కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పత్తికొండలో భారీగా బాంబుల స్వాధీనం.. మళ్లీ ఫ్యాక్షన్ రాజుకుందా ?.. ఎవరిని హతమార్చేందుకు..?

|
Google Oneindia TeluguNews

రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు. బాంబుల సంసృతితో నిత్యం హత్యలు, గోడవులు జరిగేవి. కానీ ప్రస్తుతం పరిస్థితులు చాలా వరకు మారాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో మళ్లీ ఆ ఫ్యాక్షన్ మళ్లీ రాజుకుంటుందా? అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇటీవల పలు చోట్ల నాటు బాంబులు బయటపడడమే ఇందుకు నిదర్శనమని సందేహలు వ్యక్తం అవుతున్నాయి.. తాజాగా పత్తికొండ పట్టణంలో భారీగా నాటు బాంబులు బయటపడ్డాయి. దీంతో ఒక్క సారిగా స్థానికులు ఉలిక్కిపడ్డారు.

 ఒకే ఇంట్లో 25 నాటు బాంబులు స్వాధీనం

ఒకే ఇంట్లో 25 నాటు బాంబులు స్వాధీనం


పత్తికొండలో ఎరుకలి సుంకన్న, ఎల్లప్ప ఇంట్లో 25 నాటు బాంబులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పట్టణ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే దీనిపై గోప్యంగా విచారణ జరుపుతున్నారు. అడవి పందుల వేట కోసం ఈ పేలుడు పదార్థాలను తెచ్చారా..? లేకా.. ఎవరినైనా హతమార్చెందుకు కుట్ర జరుతోందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ పేలుడు పదార్థాలపై మీడియా ప్రతినిధులు వివరాలను అడిగినా పోలీసులు దాటవేత ధోరణి అవలంభిస్తున్నారు. దీనిపై పోలీసులకు ఎవరినుంచైనా ఒత్తిళ్లు ఉన్నాయా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

పొలంలో బాంబు పేలుడు.. ఇద్దరు మహిళలకు గాయాలు

పొలంలో బాంబు పేలుడు.. ఇద్దరు మహిళలకు గాయాలు

ఇటీవల పొలంలో పనులు చేసుకుంటున్న సమయంలో నాటు బాంబు పేలి ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు గాయపడ్డ మహిళలను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పంట పొలంలో బాంబు పేలుడుతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఈ ఘటనపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించడంతో ఫ్యాక్షన్ జోన్ పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తును వేగవంతం చేశారు.

 బాంబుల తయారీ సూత్రధారులు ఎవరు.. ఎవరి కోసం..

బాంబుల తయారీ సూత్రధారులు ఎవరు.. ఎవరి కోసం..

ధర్యాప్తులో భాగంగా ఎరుకలి ఎల్లప్ప, సుంకన్నలను పోలీసులు తమదైన శైలిలో విచారించారు. వారి ఇంటిలో నిల్వ ఉంచిన 25 నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కసారిగా పెద్దమొత్తంగా నాటు బాంబులు వెలుగులోకి రావడంతో చుట్టుపక్కల కాలనీవాసులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ బాంబుల తయారీ సూత్రధారులు ఎవరు..? ఎందు కోసం తయారు చేశారో అన్న కోణంలో మరింత దర్యాప్తు చేయాల్సి ఉందని అన్ని విషయాలను త్వరలోనే వెల్లడిస్తామని పత్తికొండ సీఐ ఆదినారాయణ రెడ్డి తెలిపారు. పత్తికొండలో ఇంత భారీ ఎత్తున నాటుబాంబులు లభ్యం కావడం వెనుక ఎవరి హస్తం ఉంటుందన్న చర్చ ప్రజల్లో జోరుగా సాగుతుంది. దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని పోలీసులను కోరుతున్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

English summary
Pathikonda police 25 bomb seixed.. will the faction politics again?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X