వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలర్ట్ .. 24 గంటల్లో కోస్తాంధ్రకు భారీ వర్షం ...

|
Google Oneindia TeluguNews

విశాఖపట్టణం : వాయవ్య బంగాళాఖాత పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం వచ్చే 24 గంటల్లో మరింత బలపడునుంది. దీనికి అనుంబంధంగా ఆవరించిన ఉపరితల ఆవర్తనంతో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

సోమ, మంగళవారం చాలా చోట్ల, బుధవారం కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు అల్పపీడన ప్రభావంతో రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలుస్తోంది. రాయలసీమలో సోమ, మంగళవారం కొన్ని చోట్ల ..

24 hours after coasta andhra heavy rains

బుధవారం అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు. ఇటు మరోవైపు విశాఖపట్టణంలో ఇప్పటికే భారీ వర్షం కురిసింది. మరోవైపు హైదరాబాద్‌లో కూడా కుండపోత వర్షం కురిసింది. దీంతో ప్రధాన ప్రాంతాల్లోని రహదారులు జలమయమయ్యాయి. రోడ్డుపై వర్షపునీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.

English summary
northwest Bay of Bengal is expected to intensify over the next 24 hours. The Visakha Meteorological Center said heavy rains would be accompanied by a periodic surface periodicity. As a result, mild to moderate rains are likely to occur in coastal Andhra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X