అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో 1000 జన ఔషది షాపులు: దశ తిరగనుందా? (ఫోటోలు)

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త్వ‌ర‌లోనే రోగులకు అత్యంత చవకగా నాణ్యమైన మందులు, ఇతర ఔషధాలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో వెయ్యి జనరిక్ మందల దుకాణాలు ఏర్పాటుకు కేంద్రం అంగీకారం తెలిపింది. మంగళవారం ఢిల్లీలో కేంద్ర కెమికల్స్, పెట్రోలియం శాఖ మంత్రి అనంత్ కుమార్ ఆధ్యక్షతన జన ఔషదిపై జరిగిన సమావేశంలో ఈమేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది.

ఏపీ తరుపున వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీ‌నివాస్ ఈ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అనంత్‌కుమార్, ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ సమక్షంలో జనరిక్ మందుల దుకాణాల ఏర్పాటుపై డ్రాప్ట్ ఎంఓయూ చేసుకున్నారు. దీని కోసం నిధులు కేటాయిస్తున్న‌ట్లు కేంద్రం పేర్కొంది.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అనంత కుమార్ మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో జన ఔషదిపై మరో మారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకుంటాయని తెలిపారు. జన ఔషది దుకాణాలు రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి కేంద్రం నుంచి పూర్తి సహకరం అందిస్తామని ఆయన అన్నారు.

దేశ వ్యాప్తంగా అన్ని చోట్ల జన ఔషది దుకాణాలు ఏర్పాటు చేసేందుకు ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఇక మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం ఆగస్ట్ 15నుంచి జన ఔషది కేంద్రాలను రాష్ట్రామంతటా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా 600 రకాల మందులను జన ఔషది దుకాణాల ద్వారా పేదలకు అందించనున్నట్లు ఆయన తెలిపారు.

బయట మందుల దుకాణాల కన్నా 10 రెట్లు తక్కువ ధరకే ఇక్కడ మందులు లభిస్తాయని మంత్రి కామినేని తెలిపారు. ప్రతి 50 వేల మందికి ఒక జనరిక్ దుకాణాని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తక్కువ ధరకే నాణ్యమైన మందులు అందుబాటులోకి రానున్నందున జన ఔషది కేంద్రాలతో పేదలకు చాలా ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.

ఏపీలో 100 జనరిక్ మందుల షాపుల ఏర్పాటుకు కేంద్రం అంగీకారం

ఏపీలో 100 జనరిక్ మందుల షాపుల ఏర్పాటుకు కేంద్రం అంగీకారం

కేంద్ర ప్రభుత్వం ఏపీలోని ప్రతి మండలంలో జన ఔషది కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఒక్కొక్క ఔషద కేంద్రానికి రెండున్నర లక్షల రూపాయల ఆర్థిక సాయం కేంద్ర ప్రభుత్వం చేయనుందన్నారు. జన ఔషదిలో ప్రస్తుతం అందిస్తున్న మందులతో పాటు క్యాన్సర్, హెచ్.ఐ.వి, హిమోఫిలియా వంటి ప్రాణంతాక జబ్బులతో ఎక్కువుగా పేదవారు భాదపడుతున్నందున ఈ వ్యాధులకు సంబంధించిన ఖరీదైన మందులను జన ఔషది ద్వారా పేదలకు అందుబాటులోకి తీసుకొని రావలని మంత్రి కామినేని కేంద్ర మంత్రి అనంత్ కుమార్‌ను ఈ సందర్భంగా కోరారు.

ఏపీలో 100 జనరిక్ మందుల షాపుల ఏర్పాటుకు కేంద్రం అంగీకారం

ఏపీలో 100 జనరిక్ మందుల షాపుల ఏర్పాటుకు కేంద్రం అంగీకారం

కాగా, ఒక్క ఏపీకే వెయ్యి జనరిక్‌ మందుల దుకాణాలు కేటాయించడంపట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అనంత్ కుమార్‌కు మంత్రి కామినేని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి కామినేనితో పాటు ప్రిన్సిపల్ సెక్రటరి పూనం మాలకొండయ్య, ఎన్టీఆర్ వైద్యసేవ సీఇవో రవిశంకర్ అయ్యన్నర్, గుప్త, సెర్ఫ్ ఆధికారి నిలకంఠారెడ్డి పాల్గొన్నారు.

ఏపీలో 100 జనరిక్ మందుల షాపుల ఏర్పాటుకు కేంద్రం అంగీకారం

ఏపీలో 100 జనరిక్ మందుల షాపుల ఏర్పాటుకు కేంద్రం అంగీకారం

విజయవాడ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పీజీ జనరల్ సర్జన్‌కి, నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీయస్ కు ఎమ్.సి.ఐ గుర్తింపు ఇస్తున్నాట్లు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సమావేశానికి మంత్రి కామినేని శ్రీనివాస్ హాజారయ్యారు.

ఏపీలో 100 జనరిక్ మందుల షాపుల ఏర్పాటుకు కేంద్రం అంగీకారం

ఏపీలో 100 జనరిక్ మందుల షాపుల ఏర్పాటుకు కేంద్రం అంగీకారం

ఈ సమావేశంలో రాష్ట్రంలోని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపులేని అన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుమతులు మంజూరు చేయాలని ఎమ్.సి.ఐ చైర్మన్ జయశ్రీ బేన్ మెహతాను మంత్రి కామినేని కోరారు. రాష్ట్రంలో కొనసాగించాల్సిన పలు మెడికల్ కోర్సులపై వెంటనే అనుమతులు మంజూరు చేయాలని, లేనిపక్షంలో విద్యార్ధులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఎమ్.సి.ఐ చైర్మన్ జయశ్రీ మెహతాకి మంత్రి కామినేని తెలిపారు.

English summary
The Central Government has sanctioned 1,000 Jan Aushadhi (generic medicine) shops for Andhra Pradesh. A Memorandum of Understanding to this effect was signed by the Central and State Governments in New Delhi on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X