వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనాతో వణుకిపోతున్న ఏపీ సచివాలయం, అసెంబ్లీ- మరో 12 మందికి పాటిజివ్..

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ సచివాలయం, అసెంబ్లీ వరుస కరోనా కేసులతో వణికిపోతున్నాయి. ఇప్పటికే ఇరు ప్రాంగణాల్లో కలిపి దాదాపు 20కి పైగా కేసులు నమోదు కాగా... తాజాగా నిర్వహించిన పరీక్షల్లో మరో 12 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వైద్య ఆరోగ్యశాఖ తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఈ ఫలితాలు వెలువడ్డాయి. కరోనా లాక్ డౌన్ సడలింపుల్లో భాగాంగా హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగుల కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్లు అధికారులు భావిస్తున్నారు.

వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్: కలకలం: అసెంబ్లీ సమావేశాలకు హాజరు.. రాజ్యసభ ఎన్నికల్లో ఓటువైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్: కలకలం: అసెంబ్లీ సమావేశాలకు హాజరు.. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు

తాజాగా కరోనా వైరస్ నిర్ధారణ అయిన ఉద్యోగుల్లో పది మంది సచివాలయంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న వారు కాగా... మరో ఇద్దరు అసెంబ్లీలో పనిచేస్తున్న ఉద్యోగులు. వీరికి వైద్య ఆరోగ్యశాఖ విడతల వారీగా కరోనా పరీక్షలు నిర్వహించింది. వీటి ఫలితాలు ఇవాళ వెలువడ్డాయి. ఇప్పటికే కరోనా భయాలతో సచివాలయం, అసెంబ్లీ ప్రాంగణాలను పూర్తిగా శానిటైజ్ చేయడంతో పాటు పలు చర్యలు తీసుకుంటున్నా కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు.

12 more employees tested covid 19 positive in ap secretariat and assembly premises

Recommended Video

Nellore Tourism Office Incident : దివ్యాంగురాలైన మహిళపై ఇనుప రాడ్డుతో దాడి, బాలీవుడ్ తారల ఆగ్రహం..!!

దీంతో ఉద్యోగులు సచివాలయం, అసెంబ్లీకి రావాలంటేనే బెంబేలెత్తిపోవాల్సిన పరిస్ధితి నెలకొంటోంది. ఇవాళ 12 కేసులు నిర్ధారణ కావడంతో ఉదయం సచివాలయానికి వచ్చిన ఉద్యోగులను ఇళ్లకు పంపించేశారు. బాధితులను గుంటూరు జీజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరితో సన్నిహితంగా మెలిగిన మరికొందరిని క్వారంటైన్ కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

English summary
12 more employees of andhra pradesh secretariat and legislative assembly on thursday tested covid 19 positive. in this 10 employees from secretariat and other two from assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X