వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఐఏఎస్‌ అధికారులను ఒకేసారి భారీ సంఖ్యలో బదిలీ చేస్తూ ఎపి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏకంగా 21 మంది ఐఎఎస్ లను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ట్రాన్స్ ఫర్ చేసింది.

ఇలా బదిలీ అయిన వారిలో పలువురు సీనియర్ ఐఎఎస్ అధికారులు ఉండటం గమనార్హం. అంతేకాదు ఈ బదిలీల్లో కొంతమంది అధికారులు అంతకుముందు అంతగా ప్రాధాన్యం లేని శాఖలో ఉండగా తాజాగా కీలకమైన స్థానాలకు పోస్టింగ్ లు లభించడం, మరి కొంతమంది కీలక స్థానాల నుంచి లూప్ లైన్ పోస్టులకు బదిలీ కావడం జరిగింది. ఈ రెండు విధాలుగానే కాకుండా వీరిలో కొందరు ఐఎఎస్ లకు తామిప్పుడు పనిచేస్తున్న ప్రాధాన్యత కలిగిన ఉద్యోగం కంటే మరింత ప్రాధాన్యం కలిగిన స్థానాన్ని పొందడం విశేషం.

21 IAS Officers Transferred in Andhra pradesh

ఎపిలో తాజాగా ఐఎఎస్ అధికారులు బదిలీ అయిన స్థానం, వారి పేర్ల వివరాలు ఇవీ.

ఏపీపీఎస్సీ కార్యదర్శి - పి.కోటేశ్వర్‌
విజయనగరం కలెక్టర్‌ - హరిజవహర్‌ లాల్‌
విజయనగరం సంయుక్త కలెక్టర్‌ - కె.వెంకటరమణారెడ్డి
కడప జిల్లా కలెక్టర్‌ - చేవూరు హరికిరణ్‌
కడప జిల్లా సంయుక్త కలెక్టర్‌- టి.నాగరాణి
వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శి - టి.కె. రమామణి
సీసీఎల్‌ఏ కార్యదర్శి - జీఎస్‌ఆర్కేఆర్‌ విజయ్‌కుమార్‌
సీసీఎల్‌ఏ సంయుక్త కార్యదర్శి - ఎన్‌. ప్రభాకర్‌రెడ్డి
జీఏడీ ముఖ్య కార్యదర్శి - కె.ప్రవీణ్‌కుమార్‌
మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి - రామ్‌గోపాల్‌
ఆర్థిక శాఖ కార్యదర్శి - పీయూష్‌ కుమార్‌
విద్యాశాఖ ఉప కార్యదర్శి - హర్షవర్ధన్‌
వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌ - మురళీధర్‌రెడ్డి
అనంతపురం సంయుక్త కలెక్టర్‌ - ఢిల్లీరావు
పశ్చిమగోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్‌- ఎం.వేణుగోపాల్‌రెడ్డి
హస్తకళల అభివృద్ధి కార్పోరేషన్‌ ఎండీ - ఎం.వెంకటేశ్వర్లు
రాజమహేంద్రవరం మున్సిపల్‌ కమిషనర్‌- సుమిత్‌ కుమార్‌
గిరిజన సహకార కార్పోరేషన్‌ ఎండీ - బాబూరావు నాయుడు
బీసీ సహకార, ఆర్థికాభివృద్ధి కార్పోరేషన్‌ ఎండీ - బి.రామారావు
ఎస్సీ సహకార, ఆర్థిక కార్పోరేషన్‌ ఎండీ - వివేక్‌ యాదవ్‌
స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్‌ ఎండీ - మురళీధర్‌రెడ్డి
తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ వైస్‌ ఛైర్మన్‌ - విజయరామరాజు
జీఏడీ - ఏఎస్‌పీఎస్‌ రవిప్రకాశ్‌

వీరిలో జీఏడీకి రిపోర్టు చేయాలసిందిగా ఏఎస్‌పీఎస్‌ రవిప్రకాశ్‌కు ఆదేశాలు జారీచేయడం జరిగింది.

English summary
Amaravathi: In a major shake-up, 21 IAS officers were transferred on Sunday in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X