ వైసిపి ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ఇటీవల డిశ్చార్జి పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆయన పిటిషన్‌ పైనా సిబిఐ కౌంటర్‌ దాఖలు చేసింది.

విజయసాయి రెడ్డిపై కౌంటర్ ఇలా

విజయసాయి రెడ్డిపై కౌంటర్ ఇలా

2007లో డైరెక్టర్‌ పదవికి విజయ సాయి రెడ్డి రాజీనామా చేసినా పెట్టుబడులు రాబట్టడంలో కీలకంగా వ్యవహరించారని సాయి రెడ్డిపై కౌంటర్ పిటిషన్లో సిబిఐ ఇటీవల పేర్కొంది. ఆయనపై అభియోగాలను నిరూపించేందుకు అన్ని ఆధారాలూ తమ వద్ద ఉన్నాయని తెలిపింది.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy on Thurs Day filed discharge petion in CBI court. CBI filed counter petition on Jagathi Publications issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X