వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

24 గంటల్లో 210 పాజిటివ్ కేసులు: ఏపీలో కొనసాగుతోన్న కరోనా కేసుల ఉధృతి...

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో కూడా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఒకరోజులో ఏపీలో 210 పాజిటివ్ కేసులు రికార్డవడం ఆందోళన కలిగిస్తోంది. వీరిలో రాష్ట్రానికి చెందినవారు 161 మంది ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 41 మంది కాగా, 8 మంది విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. రాష్ట్రంలోని కొత్త హాట్ స్పాట్స్ నుంచి పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్టు తెలుస్తోంది.

సచివాలయంలోని ఉద్యోగులకు వైరస్ సోకిందని సమాచారం. ప్లానింగ్, ఆర్టీజీఎస్, రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఒక్కొక్కరి చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనిని ఉద్యోగ సంఘం నేతలు కూడా ధృవీకరించారు. వాస్తవానికి ఆరోగ్య సేతు యాప్ వాడుతున్న ఉద్యోగులను మాత్రమే అనుమతిస్తున్నారు. కానీ సచివాలయం కరోనా హాట్ స్పాట్‌గా మారడం ఒకింత ఆందోళన కలిగిస్తోంది.

210 positive cases recorded in andhra pradesh

Recommended Video

APEMC Collect Industrial Wastage For Recycling || వ్యర్థాలు సేకరించి,శుద్ధి చేసే బాధ్యత ఇక ఏపీదే !

గత 24 గంటల్లో నమోదైన 210 పాజిటివ్ కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4 వేల 460కి చేరింది. వైరస్ తగ్గడంతో 2 వేల 601 మంది ఇంటికి వెళ్లిపోయారు. ప్రస్తుతం 1786 మంది రోగులకు వైద్యం అందజేస్తున్నారు. వైరస్ సోకి చనిపోయిన వారి సంఖ్య 73కి చేరింది. రాష్ట్రంలో 40 వేల పైచిలుకు పరీక్షలు చేయగా పాజిటివ్ రేటు 1.02 శాతంగా ఉంది. అదే తెలంగాణలో మాత్రం కాస్త ఎక్కువగానే ఉంది. మొత్తానికి ఏపీలో కేసుల సంఖ్య 3588కు చేరుకున్నాయి.

English summary
last 24 hours 210 positive cases recorded in andhra pradesh health officials said in statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X