వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపిని అందుకే వ్యతిరేకించా, విభజన ఉద్యమాలు, 200 ఎకరాలు చాలు: పవన్

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ రాజధాని ప్రతి ఒక్కరిదనే భావనను కల్పించాలని లేకపోతే తెలంగాణ తరహ ఆందోళనలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. మూడు పంటలు పండించే రైతుల నుండి బలవంతంగా భూములను సేకరిస్తే తాను రోడ్లపైకి వస్తానని గతంలో తాను ప్రభుత్వాన్ని హెచ్చరించిన తర్వాత అమరావతి రాజధానికి భూ సమీకరణ చట్టాన్ని అమలు చేయలేదన్నారు.

వైసీపీకి చెక్ ఎలా?: మంత్రులతో బాబు, టిడిపి ప్లాన్ ఇదే, విపక్షాలపై ఇలా..వైసీపీకి చెక్ ఎలా?: మంత్రులతో బాబు, టిడిపి ప్లాన్ ఇదే, విపక్షాలపై ఇలా..

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు రాసిన ఎవరి రాజధాని అమరావతి పుస్తకాన్ని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గురువారం నాడు విజయవాడలో ఆవిష్యరించారు.

అయితే ఈ పుస్తకావిష్కరణకు పోటీగా రాజధాని రైతుల పేరుతో రాజధానిపై కుట్ర పేరుతో మరో పుస్తకాన్ని గురువారం నాడు టిడిపి నేత వర్ల రామయ్య ఆవిష్కరించారు.ఐవైఆర్ కృష్ణారావు రాసిన పుస్తకావిష్కరణ సభలో పలు పార్టీలకు చెందిన నేతలు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.

నేను అప్పుడే బాబును వ్యతిరేకించా

నేను అప్పుడే బాబును వ్యతిరేకించా

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో నిర్భంధంగా భూములను సమీకరించడాన్ని తాను వ్యతిరేకించానని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మూడు పంటలు పండించే రైతుల నుండి బలవంతంగా తీసుకొంటే తాను రోడ్ల మీదకు రావాల్సి వస్తోందని గతంలోనే తాను టిడిపి ప్రభుత్వాన్ని హెచ్చరించానని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. తన హెచ్చరిక కారణంగానే రాజధాని నిర్మాణానికి భూముల సమీకరణను ప్రభుత్వం విరమించుకొందని పవన్ కళ్యాణ్ చెప్పారు. రాజధాని భూముల విషయంలో తాను ప్రభుత్వంతో ఏనాడు కూడ వ్యతిరేకించలేదన్నారు. కానీ, భూ సమీకరణ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించానని ఆయన చెప్పారు.

బాధ్యతగా వ్యవహరించకపోతే అసమానతలు

బాధ్యతగా వ్యవహరించకపోతే అసమానతలు

అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించకపోతే అసమానతలు తలెత్తే అవకాశం ఉందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు.. అసమానతలు వస్తే రాష్ట్ర విభజన ఉద్యమాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలను పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.ఇప్పుడు కడుతున్న రాజధానిలో కూడా అందర్నీ కలుపుకుని పోవాలి.. లేకుంటే రాయలసీమ ఉద్యమం లాంటి వాటికి దారితీసే పరిస్థితులొస్తాయి. అమరావతి అంటే అందరిదీ అనే భావన ప్రజల్లో ప్రభుత్వం కలిగించలేనప్పుడు విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర వాసులకు.. రాజధానిలో ప్రాతినిధ్యం కల్పించకపోతే ఉద్యమాలు వస్తాయని చెప్పారు.

200 ఎకరాలు సరిపోతాయి

200 ఎకరాలు సరిపోతాయి


తెలంగాణలోని హైద్రాబాద్‌లో అడ్మినిస్ట్రేటివ్ భవనాల నిర్మాణం కోసం సుమారు 200 ఎకరాలు సరిపోయిందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు.అమరావతిలో కూడా హైదరాబాద్‌లో చేసిన తప్పే చేస్తున్నారు. రాజధాని అంటే పరిపాలనా భవనాలు కడితే చాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.సైబరాబాద్ నిర్మాణంలో చోటు చేసుకొన్న పరిణామాలను ఆయన ప్రస్తావించారు.పాలకులు చేసిన తప్పులు ప్రజలకు శిక్షలుగా మారాయన్నారు.

అమరావతి గ్రాపిక్ డిజైన్లే

అమరావతి గ్రాపిక్ డిజైన్లే

రాజధాని నిర్మాణం కోసం తయారు చేసిన డిజైన్లన్నీ గ్రాపిక్స్ మాత్రమేనని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు.రాజధాని ఎక్కడ కట్టాలనే దానిపై ముందు శివరామకృష్ణన్‌ కమిటీ వేశారు. ఆ కమిటీ ఇచ్చిన నిదేదిక నచ్చని చంద్రబాబు టీడీపీ నాయకులతో ప్రత్యేకంగా ఓ కమిటీ వేశారు. రైతుల నుంచి భూముల లాక్కుంటూ.. రైతుల త్యాగాలని సీఎం ప్రచారం చేసుకుంటున్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు. ఐవైఆర్‌ నిజాలు మాట్లాడుతున్నందునే చంద్రబాబుకు కోపం వస్తోందన్నారు.అమరావతిని దెయ్యాల నగరంగా మార్చొద్దని ఆయన సూచించారు.

English summary
pawan kalyan said that 300 acres is sufficient to construction the capital . Janasena chief pawan kalyan launches Yevari Rajadhani book on Thursday at Vijawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X