గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుంటూరు జిల్లాలో అనకొండ! కోడిని మింగి గడ్డివాములోకి...

By Srinivas
|
Google Oneindia TeluguNews

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో కొండ చిలువ కనిపించింది. వినుకొండలోని పాతపట్టణ ప్రాంతంలో ఆంజనేయ స్వామి గుడి ప్రాంతంలో పదిహేను అడుగుల పొడవు ఉన్న కొండ చిలువ గురువారం నాడు ప్రత్యక్షమైంది.

కోడిని మింగి గడ్డివాములోకి వెళ్లిపోయింది. దీనిని చూసి ప్రజలు ఆందోళన చెందారు. ఈ విషయాన్ని అధికారులకు చెప్పారు. అటవీ శాఖ అధికారులు వచ్చి దానిని బంధించి, అడవిలో వదిలి పెట్టేందుకు తీసుకు వెళ్లారు.

15 feet snake in Guntur district

చెట్టుకు కారు ఢీకొని ముగ్గురు పుష్కర యాత్రికులు మృతి

గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం దగ్గర చెట్టుకు ఓ కారు ఢీకొన్న సంఘటనలో ముగ్గురు పుష్కర యాత్రికులు మృతిచెందారు. ఈ ప్రమాదంలో విజయవాడ లబ్బీపేటకు చెందిన వారు మృతి చెందారు. ఇందులో వృద్ధుడు ఉన్నారు. మరో ఇద్దరు గాయపడ్డారు.

కడపలో పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన

కడప జిల్లాలో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. ఇది ఉద్రిక్తంగా మారింది. వారు కలెక్టరేట్‌ను ముట్టడించేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పలువురు గాయపడ్డారు.

English summary
Fifteen feet big snake found in Guntur district on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X