వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రకాశంలో 10 మంది వాలంటీర్ల రాజీనామా- అర్హులకు పింఛన్లు ఇవ్వలేక..

|
Google Oneindia TeluguNews

ఏపీలో కుల, మత, ప్రాంత, పార్టీ రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించాలనే సదుద్దేశంతో ప్రారంభమైన గ్రామ వాలంటీర్ల వ్యవస్ధకే మచ్చతెచ్చే ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలో అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వలేక, అలాగని వారితో అవమానాలు భరించలేక 10 మంది వాలంటీర్లు.. చివరికి ఉద్యోగాల నుంచి తప్పుకున్న ఘటన ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై ప్రభుత్వం కూడా సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

 ప్రకాశం జిల్లాలో గ్రామ వాలంటీర్ల పరిస్ధితి...

ప్రకాశం జిల్లాలో గ్రామ వాలంటీర్ల పరిస్ధితి...

ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం నాగులవరంలో గ్రామ వాలంటీర్లు కొందరు గ్రామస్దులకు నెలనెలా ఇచ్చే సామాజిక పింఛన్లను ఇవ్వలేకపోతున్నారు. వీరు అర్హులని తెలిసి కూడా పింఛన్లు నిరాకరిస్తున్నపరిస్ధితి. దీనికి కారణం స్ధానికంగా ఉన్న కొందరు వైసీపీ నేతల జోక్యమే. దీంతో అర్హులైన వారు, ఎన్నో ఏళ్లుగా పింఛన్లు తీసుకుంటున్న వారికీ తాజాగా నిరాదరణ ఎదురవుతోంది.

అధికారులకు ఫిర్యాదు చేసినా..

నాగులవరంలో పింఛన్ల నిరాకరణపై గ్రామస్ధుల నుంచి వాలంటీర్లకు ఛీత్కారాలు ఎదురవుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా పింఛన్లు అందుకుంటున్న తమ పేర్లను ఇప్పుడెలా తొలగిస్తారంటూ వారు వాలంటీర్లను నిలదీస్తున్నారు. దీంతో అర్హులకు సమాధానం చెప్పలేక, అలాగని అనర్హులకు పింఛన్లు ఇవ్వలేక వాలంటీర్ల పరిస్ధితి దారుణంగా మారింది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా దీనిపై ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.

పింఛన్లు ఇవ్వలేక రాజీనామా...

పింఛన్లు ఇవ్వలేక రాజీనామా...

నాగులవరంలో అర్హులైన వారికి పింఛన్లు ఇచ్చేందుకు వాలంటీర్లు చేసిన ప్రయత్నాలు విఫలం కావడం, స్ధానికంగా నివాసం ఉండని గ్రామ పంచాయతీ కార్యదర్శి భర్త వైసీపీ నేత కావడంతో వారికి ఎదురుచెప్పలేక నలిగిపోతున్న వాలంటీర్లు రాజీనామాలే శరణ్యమని భావించారు. వారు తమ పదవులను రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాజీనామా పత్రాలను అధికారులకు పంపారు.

Recommended Video

Sonia Gandhi:'Modi Has No Planning For Present Situation'
జిల్లాలో కలకలం.. మంత్రి సమీక్ష...

జిల్లాలో కలకలం.. మంత్రి సమీక్ష...

ప్రకాశం జిల్లా నాగులవరంలో పింఛన్లు ఇవ్వలేక, అలాగని అధికారులపై ఒత్తిడి తీసుకురాలేక వాలంటీర్లు తమ ఉద్యోగాలు వదులుకున్న ఘటన కలకలం రేపింది. దీనిపై విమర్శలు రావడంతో మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అధికారులతో పరిస్ధితిని సమీక్షించారు. వాలంటీర్ల రాజీనామాకు దారి తీసిన కారణాలపై ఆరా తీస్తున్నారు. అర్హులైన వారికి ప్రభుత్వ విధానం ప్రకారం పింఛన్లు ఇవ్వాల్సిందేనని మంత్రి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

English summary
Due to ysrcp leaders involvement in distributing social pensions, 10 village volunteers resigned to their jobs in prakasam district of andhra pradesh. volunteers quit their jobs after elegible beneficiaries questioned them for pensions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X