వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

10 శాతం జీడీపీ వృద్ధి రేటు అనుమానమే: కేంద్ర బడ్జెట్‌పై ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన

|
Google Oneindia TeluguNews

వచ్చే ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధిరేటు 10 శాతంగా ఉంటుందన్న కేంద్ర ప్రభుత్వ అంచనాలపై ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమేరకు అభివృద్ధి సాధించగలిగిన అంశాలేవీ బడ్జెట్ లో లేవని, ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే కేంద్రం మరోసారి మొండిచేయి చూపిందని అన్నారు.

కేంద్ర బడ్జెట్ పై శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. విభజన చట్టంలోని వాగ్ధానాలు మొదలుకొని జీఎస్టీ బకాయిలదాకా ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై బడ్జెట్ లో ప్రస్తావన రాలేదని, కనీసం పోలవరానికి సాయంపైనా కేంద్ర మంత్రి మాట్లాడలేదని, అన్నింటికంటే ముఖ్యమైన ఏపీ ప్రత్యేక హోదాపైనా ప్రకటన చేయకపోవడం అన్యాయమని బుగ్గన వాపోయారు.

10 percent GDP growth rate is doubtful: AP minister buggana on union budget

కేంద్ర బడ్జెట్ పై ఏపీలోని ప్రతిప్రపక్ష పార్టీలు స్పందిస్తున్న తీరును మంత్రి బుగ్గన తప్పుపట్టారు. ఒకవైపు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే, టీడీపీ, ఇతర పార్టీల నేతలు మాత్రం వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని, తద్వారా వాళ్లు ఏపీ ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న విషయాన్ని మర్చిపోతున్నారని బుగ్గన మండిపడ్డారు.

సీఎం జగన్ చేపట్టిన పనులన్నీ రాష్ట్రానికి మేలు చేసేవేనని, రివర్స్ టెండరింగ్ ద్వారా వేల కోట్లు ఆదా చేశామని, ప్యాకేజీల కోసం చంద్రబాబులా కేంద్రం ముందు సాగిలపడలేదని, అక్రమాలు జరిగాయి కాబట్టే పీపీఏలను రద్దు చేశామని మంత్రి బుగ్గన వివరించారు. తప్పులన్నీ తమవైపు పెట్టుకుని టీడీపీ నేతలు ఇప్పుడు వైసీపీపై విమర్శలు చేయడం తగదని ఆయన సూచించారు.

English summary
Andhra pradesh finance minister buggana rajendranath reddy expressed disappointment over union budget 2020-21. He said center did not considered states requirements and expressed doubts on 10 percent GDP growth
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X