హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హిమాచల్ నదిలో 24 మంది సిటీ విద్యార్థులు గల్లంతు

By Pratap
|
Google Oneindia TeluguNews

Beas Rive
హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి సమీపంలో గల బియాస్ నదిలో 25 మంది హైదరాబాద్ విద్యార్థులు గల్లంతయ్యారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్లు సమాచారం. నది పక్కన ఫొటోలు దిగుతుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. లర్జీ హైడ్రో పవర్ ప్రాజెక్టు డ్యాం గేట్లు తెరవడంతో ఒక్కసారిగా వచ్చిన వరదలో వారు కొట్టుకుపోయినట్లు సమాచారం. ఈ నెల 3వ తేదీన విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యులు 48 మంది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి విజ్ఞాన యాత్రకు వెళ్లారు. 45 మంది విద్యార్థులు కాగా, ముగ్గురు ఫ్యాకల్టీ సభ్యులు

బాచుపల్లిలో గల విఎన్నారై విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ విద్యార్థుల విజ్ఞాన యాత్రలో ఈ విషాద సంఘటన జరిగింది. సంఘటనను హిమాచల్ ప్రదేశ్ డిజిపి ధ్రువీకరించారు. గాలింపు, సహాయ చర్యలు సాగుతున్నాయని ఆయన చెప్పారు. ఈ ప్రమాదంతో కుల్లు - మనాలీ రహదారిని మూసేశారు. ప్రమాదం జరిగిన స్థలం కులుమనాలీకి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది.

కొట్టుకుపోయినవారిలో 18 మంది అబ్బాయిలు, ఆరుగురు అమ్మాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. విద్యార్థులతో ముగ్గురు ఫ్యాకల్టీ సభ్యులు ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ సంఘటతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రాత్రి కావడంతో సహాయక చర్యలు సాగడం లేదు. సోమవారం ఉదయం సహాయక చర్యలు చేపట్టనున్నారు. మిగిలిన విద్యార్థులకు సంఘటనా స్థలానికి సమీపంలోని మాతా మందిర్ వద్ద ఆశ్రయం కల్పించినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రధాన కార్యదర్సి రాజీవ్ శర్మ చెప్పారు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడారు. తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన మీడియా ప్రతినిధులకు వివరించారు. ముఖ్యమత్రి కె. చంద్రశేఖర రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. హోం మంత్రి నాయని నర్సింహా రెడ్డి హిమాచల్ ప్రదేశ్ బయలుదేరి వెళ్లారు. ఆయనతో అధికారుల బృందం కూడా ఉంది. మృతులు ఎంత మంది అనేది తెలియరాలేదని అనురాగ్ శర్మ చెప్పారు.

ఫ్యాకల్టీ సభ్యుడు కిరణ్ నేతృత్వంలో విద్యార్థులు విజ్ఞాన యాత్రకు వెళ్లారు. ఆగ్రా నుంచి ఎస్వీ ట్రావెల్‌కు చెందిన రెండు బస్సుల్లో విద్యార్థులు అక్కడికి వెళ్లినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే ట్రావెల్ బస్సుల డ్రైవర్లు, క్లీనర్లు అక్కడి నుంచి పారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఫ్యాకల్టీల సెల్‌ఫోన్లు కలవడం లేదని కళాశాల ప్రిన్సిపాల్ హైదరాబాదులో చెబుతున్నారు. మండి ఎస్పీతో తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ మాట్లాడారు.

సంఘటన పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు సహాయ చర్యలు చేపట్టాలని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. జిల్లా రెవెన్యూ అధికారి వి ఆశోక్ కుమార్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యులతో, బంధువులతో సమన్వయం చేయడానికి ఈ కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.

నోడల్ ఆఫీసర్ ఫోన్ నెంబర్లు - 040-23202813, 9440815887

English summary
At least 25 Engineering students from Hyderabad were feared washed away by the Beas river near Mandi in Himachal Pradesh, officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X