అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముఖ్య‌మంత్రి సీరియ‌స్‌:108 ఉద్యోగుల మెరుపు స‌మ్మె : సేవ‌లు నిలిపివేస్తారా అంటూ ..!

|
Google Oneindia TeluguNews

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌మ‌ర్ధ‌త‌కు ప‌రీక్ష మొద‌లైంది. వ‌రుస హామీల‌తో లాభ ప‌డిన వారు సంతోష ప‌డుతుంటే..మిగిలిన వారు ఆందోళ‌న‌ల ద్వారా జ‌గ‌న్ దృష్టిని ఆకర్షించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క మార్పుల‌తో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా అమ‌లు చేయాల‌ని భావిస్తున్న 108 ఉద్యోగులు మెరుపు స‌మ్మెకు దిగారు. త‌మ‌కు రావాల్సి న బ‌కాయిలు త‌క్షణం చెల్లించాల‌ని డిమాండ్ చేస్తూ స‌మ్మెకు దిగారు. దీంతో..గ‌త ప్ర‌భుత్వంలోని బయాయిల‌ను ఈ ప్ర‌భుత్వం చెల్లించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇప్పుడు..జ‌గ‌న్ వారి మెరుపు స‌మ్మె పైన ముఖ్య‌మంత్రి సీరియ‌స్ అయి న‌ట్లు స‌మాచారం. స‌మస్య‌లుంటే ప్రభుత్వం తో చ‌ర్చించాలి..ఇలా స‌మ్మెకు దిగ‌టం ఏంటి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు..

108 ఉద్యోగుల మెరుపు స‌మ్మె..
ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 108 ఉద్యోగులు మెరుపు స‌మ్మెకు దిగారు. త‌మ డిమాండ్ల సాధ‌న కోసం స‌మ్మె చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ప్ర‌ధానంగా త‌మ‌కు రావాల్సిన వేతన బ‌కాయిల‌ను చెల్లించాల‌ని కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్త‌గా ప‌ని చే స్తున్న 108 ఉద్యోగుల‌కు ఒక్కొక్క‌రికి దాదాపు 70 వేల నుండి 80 వేల వ‌ర‌కు రావాల్సి ఉంద‌ని చెబుతున్నారు. అన్ని 108 వాహ‌నాల్లో ఎమెర్జెన్సీ మెడిక‌ల్ టెక్నీషియ‌న్లు..పైలెట్లు ప‌ని చేస్త‌న్నారు. వీరంద‌రికీ 108 స‌ర్వీసు ప్రొవైడ‌ర్‌గా ఉన్న జీవీకే సంస్థ నుండి జీతాలు రావాల్సి ఉంది. దీని గురించి జీవీకే ప‌ట్టించుకోవ‌టం లేద‌ని ఉద్యోగులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. గ‌త ప్ర‌భుత్వ హాయంలో దీని పైన ఎన్నిసార్లు నివేదించినా ఎవ‌రూ ప‌ట్టించుకోలేద‌ని చెబుతున్నారు. ఇక‌, ఇప్పుడు కొత్త ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌రువాత కూడా త‌మ సమ‌స్య ప‌రిష్కారం కావ‌టం లేదంటూ మెరుపు స‌మ్మెకు దిగాల్సి వ‌చ్చింద‌ని ఉద్యోగులు వివ‌ర‌ణ ఇస్తున్నారు. తాము ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పాద‌యాత్ర స‌మ‌యంలో త‌మ స‌మ స్య‌ల‌ను నివేదిస్తే..ఖ‌చ్చితంగా ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చార‌ని..అమ‌లు చేయాల‌ని కోరుతున్నారు.

సీఎం జ‌గ‌న్ వ‌ర్సెస్ కేంద్రం: వ‌్య‌వ‌హారం ముదురుతోంది: కేంద్ర సంస్థ‌ల స‌హాయ నిరాక‌ర‌ణ‌..!సీఎం జ‌గ‌న్ వ‌ర్సెస్ కేంద్రం: వ‌్య‌వ‌హారం ముదురుతోంది: కేంద్ర సంస్థ‌ల స‌హాయ నిరాక‌ర‌ణ‌..!

108 employees started sudden strike in AP for demanding pending salaries.

ముఖ్య‌మంత్రి సీరియ‌స్..
108 ఉద్యోగులు ముంద‌స్తు స‌మాచారం..సంప్ర‌దింపులు లేకుండా మెరుపు స‌మ్మెకు దిగ‌టం పైన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్న స‌మ‌యంలో ఉద్యోగులు మెరుపు స‌మ్మెకు దిగ‌టం ప్ర‌భుత్వానికి ఇబ్బందిగా మారే అవ‌కాశం ఉంది. ఇక‌, త‌మ ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావిస్తున్న 108 సేవ‌లు అందించే ఉద్యోగులు మెరుపు స‌మ్మెకు దిగ‌టం ద్వారా ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డ‌తార‌ని..అక్క‌డ దాకా ఎందుకు విష‌యం వ‌చ్చిందంటూ అధికారుల మీద ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. జీవీకే సంస్థ బ‌కాయిలు చెల్లించక‌పోతే మీరు ఏం చేస్తున్నారంటూ అధికారుల‌ను నిల‌దీసారు. త‌క్ష‌ణం వారు విధుల్లో చేరేలా చూడాల‌ని.. బ‌కాయిల విష‌యం పైనా జీవీకే తో చ‌ర్చించి ప‌రిష్కార‌మ‌య్యేలా చూడాల‌ని అదేశించారు. 108 సేవ‌ల‌ను విస్తృతం చేస్తామ‌ని బ‌డ్జెట్‌లో చెప్పిన వారం రోజుల్లోగానే సేవ‌లు నిలిచిపోవ‌టం పైన ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా ఉంది.

English summary
108 employees started sudden strike in AP for demanding pending salaries. 108 service provider to be give pending salaries to each employ bout 70,000 rupees. CM jagn directed officials to solve the problem and restore the services.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X