వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా బాధితులకు 2 వేలు ఆర్ధిక సాయం .. సీఎం జగన్ నిర్ణయం

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కరోనా బాధితుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని కరోనా అనుమానితులందరినీ గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇక . క్వారంటైన్‌ సెంటర్లలో మెడికల్‌ ప్రోటోకాల్‌ పూర్తిచేసుకుని తిరిగి ఇళ్లకు పంపించేటప్పుడు వారికి ఆర్ధిక సాయం చెయ్యాలని చెప్పారు.పేదవారైన బాధితులను గుర్తించి వారికి రూ.2 వేలు ఆర్థిక సహాయం చేయాలని అధికారులను ఆదేశించారు జగన్ .

ఏపీలో కరోనా: సీఎం జగన్ కీలక అడుగు.. దేశంలోనే తొలిసారి.. చదవాల్సిందే.. ఏపీలో కరోనా: సీఎం జగన్ కీలక అడుగు.. దేశంలోనే తొలిసారి.. చదవాల్సిందే..

ఈ రోజు రాష్ట్రంలో కరోనా పై జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం జగన్ మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ర్యాండమ్‌ పరీక్షలు చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, బాధితులకు అందుతున్న చికిత్స సహా ఇతర అంశాలపై సీఎం జగన్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు . ఈ సందర్భంగా అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. ప్రతి బాధితుడికి రోజూ భోజనం, వసతి లాంటి అవసరాల కోసం రూ. 500కు తక్కువ కాకుండా కేటాయించాలని అధికారులకు సూచించారు. అలాగే వారు ఇంటికి వెళ్లిన తర్వాత కూడా పాటించాల్సిన జాగ్రత్తలను తెలియజేయాలని తెలిపారు. ఇక క్వారంటైన్ సెంటర్లలో సదుపాయాలపై సీఎం జగన్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

2 thousand financial aid to Corona victims .. CM Jagans decision

రాష్ట్రంలో కారోనా బాధితులకు అందిస్తున్న వైద్య సదుపాయల గురించి అధికారులు సీఎం జగన్‌కు తెలియజేశారు . ప్రస్తుతం రోజుకు 2100 కు పైగా పరీక్షలు చేస్తున్నామని పేర్కొన్నారు. మరో నాలుగైదు రోజుల్లో కరోనా వైరస్‌ పరీక్షల రోజువారీ సామర్థ్యం 2వేల నుంచి 4వేలకు పెంచుతామని అధికారులు తెలిపారు. ఇక అలాగే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి , పాజిటివ్‌గా నమోదైన కేసుల వివరాలను చెప్పిన అధికారులు ఇక ప్రతిరోజూ ప్రతిమనిషికి రూ. 50 పారిశుద్ధ్యం కోసం, ఇతరత్రా ఖర్చులకోసం రోజుకు రూ.50, ప్రయాణ ఖర్చుల కింద క్వారంటైన్‌ సెంటర్‌కు రూ.300, తిరుగు ప్రయాణంకోసం కూడా మరో రూ.300 ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు.

English summary
AP CM Jagan Mohan Reddy has made a key decision regarding the corona victims. CM Jagan has ordered the authorities to conduct a medical examination to identify all the corona suspects in the state. The Quarantine Centers have been asked to provide financial assistance to those who have completed the medical protocol and are sent back to their homes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X