వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌న‌సేన‌-వామ‌ప‌క్షాల పొత్తు: 26 అసెంబ్లీ..4 లోక్‌స‌భ సీట్లు కావాలి : ప‌వ‌న్ అంగీక‌రించేనా..!

|
Google Oneindia TeluguNews

ఏపిలో ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ..రాజ‌కీయంగా ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్ప‌టికే వ చ్చే ఎన్నిక‌ల్లో వామ‌పక్షాల‌తో క‌లిసి పోటీ చేస్తామ‌ని..మ‌రే పార్టీతో పొత్తు ఉండ‌ద‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ప్ర‌క‌టిం చారు. అందులో భాగంగా..వామ‌ప‌క్ష నేత‌ల‌తో స‌మావేశం జ‌రిగింది. అందులో వామ‌ప‌క్ష నేత‌లు తామె పోటీ చేయాల‌ని భావిస్తున్న సీట్ల‌ను జ‌న‌సేన ముందు ప్ర‌తిపాదించారు.

కామ్రేడ్లు కోరుకుంటోంది ఇదే..
వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఏపిలో జ‌న‌సేన‌- వామ‌ప‌క్షాల పొత్తులో భాగంగా త‌మ‌కు కావాల్సిన సీట్ల పై వామ‌ప‌క్ష నేత‌లు త‌మ ప్ర‌తిపాద‌న‌లు చేసారు. అందులో భాగంగా.. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని 26 శాసనసభ స్థానాలు, నాలుగు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తామని ప్రతిపాదించాయి. తమకు బలం ఉన్న స్థానాల జాబితాతో సహా జనసేనతో చర్చలు ప్రారంభించాయి.

ఇప్పటికే విశాఖలో ఒకసారి వామపక్ష పార్టీల జాతీయ నాయకులతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ భేటీ అయ్యారు. జనసేన రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నాయకుడు, శాసనసభ మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ వామపక్ష నేతలతో సమావేశమయ్యారు. ఏవేవి, ఎన్ని స్థానాలన్న అంశంపై తుది నిర్ణయం తీసుకోనప్పటికీ ఏ జిల్లాలో వారు వేటిని కోరుతున్నారన్న అంశంపై చర్చించారు.

పవన్ కళ్యాణ్ టార్గెట్ 60, వైసీపీ-టీడీపీ పరిస్థితి ఇదేనా?: జగన్‌ను అలా దెబ్బకొట్టారు!పవన్ కళ్యాణ్ టార్గెట్ 60, వైసీపీ-టీడీపీ పరిస్థితి ఇదేనా?: జగన్‌ను అలా దెబ్బకొట్టారు!

26 assembly and 4 Loksabha seats : Left parties demand Janasena..!

ప‌వ‌న్ అంగీకరించేనా..!
వామ‌ప‌క్ష నేత‌లు త‌మ‌కు కావాల్సిన స్థానాల పై చేసిన ప్ర‌తిపాద‌న‌ల పై ప‌వ‌న్ దృష్టి సారించారు. వామ‌ప‌క్ష నేత‌లు ప్ర‌తిపాదించిన ఆయా స్థానాల్లో ఎవరి బలమెంత? గతంలో ఆ పార్టీలకు వచ్చిన ఓట్లు, జనసేనకు ఉన్న బలంపై పార్టీ వద్ద ఉన్న నివేదికల ఆధారంగా జ‌న‌సేన నేత‌లు నివేదిక‌లు కోరారు. ఆ నివేదిక‌లు..అక్క‌డి ప్ర‌త్య‌ర్ధి పార్టీల బ‌లాబలా ల ఆధారంగా పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌తో రెండు మూడు రోజుల్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

ప్రతి జిల్లా నుంచి సీపీఐ, సీపీఎం చెరో స్థానాన్ని కోరుతున్నాయి. చెరో రెండు లోక్‌సభ స్థానాలు కూడా కావాలంటున్నాయి. అయి తే, ప్రతీ సీటు కీల‌కంగా మారుతున్న ప‌రిస్థితుల్లో ఒక ర‌కంగా వామ‌ప‌క్ష నేత‌లు కోరుతున్న సీట్ల సంఖ్య ఎక్కువ‌నే అభి ప్రాయం వ్య‌క్తం అవుతోంది. దీంతో..ఇప్పుడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ఈ విష‌యంలో ఎటువంటి నిర్ణ‌యం తీసుకుం టారు..వారికి ఏ సీట్లు కేటాయిస్తార‌నే దాని పై జ‌న‌సైనికులు ఆస‌క్తి క‌రంగా చూస్తున్నారు.

English summary
Janasena-Left Parties alliance and seat shares discussions going on. Left parties demanded 4 loksabha seats and 26 assembly seats for CPI and CPM. Janasena chief Pawan Kalyan will take decision with in four days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X