గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దేవిశ్రీ ప్రసాద్ రికార్డు: పది అంగుళాలు ఎత్తు కింద స్కేటింగ్

By Oneindia Staff Writer
|
Google Oneindia TeluguNews

గుంటూరు: రోలర్, లింబో స్కెటింగ్ లలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సృషించేందుకు తిరుపతి కి చెందిన 10 ఏళ్ల బాలుడు దేవీ శ్రీ ప్రసాద్ తన ఫీట్లను గుంటూరు లో ప్రదర్శించాడు.ఈ ఫీట్ ని భారత బ్యాట్ మేంటీన్ క్రీడాకారిణి పి. వి, సింధు ప్రారంభించారు.

అలాగే రాష్ట్ర క్రీడల శాఖా మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర క్రీడల స్పెషల్ సెక్రెటరీ ఎల్. వి.శుబ్రహ్మణ్యం పలువురు పాల్గొన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వెనుక భాగంలో గల రామకృష్ణా హౌసింగ్ వెంచర్ లో ప్రత్యేకంగా 10 లక్షలతో ఏర్పాటు చేసిన రోడ్డుపై దేవీ శ్రీ ప్రసాద్ తన ప్రదర్శన చేశారు.

10 years old boy began his skating feat at Guntur

60 కార్ల క్రిందుగా ఫార్వార్డ్,60 కార్ల క్రిందుగా బ్యాక్వార్డ్,200 మీటర్ల అండర్ బార్స్ ఫార్వార్డ్, 200 మీటర్ల అండర్ బార్స్ బ్యాక్వార్డ్ ఈవెంట్ లలో గిన్నిస్ రికార్డ్ ఫీట్ ప్రదర్శన చేసాడు. నాలుగు ఈవెంట్ లను రికార్డ్ టైం లో పూర్తి చేసాడు. రికార్డ్ నమోదు కోసం వచ్చిన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు ఈ రికార్డులను నమోదు చేయనున్నారు. కేవలం రోడ్డుకు పది అంగుళాల ఎత్తు క్రింద దేవీ శ్రీ ప్రసాద్ స్కెటింగ్ చేసాడు.

ఈ రికార్డ్ కోసం దేవీ శ్రీ ప్రసాద్ కు రాష్ట్ర ప్రభుత్వం 16.90 లక్షలు నగదు ఇచ్చింది. మంగళగిరి మండలం కాజ వద్ద గల రామకృష్ణా హౌసింగ్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తమ సహాయ సహకారాలు ఆందించగా, రేనాల్ట్ వారు దేవీ ఫీట్ కి 60 కార్లు సప్లయి చేశారు. ఫీట్ చేస్తున్న దేవీ శ్రీ ప్రసాద్ కి స్థానికం గా ఎంతో మంది పాల్గొని ఉత్సాహాన్ని కనబరిచారు.

English summary
10 years old boy belongs to Tirupathi began his skating feat at Guntur in Andhra Pradesh toachieve Guinness world record.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X