వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాలుగున్నర లక్షలు దాటిన కరోనా కేసులు.. 24 గంటల్లో 10 వేల పైచిలుకు పాజిటివ్..

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతి ఆగడం లేదు. రోజుకు 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 10 వేల 392 పాజిటివ్ కేసులు వచ్చినట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. గత 24 గంటల్లో 8 వేల 454 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు.

మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు కొత్తగా 10,392 కరోనా కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ మొత్తం కేసులు నాలుగున్నర లక్షలు దాటింది. 4 లక్షల 55 వేల 531కి కేసుల చేరాయి. ఇందులో 1 లక్ష 3 వేల 076 యాక్టివ్ కేసులు ఉండగా.. 3 లక్షల 48 వేల 330 మంది కొలుకున్నారు. ఏపీలోఏపీలో ఇప్పటివరకు 38.43 లక్షల కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

 10392 corona cases register in andhra pradesh..

గత 24 గంటల్లో కరోనా వైరస్ వల్ల 72 మంది చనిపోయారు. దీంతో మరణాల మొత్తం సంఖ్య 4,125కి చేరింది. మరణాలు జిల్లాలవారీగా చూస్తే.. నెల్లూరులో 11, చిత్తూరు 10, పశ్చిమగోదావరి జిల్లా 9, ప్రకాశం జిల్లాలో 8 మంది మృతి చెందారు. కృష్ణా 6, విశాఖ 6, అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు చొప్పున.. విజయనగరం 3, కడప 2, కర్నూలులో ఒకరు చనిపోయారు.

English summary
10392 corona cases register in andhra pradesh. total cases are 4 lakh 55 thousand 531.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X