ఏపీలో కొత్తగా 173 కరోనా కేసులు: జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కు తగ్గిపోతున్న కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క రోజు వ్యవధిలో 46,852 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 173 కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,86,418కి చేరింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
కాగా, గత 24 గంటల వ్యవధిలో ఒక్క మరణం కూడా సంభవించలేదు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 7142 మంది కరోనా బారినపడి మరణించారు. ఒక్క రోజు వ్యవధిలో 196 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8,77,639కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1637 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,26,90,165 పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.

ఏపీ జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కరోనా కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 8, చిత్తూరులో 46, తూర్పుగోదావరిలో 12, గుంటూరులో 19, కడపలో 11, కృష్ణాలో 19, కర్నూలులో 7, నెల్లూరులో 4, ప్రకాశంలో 7, శ్రీకాకుళంలో 3, విశాఖపట్నంలో 27, విజయనగరంలో 7, పశ్చిమగోదావరిలో 3 కరోనా కేసులు నమోదయ్యాయి.
మరోవైపు దేశ వ్యాప్తంగానూ కరోనా కేసులు లభ్యమవుతున్నాయి. గత 24 గంటల్లో 10,064 కేసులు బయటపడగా మొత్తం కేసుల సంఖ్య 1,05,81,837కి చేరింది.
మంగళవారం గత 24 గంటల్లో 137 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 1,52,556కి చేరింది. ఇప్పటి వరకు 1,02,28,753 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 2,00,528 యాక్టివ్ కేసులున్నాయి.