వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

1977లో బాబు ఇలా.. అంబులెన్స్ సైరన్ విని పరుగెత్తి మంచం కింద దాక్కున్నాడు, టీడీపీ అనిత కామెంట్స్ ..

|
Google Oneindia TeluguNews

ఏపీలో అధికార వైసీపీ లక్ష్యంగా సోషల్ మీడియాలో విమర్శించడంలో టీడీపీ మహిళా నేత అనిత ముందుంటారు. మరోసారి 1977లో బాబు అని హాట్ కామెంట్స్ చేశారు. దీనికి నెటిజన్లు కూడా అదేవిధంగా కౌంటర్ ఇస్తున్నారు. సీఎం జగన్ లక్ష్యంగా అనిత విమర్శలు చేయడంతో.. జగనన్న అభిమానుల వేదిక ఘాటుగా స్పందించింది. మిగతా జగన్, వైసీపీ అభిమానులు కూడా అదేలా రియాక్టయ్యారు.

1977లో ఒక రోజు అని ట్వీట్..

1977లో ఒకరోజు అని అనిత ట్వీట్ స్టార్ట్ చేశారు. ఐదేళ్ల వయస్సున్న బాబు బయట ఆడుకుంటు ఉన్నాడని.. ఇంతలో రోడ్ మీద అంబులెన్స్ సౌండ్ విన్నాడని పేర్కొన్నారు. తన వద్ద ఉన్న బొమ్మలు పక్కన పడేసి మంచం కింద దాక్కున్నాడని.. ఏమయ్యిందని తల్లి అడిగితే అది పోలీసు సైరెన్ అనుకున్నా అని సమాధానం ఇచ్చాడట. ఆ వయస్సు నుంచే బాబుది అమాయకత్వం ఉంది అని... ఇప్పటికీ మారలేదు అని తెలిపారు. అనిత ట్వీట్‌కు నెటిజన్లు కూడా అదే స్థాయిలో రీ ట్వీట్ చేశారు.

రాజకీయ సమాధి కడుతున్నారు..

అనిత ట్వీట్టర్ ఎవరూ హ్యాండిల్ చేస్తున్నారో గానీ జగనన్న అభిమానుల వేదిక స్పందించింది. దీంతో ఆమెకు పరోక్షంగా రాజకీయ సమాధి చేస్తున్నారని.. ఈ విషయం ఆమెకు అర్థమవుతుందో లేదోనని కామెంట్ చేశారు. మరో నెటిజన్.. 10 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల పాప అదే అంబులెన్స్‌కి ఎదురువెళ్లి మైండ్ దొబ్బెట్టుకుంది అని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఇక అప్పటినుంచి ఏ లెక్క చెప్పినా ఒక 32 కలిపి చెబుతోంది. అందుకే పంతులు ఉద్యోగం పోవడంతో.. టీడీపీలో చేరారని మండిపడ్డారు. అంతేకాదు అంబులెన్స్ ఘటన జరిగింది.. 1955లో అని గుర్తుచేశారు.

మంచి అయితే అలా.. చెడు అయితే ఇలానా..

మరోవైపు ఇండియా టుడేలో సీఎం ర్యాంకింగ్‌, కోవిడ్ మేనేజ్ మెంట్‌ గురించి కూడా అనిత ట్వీట్ చేశారు. ఇండియా టుడే సర్వేలో మూడో స్థానం వస్తే కష్టం, సామర్థ్యం వల్ల వచ్చిందని జబ్బలు చరుచుకున్నారని అనిత ఫైరయ్యారు. అయితే కోవిడ్ మేనెజ్ మెంట్‌లో మాత్రం సరిగా లేదని రాస్తే.. పచ్చ మీడియా అని అనొచ్చా అని కామెంట్ చేశారు. సందర్భానికి అనుకూలంగా మాట్లాడతారా అని విరుచుకుపడ్డారు.

Recommended Video

YS Jagan Inaugurates New Ambulance Services In AP | 104,108 సేవ‌లలో కొత్త శ‌కం || Oneindia Telugu
అటెండర్ నయం.. గౌరవప్రద వృత్తి కదా అంటూ

అటెండర్ నయం.. గౌరవప్రద వృత్తి కదా అంటూ

మరో నెటిజన్ అనిత లక్ష్యంగా కామెంట్స్ చేశారు. అనిత ట్వీట్టర్ మెయింటైన్ చేసే వారిని అనాలి అని. నీ కంటే మున్సిపాలిటీలో పనిచేసే అటెండర్ నయం అని కామెంట్ చేశారు. ఏదో ఒకటి చూసి చచ్చిపో అని కామెంట్ చేయడంతో.. అటెండర్ పనికి ఏమయ్యింది అని అనిత కౌంటర్ ఇచ్చారు. అదీ గౌరవమైన పనే కదా అని పేర్కొన్నారు. మీ కన్నా నీచమైనది ఏమన్నా ఉందా అని రిప్లై ఇచ్చారు. జనం సొమ్ము తిని జైలుకి వెళ్లడం, గురువింద కబుర్లు చెప్పడమేనా అని ఫైరయ్యారు.

English summary
1977 year one 5 year old boy afraid of ambulance sound..because he recognise that sound is police vehicle tdp anitha comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X