వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హత్యకేసులో కొల్లు రవీంద్రకు 14 రోజుల రిమాండ్ .. రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలింపు

|
Google Oneindia TeluguNews

మంత్రి పేర్ని నానీ ప్రధాన అనుచరుడు ,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,మచిలీపట్నం మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు, మోకా భాస్కరరావు హత్యకేసులో అరెస్టయిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా కొల్లు రవీంద్ర న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.

మచిలీపట్నానికి చెందిన వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్యకేసులో అనేక కీలక పరిణామాల తరువాత ఈ హత్య కేసులో టిడిపి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రమేయం ఉందని పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కొల్లు రవీంద్ర కారులో ప్రయాణం చేస్తున్న క్రమంలో ఆయనను తుని వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనను పెడన నియోజకవర్గం గూడూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు.

14 days remand to former TDP minister Kollu Ravindra in ycp leader murder case

Recommended Video

Moka Bhaskar Rao హత్య కేసులో మాజీ మంత్రి Kollu Ravindra ను అరెస్ట్ ! || Oneindia Telugu

అక్కడ వైద్య పరీక్షల అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొల్లు రవీంద్రను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా మెజిస్ట్రేట్ కొల్లు రవీంద్ర కు 14 రోజుల రిమాండ్ విధించారు.
ఇప్పటికే ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. కొల్లు రవీంద్ర ప్రమేయంతోనే మోకా భాస్కరరావును హతమార్చినట్లు గా నిందితుడు చెప్పిన వాంగ్మూలం మేరకు ఆయనను అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. టిడిపి నేత కొల్లు రవీంద్రకు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయనను రాజమండ్రి జైలుకు తరలించారు పోలీసులు. అయితే టీడీపీ నేతలు మాత్రం ఇది కావాలని వైసిపి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు అని విమర్శలు గుప్పిస్తున్నారు.

English summary
The local court has sent former TDP minister Kollu Ravindra to 14 days judicial custody in the murder case of the YSRCP leader Moka Bhaskar Rao on Saturday. The police will shift Ravindra to Rajahmundry Central Prison. Ravindra was taken into custody by police in East Godavari district and shifted him to the Guduru police station in Krishna district. The accused, who were arrested, had confessed to the police that they had committed the crime on the instructions of the TDP leader. The murder of Moka had created sensation in Machilipatnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X