వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంకా లభ్యం కాని 25 మంది అచూకి..ఉత్తరాఖండ్ బృందాలతో సహయక చర్యలు

|
Google Oneindia TeluguNews

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు వద్ద గోదావరిలో ప్రమాదానికి గురైన రాయల్‌ వశిష్ట బోటు ప్రమాదంలో సహయచర్యలకు చీకటి పడడంతో బ్రేక్ పడింది. రెండు హెలి కాప్టర్లతో పాటు ప్రత్యేక బృందాల ద్వార గాలింపు చర్యలు చేపట్టినప్పటికి రాత్రి ఎనిమిది గంటల వరకు 8 మృతదేహాలను మాత్రమే వెలికి తీయగల్గిగారు. మధ్యహ్నం గాలింపు చేపట్టిన ప్రయోజం లేకపోవడంతో ఉత్తరఖండ్ నుండి ప్రత్యేక బృందాలు సహయాక చర్యలు చేపట్టనున్నారు.

<strong>కచ్చులూరు.. మృత్యు మలుపు: తెలిసి.. తెలిసీ మృత్యుముఖంలోకి !</strong>కచ్చులూరు.. మృత్యు మలుపు: తెలిసి.. తెలిసీ మృత్యుముఖంలోకి !

రేపు కూడ సహయక చర్యలు

రేపు కూడ సహయక చర్యలు

కాగా ప్రమాదం జరిగిన సమయంలో లాంచీలో మొత్తం 71మంది ఉన్నట్లు సమాచారం. వారిలో 61మంది ప్రయాణికులు కాగా, 10మంది లాంచీ సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యహ్నం నుండి సహయ చర్యలు చేపట్టిన అధికారులు 2 హెలికాప్టర్లు, 6 అగ్నిమాపక సిబ్బంది బృందాలతో పాటు నేవీ, గజ ఈతగాళ్ళతో సహయక చర్యలు కొనసాగుతున్నాయి. సహయక చర్యలకు సంబంధించి ఏపీ మంత్రులు, అధికారులు సహయక చర్యలను పర్వవేక్షిస్తున్నారు. ఇక ప్రమాదానికి గురైనవారు ఎక్కువగా తెలంగాణకు చెందిన వారే ఉండడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ సంఘటన స్థలానికి హుటాహుటిన బయలు దేరారు.

71లో సురక్షితంగా బయటపడ్డ 27 మంది

71లో సురక్షితంగా బయటపడ్డ 27 మంది

కాగా రాత్రీ ఎనిమిది గంటల వరకు అందిన సమాచారం ప్రకారం మొత్తం 71 మంది ప్రయాణికుల్లో 27 మంది సురక్షితంగా బయటపడ్డారిని అధికారిక సమాచారం అందించారు... కాగా ఎనిమిది మంది మృతదేహాలను కనుగొన్నట్టు తెలిపారు. ప్రమాదానికి గురైన వారిలో 25 మంది అచూకి తెలియాల్సిన అవసరం ఉంది. వీరి అచూకి కోసం ప్రస్తుతం చేపడుతున్న గాలింపు చర్యలకు బ్రేక్ పడింది. ప్రమాదం జరిగిన చోట వరద ఎక్కువగా ఉండడంతో భాదితుల ఆచూకి కనుగొనడం కోసం ఉత్తరాఖండ్ నుండి ప్రత్యేక టెక్నాలజీ గల బృందాలను రప్పించనున్నారు. వారి సహయంతో సోమవారం ఉదంయ గాలింపు చర్యలు చేపట్టనున్నారు.

లభ్యం కాని 25 మంది ఆచూకి

లభ్యం కాని 25 మంది ఆచూకి

ప్రమాదానికి గురైన వారు మృతి చెందినట్టయితే అవి సముంద్రంలోకి కొట్టుకుపోకుండా రాజమండ్రి బ్రిడ్జి వద్ద వలలు ఏర్పాటు చేసేందుకు అధికారులు యత్నిస్తున్నారు. మరోవైపు ఉత్తరాఖండ్ నుండి వచ్చే బృందాలు ఏవైన మృతదేహాలు బురదలో కూరుకు పోయినట్టయితే వాటిని కనుగునే అవకాశం ఉంది. మొత్తం మీద ప్రమాద సంఘటనలో ఇంకా 25 మంది వరకు ఆచూకి లభించాల్సిన అవసరం ఉంది.

English summary
A Royal Veshita boat accident in Godavari has been broken due to darkness. Only eight bodies were recovered until eight o'clock at night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X