తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పట్టుబట్టి ఒప్పించిన అమ్మాయి, బాధ్యత తీసుకున్న చంద్రబాబు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

తిరుపతి: మహానాడు రెండో రోజైన శనివారం నాడు ఆసక్తిర సంఘటన చోటు చేసుకుంది. మహానాడు వేదిక పైన మాట్లాడేందుకు ఎంతోమంది ఉత్సుకత చూపిస్తుంటారు. కానీ అందరికీ అవకాశం రాలేదు. అయితే, పట్టుబట్టి ఓ పదిహేనేళ్ల అమ్మాయి హేమమాలిని వేదిక పై మాట్లాడింది. కవితతో అలరించింది.

ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాల పైన తాను రాసిన కవితతో అందరినీ ఆకట్టుకుంది. తన ప్రసంగంతో ముఖ్యమంత్రి చంద్రబాబు మనసు గెలుచుకుంది. హేమమాలిని అనకాపల్లికి చెందిన అమ్మాయి. పదో తరగతి చదువుతోంది.

మహానాడు వేదిక వద్దకు చేరుకొని కార్యకర్తల ప్రసంగం సమయంలో మైకు అందుకుంది. తనను వేదిక పైకి అనుమతించాలని చంద్రబాబును వేడుకుది. అవకాశం ఇవ్వడంతో సంక్షేమ పథకాలపై కవిత వినిపించింది. అదే సమయంలో తన గురించి చెబుతూ.. పేదవారైన తన తల్లిదండ్రులు చదువు మానేయమంటున్నారని, తనకు ఐఏఎస్ కావాలని ఉందని చెప్పింది. ఆమెకు చదువు చెప్పించే బాధ్యత చంద్రబాబు తీసుకున్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రతి తెలుగుదేశం పార్టీ సమావేశంలో మాట్లాడేందుకు అకాశమిస్తానని, ఎమ్మెల్యేలు, నేతల కన్నా చక్కగా మాట్లాడావని కితాబిచ్చారు. తనకు కలెక్టర్ కావాలని ఉందని ఆ అమ్మాయి చెప్పగా.. కలెక్టర్ కన్నా రాజకీయాల్లో బాగా రాణిస్తావని చంద్రబాబు అన్నారు.

మహానాడులో అమ్మాయి

మహానాడులో అమ్మాయి

మహానాడు రెండో రోజైన శనివారం నాడు ఆసక్తిర సంఘటన చోటు చేసుకుంది. మహానాడు వేదిక పైన మాట్లాడేందుకు ఎంతోమంది ఉత్సుకత చూపిస్తుంటారు. కానీ అందరికీ అవకాశం రాలేదు. అయితే, పట్టుబట్టి ఓ పదిహేనేళ్ల అమ్మాయి హేమమాలిని వేదిక పై మాట్లాడింది. కవితతో అలరించింది.

మహానాడులో అమ్మాయి

మహానాడులో అమ్మాయి

ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాల పైన తాను రాసిన కవితతో అందరినీ ఆకట్టుకుంది. తన ప్రసంగంతో ముఖ్యమంత్రి చంద్రబాబు మనసు గెలుచుకుంది. హేమమాలిని అనకాపల్లికి చెందిన అమ్మాయి. పదో తరగతి చదువుతోంది.

మహానాడు

మహానాడు

ప్రాంగణమంతా రెండోరోజు పెద్దఎత్తున కిటకిటలాడింది. ఎండ మండుతున్నా ఎవరూ లెక్కచేయలేదు. కొందరు ఎండలోనే నిల్చుని తిలకించారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మహానాడు

మహానాడు

మహానాడు నిర్వహణపై సర్వే నిర్వహించిన అధినేత చంద్రబాబు తనదైన శైలిలో శ్రేణులకు చురకలు వేయడమేకాక.. భవిష్యత్తు పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే సందేశాన్నిచ్చారు. ఇలాచేయడం అసలు టిడిపి ప్రమాణాలకే సరిపోదని వ్యాఖ్యానించడం ఏర్పాట్ల తీరును తేటతెల్లం చేసింది.

మహానాడు

మహానాడు

మరోవైపున వలంటీర్ల సేవలను ఆయన ప్రస్తుతించారు. మునుందు ఇంకా బాగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

మహానాడు

మహానాడు

దాదాపు మూడుగంటలకు పైగా ఆలస్యంగా నడిచిన వేదిక.. తుదకు రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ముగిసింది.

మహానాడు

మహానాడు

ప్రాంగణమంతా రెండోరోజు పెద్దఎత్తున కిటకిటలాడింది. ఎండ మండుతున్నా ఎవరూ లెక్కచేయలేదు. కొందరు ఎండలోనే నిల్చుని తిలకించారు.

English summary
15 year old girl interesting speech in Mahanadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X