• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అశోక్ గజపతి రాజుకు ఎన్ఐఎ ఉచ్చు: 2017 నాటి రైలు ప్రమాదంతో లింక్: మోడీకి సాయిరెడ్డి లేఖ

|

అమరావతి: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగుతోన్న వేళ.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి కీలక అంశాన్ని తెర మీదికి తీసుకొచ్చారు. 2017లో విజయనగరం జిల్లాలో చోటు చేసుకున్న హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదాన్ని ప్రస్తావించారు. 40 మంది ప్రయాణికుల ప్రాణాలను బలి తీసుకున్న ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ చేపట్టిన విచారణ నివేదికను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతి రాజుతో ఈ ప్రమాదాన్ని ముడిపెట్టారు విజయసాయి రెడ్డి.

హిరాఖండ్ ప్రమాదంపై..

హిరాఖండ్ ప్రమాదంపై..

2017లో విజయనగరం జిల్లా కూనేరు రైల్వే స్టేషన్ సమీపంలో హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. నాటి ఘటనలలో 40 మంది దుర్మరణం పాలయ్యారు. 70 మందికి పైగా గాయపడ్డారు. దీనిపై ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్ఐఏతో విచారణ జరిపించింది. మావోయిస్టులు లేదా సంఘవిద్రోహ శక్తులు ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అప్పట్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ కూడా దర్యాప్తు జరిపించింది.

కేంద్రమంత్రిగా అశోక్ గజపతిరాజు..

కేంద్రమంత్రిగా అశోక్ గజపతిరాజు..

అప్పట్లో పౌర విమానయాన మంత్రిగా పని చేసిన అశోక్ గజపతి రాజు ఈ దర్యాప్తును ప్రభావితం చేశారని తాజాగా విజయసాయి రెడ్డి ఆరోపించారు. కమిషనర్ రైల్వే సేఫ్టీ నేరుగా అశోక్ గజపతి రాజు ఆధీనంలో ఉండేదని గుర్తు చేశారు. మానవ తప్పిదం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందంటూ వచ్చిన ఆరోపణలపై అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీతో దర్యాప్తు జరిపించిందని, ఇది ఎన్ఐఏ విచారణ బృందాన్ని తప్పుదారి పట్టించిందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

నక్సలైట్ల ప్రమేయం లేదంటూ..

నక్సలైట్ల ప్రమేయం లేదంటూ..

నక్సలైట్లు ఈ ఘటనకు కారణమంటూ మొదట్లో వార్తలొచ్చాయని, రైల్వే స్టేషన్ యార్డు సమీపంలోని ఆపరేటింగ్ క్యాబిన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుందని, ప్రమాదం చోటు చేసుకున్న ప్రదేశ్ 24 గంటల పాటు భద్రత సిబ్బంది పర్యవేక్షణలో ఉంటుందని పేర్కొన్నారు. నక్సలిస్టులు ప్రమాదం చోటు చేసుకున్న ప్రదేశానికి వచ్చే అవకాశమే లేదంటూ ఒడిశాలోని రాయగడ ఎస్పీ, ఆ రాష్ట్ర డీజీపీ ఇచ్చిన నివేదిక సైతం స్పష్టం చేసిందని సాయిరెడ్డి తన లేఖలో ప్రస్తావించారు. ఈ రైలు ప్రమాదం వెనుక నక్సలైట్లు లేదా సంఘ విద్రోహ శక్తుల ప్రమేయం ఏ మాత్రం లేదంటూ ఫోరెన్సిక్ నివేదిక తేల్చిందని చెప్పారు.

అత్యున్నత స్థాయి దర్యాప్తు..

అత్యున్నత స్థాయి దర్యాప్తు..

హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురై నాలుగేళ్లు దాటిన తరువాత కూడా జాతీయ దర్యాప్తు సంస్థ నుంచి ఎలాంటి కార్యాచరణ రాలేదని సాయిరెడ్డి అన్నారు. ఈ ఘటనలో ఉత్తరాంధ్ర, ఒడిశాకు చెందిన గిరిజనులు ప్రాణాలను కోల్పోయారని అన్నారు. ఈ ఘటన వెనుక ఉన్న అన్ని కోణాలను దర్యాప్తు చేయించాలని, బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ స్వేచ్ఛగా వారు సమాజంలో తిరుగాడుతోన్నారని చెప్పారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎన్ఐఏ లేదా మరో అత్యున్నత స్థాయి కమిటీతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.

English summary
YSR Congress MP Vijayasai Reddy writes a letter to PM Modi on the allegations to Ashok Gajapathi Raju and demads for NIA probe reports.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X