• search
 • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అమరావతి ఉద్యమానికి 200 రోజులు.. ఇటుక కూడా కదల్చలేరని టీడీపీ సవాల్.. వైసీపీకి సరికొత్త అర్థం..

|

''ఒక రాష్ట్రం.. ఒక రాజధాని'' నినాదంతో, రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ ఆ ప్రాంతవాసులు చేపట్టిన నిరసనోద్యమం శనివారం నాటికి 200 రోజులకు చేరనుంది. దానికి ఒకరోజు ముందే ప్రతిపక్ష తెలగుదేశం పార్టీ భారీ ఎత్తున క్యాంపెయిన్ ప్రారంభించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానుల ఏర్పాటు ఆలోచనను మానుకోవాలని, ప్రజారాజధాని నుంచి ఒక్క ఇటుకను కూడా కదల్చలేరని, ఉద్యమాన్ని మరింత మరింత ఉధృతం చేస్తామని టీడీపీ నేతలు హెచ్చరించారు.

  Amaravati ఉద్యమానికి 200 రోజులు, Capital Issue Remains Unresolved || Oneindia Telugu
  విశాఖ కంటే బెటర్..

  విశాఖ కంటే బెటర్..

  అమరావతి రాజధాని ఉద్యమ క్యాంపెయిన్ లో భాగంగా టీడీపీ పలు కీలక అంశాలను ప్రస్తావించింది. 2016 అక్టోబర్ నుంచి పరిపాలన అమరావతి నుంచే కొనసాగుతోందని, 2019 ఫిబ్రవరి నుంచి హైకోర్టు, అదే ఏడాది జులై నుంచి గవర్నర్ కూడా అమరావతి కేంద్రంగానే పనిచేస్తున్నారని, ముఖ్య శాఖల కార్యాలయాలన్నీ విజయవాడ, గుంటూరు, మంగళగిరిలోనే కొనసాగుతున్నాయని పేర్కొంది. ప్రకృతి విపత్తులు, కనెక్టివిటీ, వాటర్, లాండ్, రీజినల్ డెవలప్ మెంట్.. అనే ఐదు సూచికలను బట్టి రాజధానిగా విజయవాడ అర్బన్ డెవలప్ మెంట్ పరిధిలోని ప్రాంతమే బెటరని శివరామకృష్ణ కమిటీ చెప్పిన విశయాన్ని టీడీపీ గుర్తుచేసింది.

  చైనాపై ప్రధాని మోదీ పంచముఖ వ్యూహం.. లదాక్ ఎందుకు వెళ్లారంటే.. ఇక డ్రాగన్ పని అయినట్లే..

  29,881 మంది రైతుల త్యాగం..

  29,881 మంది రైతుల త్యాగం..

  మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్ ఏపీని మూడు ముక్కలు చేసి తన అవినీతి భాగస్వాములకు పంచాలనుకుంటున్నారని, 29,881 మంది రైతులు త్యాగం చేసింది ఇందుకోసం కాదని గుర్తించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ‘‘మీ మూడు ముక్కలాటకు ఇప్పటికే 64 మంది రాజధాని రైతులు, రైతు కూలీలు బలయ్యారు. వారి త్యాగాలను పణంగా పెట్టే మీ ఆటలు సాగనివ్వం. 200 రోజులుగా రైతులు ఆందోళన చేస్తుంటే తేలిగ్గా తీసుకుంటారా?'' అని ప్రశ్నించారు. అమరావతి ఉద్యమం కేవలం రాజధాని రైతు సమస్య మాత్రమే కాదని, జగన్ విధ్వంసకర పాలనకు వ్యతిరేకంగా జరుగుతోన్న పోరాటమని లోకేశ్ పేర్కొన్నారు.

  సాయిరెడ్డికి సీఎం జగన్ షాకిచ్చారా?.. వైసీపీలో ఎంపీ బాధ్యతలకు భారీ కోత.. సజ్జలకు పెద్ద పీట..

  కచ్చితంగా తుగ్లక్ చర్యనే..

  కచ్చితంగా తుగ్లక్ చర్యనే..

  అమరావతి నిర్మాణాన్ని నిలిపేస్తూ జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రఖ్యాత జర్నలిస్టులు జాతీయ విషాదంగా పేర్కొన్నారని, ఏవిధంగా చూసినా జగన్ తీసుకున్నది తుగ్లక్ నిర్ణయమేనని, తద్వారా అద్భుతమైన రాజధానిని నిర్మించుకునే అవకాశాన్ని దూరం చేశారని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. మొక్కవోని దీక్షతో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నరైతులను ఆయన అభినందించారు. రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని ట్విటర్ లో పేర్కొన్నారు. టీడీపీకే చెందిన మరో నేత బుద్ధా వెంకన్న స్పందిస్తూ.. ప్రజలను ప్రజా ఉద్యమాన్ని కాదని అమరావతిలో ఇటుక కూడా కదల్చలేరని, అయినాసరే ప్రభుత్వం ముందుకు వెళితే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.

  వైఎస్సార్ అంటే అర్థమిదే..

  వైఎస్సార్ అంటే అర్థమిదే..

  ఏడాది కాలంగా పూర్తిగా పరిపాలనకే సమయం కేటాయించిన సీఎం జగన్.. త్వరలోనే పార్టీ వ్యవహారాలపై దృష్టిసారిస్తానని చెప్పడం, ఆక్రమంలోనే జిల్లాల వారీగా పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యతను ముగ్గురు సీనియర్ నేతలకు అప్పగిస్తూ ఆదేశాలివ్వడం తెలిసిందే. ముగ్గురు నేతలకు మాత్రమే బాధ్యతలు ఇవ్వడాన్ని బట్టి వైసీపీ పంథా, పేరుకు అర్థం కూడా మారిపోయినట్లు భావించాలని టీడీపీ నేత దేవినేని ఉమ అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వై అంటే వైవీ సుబ్బారెడ్డి అని, ఎస్ అంటే సాయిరెడ్డి అని, ఆర్ అంటే (సజ్జల)రామకృష్ణారెడ్డి అని చదువుకోవాలన్నారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో పార్టీ పేరుపై వివాదం నెలకొన్న దరిమిలా ఉమ ఇలా వెటకారం చేశారు.

  English summary
  amid amaravati Capital City protests to complete 200 days on Saturday, tdp launches 200 Days Of Amaravati Protests campaign on friday. chandrababu and other tdp leader slams cm jagan and ysrcp govt.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more