ఏపీలో కరోనా విజృంభణ: మళ్లీ 10వేలకుపైగా కొత్త కేసులు, 68 మంది మృతి, జిల్లాల వారీగా..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా పరీక్షలను పెంచుతున్న కొద్దీ కరోనా పాజిటివ్ కేసులు కూడా భారీ సంఖ్యలో పెరుగుతుండటం ఆందోళనకరంగా మారింది. ఇప్పటికే దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాస్ట్రాలో జాబితాలో ఏపీ మూడో స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
కరోనా వార్డులో నకిలీ డాక్టర్ కలకలం: 4రోజులపాటు విధులు, మహిళ, ఆమె భర్త అరెస్ట్

కొత్తగా 10వేలకుపైగా కేసులు
తాజాగా, గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 10,167 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1441 కేసులు, కర్నూలు జిల్లాలో 1252 కేసులు, విశాఖపట్నం జిల్లాలో 1223 కేసులు వచ్చాయి. తాజాగా, నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,30,557కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 69,252 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 60,024 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

24గంటల్లో 68 మంది మృతి.. జిల్లాల వారీగా మృతులు..
తాజాగా కరోనా బారినపడి 68 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1281కి చేరింది. మరణాల సంఖ్య జిల్లాలవారీగా గమనిస్తే.. తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో అత్యధికంగా తొమ్మిది మంది చొప్పున మరణించారు. అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం జిల్లాల్లో ఎనిమిది మంది చొప్పున, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆరుగురు చొప్పున, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో నలుగురు చొప్పున, కృష్ణా జిల్లాలో ముగ్గురు, నెల్లూరు, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాతపడ్డారు.

జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు..
కొత్తగా నమోదైన కేసులు జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అనంతపురం జిల్లాలో 954, చిత్తూరులో 509, తూర్పుగోదావరిలో 1441, గుంటూరులో 946, కడపలో 753, కృష్ణా 271, కర్నూలు 1252, నెల్లూరులో 702, ప్రకాశంలో 318, శ్రీకాకుళంలో 586, విశాఖపట్నంలో 1223, విజయనగరంలో 214, పశ్చిమగోదావరిలో 998 కరోనా కేసులు నమోదయ్యాయి.

అత్యధిక కరోనా పరీక్షలు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ..
కాగా, గత 24 గంటల్లో 70,068 నమూనాలను పరకీక్షించికనట్లు ప్రభుత్వం వెల్లడించికంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 18,90,077 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో అత్యధికంగా కరోనా పరీక్షలు ఏపీలోనే చేస్తున్నామని రాష్ట్ర సర్కారు పేర్కొంటున్న విషయం తెలిసిందే.