వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్టీఫెన్‌సన్ ఇంటికి, బాబు-రేవంత్‌లతో..: ఓటుకు నోటులో మత్తయ్య కీలకం, అప్రూవర్‌గా మారితే!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో జెరూసలేం మత్తయ్య కీలక నిందితుడు. ఈ కేసులో ఇతను కీలక భూమిక పోషించాడని ఏసీబీ అభియోగం మోపింది. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సిన్హాలు అరెస్టయినప్పుడు మత్తయ్య తప్పించుకున్నాడు.

Recommended Video

Cash For Vote Scam : KTR Blackmailed Me Says Mathaiah

చదవండి: ఓటుకు నోటు కేసులో ఊహించని మలుపు, సుప్రీం కోర్టుకు మత్తయ్య

అతను ఏపీలోని పలు ప్రాంతాల్లో తలదాచుకున్నట్లుగా భావించారు. నాలుగో నిందితుడు మత్తయ్య లేడు కాబట్టి రేవంత్ సహా వారికి బెయిల్ ఇవ్వవద్దని నాడు ఏసీబీ కోర్టులో వాదించింది. ఆ తర్వాత మత్తయ్య హైకోర్టులో తనపై కేసు నమోదు చేయకుండా చూడాలని పిటిషన్ వేశాడు.

జెరూసలేం మత్తయ్య

జెరూసలేం మత్తయ్య

ఆ తర్వాత రేవంత్ రెడ్డి సహా నిందితులకు బెయిల్ వచ్చింది.
అప్పటి నుంచి పరిణామాలు వేగంగా మారాయి. కేసు కూడా నత్త నడకన సాగుతోందనే విమర్శలు వచ్చాయి. ఓటుకు నోటు సమయంలో మత్తయ్య.. స్టీఫెన్ సన్ ఇంటికి వెళ్లాడు.

నామినేటెడ్ ఎమ్మెల్యేకు రూ.5 కోట్ల ఆఫర్, రూ.50 లక్షలు

నామినేటెడ్ ఎమ్మెల్యేకు రూ.5 కోట్ల ఆఫర్, రూ.50 లక్షలు

నాడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు టీడీపీ స్కెచ్ వేసిందని, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.5 కోట్ల ఆఫర్ ఇచ్చిందని, ఆ తర్వాత రేవంత్ రెడ్డి రూ.50 లక్షలు ఇస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

మత్తయ్య పిటిషన్ అంగీకరిస్తే కీలక పరిణామాలు

మత్తయ్య పిటిషన్ అంగీకరిస్తే కీలక పరిణామాలు

ఫోన్ సంభాషణల్లో చంద్రబాబు మాట్లాడినట్లుగా భావిస్తున్నారు. ఇప్పుడు మత్తయ్య పిటిషన్ సుప్రీం కోర్టు అంగీకరిస్తే కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు.

సంబంధం లేదు

సంబంధం లేదు

ఇరువర్గాలకు జెరూసలేం మత్తయ్యనే మధ్యవర్తిగా పని చేశాడని భావిస్తున్నారు. ఇప్పుడు అప్రూవర్‌గా మారితే అతను ఏం చెబుతాడనేది ఆసక్తికరంగా మారింది. తనకు ఓటుకు నోటుకు, ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధం లేదని చెబుతున్నాడు.

అన్నీ చెబుతా

అన్నీ చెబుతా

తాను అన్ని విషయాలు చెబుతానని, తనకు న్యాయవాది అవసరం లేకుండానే చెబుతానని మత్తయ్య చెప్పారు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, చంపుతామని బెదిరిస్తున్నారని చెప్పారు. ఓటుకు నోటు కేసు సమయంలో స్టీఫెన్ సన్ ఇంటికి వెళ్లి అతని కొడుకుతో క్రిస్టియన్ కమ్యూనిటీ వ్యవహారాలు మాట్లాడినట్లు మత్తయ్య చెప్పారు. మరోవైపు టీడీపీ ప్లీనరీ సందర్భంగా రేవంత్, చంద్రబాబులతో మాట్లాడినట్లు చెప్పారు.

English summary
Jerusalem Mathaiah, accused in vote for scam, approaches Supreme Court in cash for vote on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X