వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

23..23..23: వైఎస్ అభిమానులు గ‌ట్టిగా అనుకున్నారు..అయిపోయింది!

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP CM 2019: 23..23..23 అని వైఎస్ అభిమానులు గ‌ట్టిగా అనుకున్నారు.. అయిపోయింది! || Oneindia Telugu

అమ‌రావ‌తి: అప్పుడ‌ప్పుడూ కొన్ని అనూహ్య సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటుంటాయి. అలాంటివి రాజ‌కీయాల్లో కూడా న‌మోదు కావ‌డం ఆశ్చ‌ర్యమే. గ‌ట్టిగా అనుకుంటే ఏదైనా సాధించ‌వ‌చ్చ‌ని మ‌రోసారి నిరూపిత‌మైంది. తాజాగా వెలువుడిన అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఈ విష‌యాన్ని నిరూపించాయి. 23..23..23. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు ఈ అంకెతో చాలా గ‌ట్టి అనుబంధ‌మే ఉంది. ఈ అంకెల కోసం క‌ల గ‌న్నారు. దాన్ని సాధించుకున్నారు కూడా.

23 మంది వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసిన తెలుగుదేశం పార్టీ.. మే 23వ తేదీన వెలువ‌డే ఫ‌లితాల్లో 23 అసెంబ్లీ స్థానాల‌కే ప‌రిమితం కావాల‌ని పార్టీ అభిమానులు గ‌ట్టిగా అనుకున్నారు. అది కాస్తా వాస్త‌వ రూపాన్ని సంత‌రించుకుంది.

నేను చూసా..నేను విన్నా.. నేను ఉన్నా: ప్ర‌జా విశ్వాసం నిల‌బెట్టుకుంటా: జ‌గ‌న్ తొలి సందేశం..!నేను చూసా..నేను విన్నా.. నేను ఉన్నా: ప్ర‌జా విశ్వాసం నిల‌బెట్టుకుంటా: జ‌గ‌న్ తొలి సందేశం..!

23 is the Very important figure in YSRCP, But Why? the answer is here!

2014 నాటి ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. 102 అసెంబ్లీ స్థానాలను సాధించుకుంది. ప్ర‌భుత్వాన్ని న‌డిపించ‌డానికి అవ‌స‌ర‌మైన వాటి కంటే అధిక సంఖ్య‌లో అసెంబ్లీ సీట్లు ఉన్న‌ప్ప‌టికీ.. కుదురుగా కూర్చోలేదు అప్ప‌టి ముఖ్య‌మంత్రి, ఇప్ప‌టి మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాస‌న స‌భ్యుల‌కు గాలం వేశారు. 67 మంది ఎమ్మెల్యేల‌తో ఏర్ప‌డిన ప్ర‌తిప‌క్షాన్ని బ‌ల‌హీనం చేయ‌డానికి చేయాల్సిన‌వ‌న్నీ చేశారు.

అయిదు కాదు ప‌దీ కాదు.. ఏకంగా 23 మందిని త‌మ పార్టీలోకి లాగేసుకున్నారు. ఉన్న 67 మందిలో 23 మంది శాస‌న‌స‌భ్యులు, ఇద్ద‌రు లోక్‌స‌భ స‌భ్యులు పార్టీ ఫిరాయించారు. మాన‌సికంగా అప్ప‌టి ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని మాన‌సికంగా దెబ్బ‌కొట్ట‌డానికి విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు. ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో న‌లుగురికి చంద్ర‌బాబు కేబినెట్‌లో స్థానం క‌ల్పించారు. ఏ పార్టీ నుంచి శాస‌న‌స‌భ‌కు ఎన్నిక‌య్యారో, అదే పార్టీకి శాప‌నార్థాలు పెట్టారు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు.

23 is the Very important figure in YSRCP, But Why? the answer is here!

ఇవ‌న్నీ వైఎస్ఆర్ సీపీ అభిమానుల్లో తీవ్ర ఆగ్ర‌హాన్ని క‌లిగించాయి. 2019 ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీకి 23 అసెంబ్లీ స్థానాల‌ను మాత్ర‌మే ద‌క్కాల‌ని అనుకున్నారు. మే 23వ తేదీన వెలువడిన‌ ఫ‌లితాల్లో టీడీపీ గెలుచుకున్న అసెంబ్లీ స్థానాల సంఖ్య 23 కావ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం.

లోక్‌స‌భ స‌భ్యుల విష‌యంలోనూ అంతే. అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు లోక్‌స‌భ స‌భ్యుల‌ను త‌మ పార్టీ వైపు తిప్పుకొంది. కొత్త‌ప‌ల్లి గీత (అర‌కు), బుట్టా రేణుక (క‌ర్నూలు), దివంగ‌త ఎస్పీవై రెడ్డి (నంద్యాల‌). ప్ర‌భుత్వం ఏర్పాటైన తొలిరోజుల్లోనే ఈ ముగ్గురూ తెలుగుదేశంలో చేరిపోయారు. అయిదేళ్ల పాటు కొన‌సాగారు. 2016 ఎన్నిక‌ల‌కు ముందు బుట్టా రేణుక మ‌ళ్లీ సొంత‌గూటికే వ‌చ్చారు. ఎస్పీవై రెడ్డి క‌న్నుమూశారు. కొత్త‌ప‌ల్లి గీత కొత్త‌గా ఓ పార్టీ పెట్టి తెర‌మ‌రుగ‌య్యారు. అద‌లావుంచితే- ఈ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ మూడంటే మూడు ఎంపీ సీట్ల‌ను మాత్ర‌మే గెలుచుకోగ‌లిగింది. ఆ మూడు కూడా గెలుచుకోవ‌డానికి కిందా మీదా ప‌డాల్సి వ‌చ్చింది.

English summary
23 is the important figure in the YSR Congress Party. In TDP Government led by Chandrababu make horse trade of YSR Congress Party. 23 MLAs elected from YSRCP joined in TDP. Now, May 23rd results, TDP won only 23 Assembly seats in the fresh Elections. YSR Congress Party routed to Telugu Desam Party in Andhra Pradesh Assembly and Lok Sabha Elections, TDP won 23 seats only out of 175.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X