వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోటెత్తిన భక్తులు, శ్రీవారి సేవలో ప్రముఖులు(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

తిరుమల: నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం తిరుమలలో భక్తులు క్రమేపీ పెరుగుతున్నారు. దర్శనం పూర్తి చేసుకుని కొంత మంది భక్తులు తిరగు ముఖం పడుతుంటే, అంతకు పైగా రెండింతలు పైగా భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి సుజనాచౌదరి, మంత్రి మృణాళిని, ఎంపీలు రాయపాటి, మేకపాటి, సీఎం రమేష్‌, గరికపాటి, మిధున్‌రెడ్డి, వరప్రసాద్‌, టీఎస్‌ మంత్రి మహేందర్‌రెడ్డి, నటుడు బ్రహ్మానందం తిరుమలలేశున్ని దర్శించుకున్నారు. కాగా, మొత్తం 2468 మందికి మాత్రమే టీటీడీ వీఐపీ దర్శనం కల్పించింది.

అర్థరాత్రి ఒంటిగంట నుంచి 3 గంటల వరకు వీఐపీ దర్శనానికి టీటీడీ అనుమతినిచ్చింది. అనంతరం సర్వదర్శనం తెల్లవారుజామున 3:15 గంటల సమయంలో ప్రారంభమైంది. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని తాము చెప్పిన మాటను నిలబెట్టుకున్నామని టీటీడీ ఈఓ తెలిపారు.

ఇక వైకుంఠ ఏకాదశి నాడు తిరుమల శ్రీవారు స్వర్ణరధంపై తిరుమల తిరువీధుల్లో ఊరేగారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామి స్వర్ణరధంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. రధోత్సవంలో భక్తులు అత్యధికంగా పాల్గొన్నారు. భక్తుల గోవిందనా స్మరణతో తిరువీధులు మార్మోగాయి.

 తిరుమలలో పోటెత్తిన భక్తులు

తిరుమలలో పోటెత్తిన భక్తులు

నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం తిరుమలలో భక్తులు క్రమేపీ పెరుగుతున్నారు. దర్శనం పూర్తి చేసుకుని కొంత మంది భక్తులు తిరగు ముఖం పడుతుంటే, అంతకు పైగా రెండింతలు పైగా భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు.

 తిరుమలలో పోటెత్తిన భక్తులు

తిరుమలలో పోటెత్తిన భక్తులు

అర్థరాత్రి ఒంటిగంట నుంచి 3 గంటల వరకు వీఐపీ దర్శనానికి టీటీడీ అనుమతినిచ్చింది. అనంతరం సర్వదర్శనం తెల్లవారుజామున 3:15 గంటల సమయంలో ప్రారంభమైంది.

 తిరుమలలో పోటెత్తిన భక్తులు

తిరుమలలో పోటెత్తిన భక్తులు

సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని తాము చెప్పిన మాటను నిలబెట్టుకున్నామని టీటీడీ ఈఓ తెలిపారు.

 తిరుమలలో పోటెత్తిన భక్తులు

తిరుమలలో పోటెత్తిన భక్తులు

ఇక వైకుంఠ ఏకాదశి నాడు తిరుమల శ్రీవారు స్వర్ణరధంపై తిరుమల తిరువీధుల్లో ఊరేగారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామి స్వర్ణరధంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు.

 తిరుమలలో పోటెత్తిన భక్తులు

తిరుమలలో పోటెత్తిన భక్తులు

రధోత్సవంలో భక్తులు అత్యధికంగా పాల్గొన్నారు. భక్తుల గోవిందనా స్మరణతో తిరువీధులు మార్మోగాయి.

 తిరుమలలో పోటెత్తిన భక్తులు

తిరుమలలో పోటెత్తిన భక్తులు

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. శ్రీవారి సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ ఎన్‌వి రమణ.

తిరుమలలో పోటెత్తిన భక్తులు

తిరుమలలో పోటెత్తిన భక్తులు

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారికి తోమాల సేవ చేశారు. ఈ సేవలో ఆలయ ప్రధాన అర్చకులు పాల్గొన్నారు.

 తిరుమలలో పోటెత్తిన భక్తులు

తిరుమలలో పోటెత్తిన భక్తులు

నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం తిరుమలలో భక్తులు క్రమేపీ పెరుగుతున్నారు. క్యూలో ఉన్న భక్తులకు పాలు అందజేస్తున్న దృశ్యం.

 తిరుమలలో పోటెత్తిన భక్తులు

తిరుమలలో పోటెత్తిన భక్తులు

నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం తిరుమలలో భక్తులు క్రమేపీ పెరుగుతున్నారు. క్యూలో ఉన్న భక్తులకు పాలు అందజేస్తున్న దృశ్యం.

బుధవారం రాత్రి 8 గంటలకే అన్ని క్యూలు నిండిపోయాయి. టీటీడీ అధికారులు ముందు జాగ్రత్తగా క్యూల్లోకి భక్తులను అనుమతించలేదు. దీంతో సహనం కోల్పోయిన భక్తులు కొందరు సామూహికంగా శంకుమిట్ట కాటేజ్ వద్ద క్యూ గేట్లను విరిచారు. మరికొం దరు రాళ్లతో తాళాలను పగుల గొట్టి మరీ క్యూలోకి దూసుకెళ్లారు.

English summary
With the auspicious Vaikuntha Ekadasi falling on the New Year’s day, more than 1.5 lakh devotees have converged on Tirumala Tirupati temple for the darshan of Lord Venkateswara.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X