విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

55 రోజులపాటు గన్నవరం విమానాశ్రయం వద్ద 144 సెక్షన్

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ప్రముఖుల రాకపోకలతో పాటు భద్రతా కారణాల రీత్యా గన్నవరం విమానాశ్రయం వద్ద 144 సెక్షన్ విధిస్తూ విజయవాడ నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం నుంచి నుంచి 55 రోజుల పాటు గన్నవరం విమానాశ్రయం, పరిసర ప్రాంతాల్లో భద్రతా ఆజ్ఞలు కొనసాగుతాయని ఉత్తర్వుల్లో వెల్లడించారు.

ఐదుగురు వ్యక్తులు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటంతో పాటు ఆందోళనలు, నిరసనలు, బైటాయింపు కార్యక్రమాలు గన్నవరం విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో నిషేధమని స్పష్టం చేశారు. జూలై 4 తేదీ వరకూ ఈ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని వెల్లడించారు.

 144 section in the limits of Gannavaram Airport Area

గన్నవరం విమానాశ్రయంతో పాటు పరిసర ప్రాంతాల్లోని 250 మీటర్ల పరిధిలో 144 (20) సెక్షన్ అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కోన్నారు. శాంతిభద్రతలతో పాటు అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఈ ఆదేశాలు జారీ చేసినట్టు పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. తిరుపతిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్‌పై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

English summary
Vijayawada City Police Commissioner Gautam Savang has issued orders for implementing Section 144 at Gannavaram airport. These orders have been placed keeping in view the security concerns at the airport as well as rush of VIPs traveling to and from the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X