ఏపీలో కొత్తగా 106 కరోనా కేసులు: ఏ జిల్లాలో ఎన్నంటే..? పెరుగున్న యాక్టివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 35,804 నమూనాలను పరీక్షించగా.. 106 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,90,080కి చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం సాయంత్రం వెల్లడించింది.
గత 24 గంటల్లో కరోనాతో ఎవరూ కూడా మరణించలేదు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కారణంగా 7169 మంది బాధితులు మృతి చెందారు. ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 57 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,82,137కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 778 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,40,10,204 కరోనా నమూనాలను పరీక్షించారు.

ఏపీలో జిల్లాల వారీగా కరోనా కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 10, చిత్తూరులో 33, తూర్పుగోదావరిలో 11, గుంటూరులో 7, కడపలో 5, కృష్ణాలో 9, కర్నూలులో 3, నెల్లూరులో 3, ప్రకాశంలో 0, శ్రీకాకుళంలో 9, విశాఖపట్నంలో 8,
విజయనగరంలో 0, పశ్చిమగోదావరిలో 8 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 12,286 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,11 కోట్ల మందికి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 91 మంది మరణించగా.. ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 1,57,248కు చేరింది. కాగా, నిన్న ఒక్కరోజే 12,464 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 1,07,98,921కు చేరింది. ప్రస్తుతం దేశంలో 1,68,358 యాక్టివ్ కేసులున్నాయి.